నీ కోసం ఎదురు చూస్తుంటా.. భారమైన హృదయంతో అవినాష్ బయటకు.. అరియానా కన్నీటి వీడ్కోలు

బిగ్‌బాస్ ఇంటి నుంచి జబర్దస్త్ కమెడియన్ అవినాష్ ఎలిమినేట్ అయ్యాడు. వైల్డ్ కార్డు ఎంట్రీగా ఇంట్లోకి ప్రవేశించిన అవినాష్ దాదాపు 10 వారాలపాటు ఇంటి సభ్యులకు, ప్రేక్షకులకు బోలెడంత వినోదాన్ని పంచాడు. చివరికి 13వ వారంలో పోటీపోటిగా సాగిన ఎలిమినేషన్‌లో దురదృష్టం వెంటాడింది. అవినాష్ ఎలిమినేషన్ పక్రియ ఆదివారం ఎలా సాగిందంటే...

13వ వారం కూడా సండే ఫన్ డేగా

13వ వారం కూడా సండే ఫన్ డేగా

13వ వారాంతంలో ఎప్పటిలానే సండే ఫన్ డేగా మారింది. ఇంటి సభ్యులతో నాగార్జున ఫన్ గేమ్స్ ఆడించారు. ఇంటి సభ్యుల అలవాట్లు, వ్యక్తిగత విషయాల ఆధారంగా ఓ గేమ్ ఆడించాడు. ఆ గేమ్‌లో సోహెల్ విజేతగా నిలిచాడు. అలా ఇంటి సభ్యులను వినోదంలో ముంచెత్తాడు హోస్ట్ నాగార్జున.

ఆవుతో ప్రేమగా మాట్లాడితే..

ఆవుతో ప్రేమగా మాట్లాడితే..

రోడ్ టూ ఫినాలో ఉపయోగించిన ఆవును ఇంటి లాన్‌లోకి తెచ్చి ఎలిమినేషన్ ప్రక్రియను మొదలుపెట్టారు. నామినేట్ అయిన సభ్యుడు ఆవు వద్దకు వెళ్లి దానిని ప్రేమగా ముద్దు చేస్తూ మాట్లాడాలి. ఎవరు మాట్లాడుండగా ఆవు అంబా అంటుందో ఆ వ్యక్తి ఎలిమినేషన్ నుంచి సేవ్ అవుతారు అని రూల్ చెప్పారు. ఇంటి సభ్యులు తమ ప్రయత్నాలు చేయగా.. అభిజిత్ మాట్లాడుతుండగా ఆవు అంబా అని అరిచింది. దాంతో అభిజిత్ సేవ్ అయ్యాడు.

మ్యూజిక్ గేమ్‌తో హుషారుగా

మ్యూజిక్ గేమ్‌తో హుషారుగా

ఆ తర్వాత మ్యూజిక్ ప్రధానంగా సాగిన మరో గేమ్‌ను ఇంటి సభ్యులతో ఆడించాడు. లవ్, ఫన్, ఎమోషన్స్ అంశాల ఆధారంగా ఇంటి సభ్యులతో డ్యాన్స్ చేయించారు. స్లింగ్ షాట్ ద్వారా పాటలను ఎంపిక చేసుకొని తనకు నచ్చిన పాటను ఇంటి సభ్యులకు అంకితం చేసే గేమ్ పూర్తి చేశారు.

విజిల్ వేసి గెలిచిన హారిక దేత్తడి

విజిల్ వేసి గెలిచిన హారిక దేత్తడి

ఇక వినోద కార్యక్రమాల మధ్య ఎలిమినేషన్ కొనసాగించిన హోస్ట్ నాగార్జున.. మిగిలిని అవినాష్, మోనాల్ గజ్జర్, హారికతో ఎలిమినేషన్ ప్రక్రియను సాగించాడు. ముగ్గురికి విజిల్స్ ఇచ్చి ఊదమన్నాడు. ఎవరి విజిల్ నుంచి సౌండ్ వస్తుందో వాళ్లు సేవ్ అవుతారని చెప్పాడు. అలా హారిక ఊదిన విజిల్ నుంచి శబ్దం రావడంతో ఆమె సేవ్ అయ్యారు.

అవినాష్, మోనాల్ గజ్జర్‌తో ఎలిమినేషన్ ప్రక్రియ

అవినాష్, మోనాల్ గజ్జర్‌తో ఎలిమినేషన్ ప్రక్రియ

ఇక చివరిగా అవినాష్, మోనాల్ గజ్జర్ నామినేషన్‌లో మిగిలారు. వారిద్దరు ముందు మ్యాజిక్ జార్స్ పెట్టి.. అందులో ఓ పరికరం ద్వారా ఎరుపు రంగు నీళ్లను పోయాలని చెప్పారు. ఎవరి జాడి ఎరుపుగా మారుతుందో వాళ్లు అవుట్ అని చెప్పారు. ఇద్దరు జాడిలోకి రంగు పోయగా అవినాష్‌ది ఎరుపు రంగుగా మారిపోయింది. దాంతో అవినాష్ ఎలిమినేట్.. మోనాల్ సేవ్ అని చెప్పాడు.

అవినాష్ అంటూ అరియానా కన్నీటి పర్యంతం

అవినాష్ అంటూ అరియానా కన్నీటి పర్యంతం

దాంతో అవినాస్ ఇంటి సభ్యులతో సెల్ఫీ దిగి.. అక్కడ నుంచి హోస్ట్ నాగార్జున వేదిక వద్దకు చేరుకొన్నారు. ఇంటి నుంచి వెళ్లిపోవడానికి ముందు అరియానా చాలా ఎమోషనల్ అయ్యారు. అవినాష్ దారుణంగా మిస్ అవుతున్నాను అంటూ కంటతడి పెట్టింది. వేదిక మీద అవినాష్ జోక్ చేస్తుండగా కూడా బాధలోనే కనిపించింది. అయితే అవినాష్ చేసిన కొన్ని జోకులకు అరియానా నవ్వడంతో హ్యాపీ మూమెంట్ కనిపించింది. నీ కోసం వెయిట్ చేస్తుంటాను అంటూ అరియానాకు అవినాష్ బయటకు వెళ్లాడు.

Recommended Video

Bigg Boss Telugu 4 : Rahul Sipligunj Slams Trollers
అభిజిత్‌పై బిగ్‌బాంబ్ వేసి

అభిజిత్‌పై బిగ్‌బాంబ్ వేసి

ఇక ఇంటి నుంచి బయటకు వెళ్లున్న అవినాష్‌కు బిగ్ బాంబు వేసే అవకాశాన్ని ఇచ్చాడు. బిగ్ బాంబు ప్రకారం ఇంటిలో ఆ వ్యక్తి వారం రోజుల పాటు ఎలాంటి పని చేయకుండా ఉండాలి. అయితే అవినాష్ తన బిగ్‌బాంబును అభిజిత్ మీద వేశాడు. ఇక వారం రోజుల పాటు హ్యాపీగా ఏ పని చేయకుండా రెస్ట్ తీసుకొనే అవకాశం అభికి కలిగింది. ఇలాంటి ఎమోషనల్ మూమెంట్స్ మధ్య అవినాష్ తన బిగ్‌బాస్ ప్రయాణాన్ని ముగించాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X