Don't Miss!
- News తండ్రైన ముఖ్యమంత్రి: తొలి నేతగా రికార్డ్
- Technology 6.67 అంగుళాల డిస్ప్లే, ట్రిపుల్ కెమెరాతో వివో కొత్త ఫోన్... లాంచ్, స్పెసిఫికేషన్ల వివరాలు..!
- Sports IPL 2024: రెండుగా చీలిన ముంబై ఇండియన్స్.. హార్దిక్ మాట వినని రోహిత్ గ్రూప్!
- Automobiles నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్‌లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
సక్కదనాల పిల్ల మోనాల్ తల్లి.. బిగ్‌బాస్ ఇలియానా పెళ్లి చేసుకొంటే ఉతికి పారేస్తది అంటూ దుమ్మురేపిన అవినాష్
బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షోలో 89వ రోజు అవినాష్ తన ప్రతిభను మరోసారి బయటపెట్టారు. టాస్క్ జరుగుతున్న సమయంలో ఎన్నెన్నో జన్మల బంధం అంటూ పాట అందుకొన్న జబర్దస్త్ కమెడియన్ తాజాగా ఇంటిలో హరికథను, ఒగ్గుకథను మిక్స్ చేసి ఆకట్టుకొన్నారు. ఇంటి సభ్యుల గురించి ఒగ్గు కథ చెబుతూ
ఆహ్మదాబాద్ నుంచి రామ సక్కదనాల పిల్ల
ఊరు కాని ఊరు.. దేశం కానీ దేశం.. ఆహ్మదాబాద్ నుంచి వచ్చింది రామ సక్కదనాల పిల్ల మరీ మా మోనాల్ తల్లి. భాష అర్ధం కాకపోయినా.. రామ రామా.. బిగ్‌బాస్ హౌస్‌లోనా.. రామ రామా.. ఒక్క ఊపు ఊపుతున్నదిరో.. రామ రామా అంటూ పద్యాన్ని ఒగ్గు కథ రూపంలో అవినాష్ అందుకొన్నారు.
తెలంగాణ, ఆంధ్రాలో ఊపేస్తూ
మాలాంటి యువ కుర్ర కారును ఒక ఊపు ఊపుతూ.. మామూలుగా కాదు. అటు తెలంగాణ, ఇటు ఆంధ్రాలో ఓ ఊపు ఊపుతున్నది అంటూ అవినాష్ పాడుతుండగా.. మోనాల్ గజ్జర్ నవ్వుతూ అవినాష్ వంక చూసింది. ఇక అవినాష్ పాటకు సోహెల్ వంత పడుతూ కనిపించారు. దాంతో ఇంటిలో ఊపు, జోష్ కనిపించింది.
అరియానా ఇలియానా అంటూ
ఇక మోనాల్ తర్వాత అరియానాపై అవినాష్ పాట కట్టాడు. బిగ్‌బాస్ ఇంటిలో మరో పిల్ల ఉంది. చూడటానికి బక్కగా ఉంటుంది. కానీ చూడటానికి మామూలుగా మూమాలూగా కాదు అంటూ ఊరిస్తూ.. సినిమా ఇండస్ట్రీలో ఇలియానా ఉంటే.. బిగ్‌బాస్ ఇంటిలో మరో ఇలియానా ఉంది అంటూ అరియానాపై పొగడ్తల వర్షం కురిపించాడు.
పెళ్లి చేసుకొంటే ఉతికి పారేస్తది..
ఇలియానా లాంటి అరియానా అమ్మాయిని చూస్తే ఎవరైనా పెళ్లి చేసుకోవాలనుకొంటాడు. కానీ చేసుకొన్న తర్వాత ఆ పోరి కింద మీద చేసి.. ఉతికి ఉతికి ఆరేస్తది. ఏమన్నా అంటే స్ట్రెయిట్ ఫార్వర్డ్ అంటది. ఏమన్నా అంటే గిట్లనే ఉంటా అంటది. ఏమైనా అంటే గిట్ల చేయాలంటది. ఏమైనా అంటే ఇట్లా అదుముకుంటదయ్యో అంటూ అరియానా జాతకాన్ని అవినాష్ ఒగ్గుకథ రూపంలో చదివారు.
ఎవరైనా అడ్డొస్తే.. దేత్తడి పోచమ్మ గుడి
ఆ తర్వాత హారిక దేత్తడి గురించి కథ చెబుతూ.. ఈ ఇంట్లో మరో పిల్ల ఉంది.. ఆమె కథ మామూలుగా ఉండదు. ఎవరైనా అడ్డొస్తే.. ఇచ్చి పడేస్తాది. పిల్ల చూస్తే.. పిల్ల చూస్తే పసి పిల్ల అనుకొంటారు. ఎవరైనా అడ్డొస్తే.. దేత్తడి పోచమ్మ గుడి అంటూ పాట పాడారు. ఈమె ఏందని అనుకొంటారు. కానీ కెప్టెన్సీ టాస్క్‌లో ఎనిమిదిసార్లు మగవాళ్లను, ఆడవాళ్లను ఢీకొట్టిందంటూ అవినాష్ ఒగ్గు కథ చెప్పాడు. ఇలా ఇంటి సభ్యులు ఆనందంగా తమ సమయాన్ని ఎంజాయ్ చేస్తూ కనిపించారు.