సోహైల్ నీవు పనికిరావు.. బిగ్‌బాస్ నన్ను ఎలిమినేట్ చేసుకో.. అవినాష్ ఆగ్రహం

అమీ తుమీ టాస్క్ సందర్భంగా సోహైల్ సయ్యద్ పక్షపాతంగా వ్యవహరించారనే ఆరోపణలు లేవనెత్తారు. అఖిల్ విషయంలోను, దివి విషయంలో వారికి సానుకూలంగా సోహైల్ వ్యవహరించడంపై అవినాష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సంచాలకుడు అంటే రెండు టీమ్‌లకు సమంగా న్యాయం చేయాలి. అంతేగానీ ఒకరికి అనుకూలంగా వ్యవహరించడం సరికాదు అంటూ అవినాష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారం సోహైల్, అవినాష్ మధ్య ఎలాంటి రచ్చకు దారి తీసిందంటే..

దివి, అఖిల్‌‌కు అనుకూలంగా

దివి, అఖిల్‌‌కు అనుకూలంగా

పేడ ఉన్న టబ్ నుంచి దివి కాలు బయటపెడితే సోహైల్ వారికి అనుకూలంగా వ్యవహరించాడు. అఖిల్‌ టాస్క్‌లో ఉంటే వాళ్ల సభ్యులు జోక్యం చేసుకొంటే సోహైల్ చూసుకొంటూ నిలుచుకొన్నాడు. సంచాలకుడిగా సోహైల్ నీవు పనికి రావు అంటూ అవినాష్ సీరియస్ అయ్యాడు. ఆ విషయంలో నేను క్లారిటీ ఇచ్చాను అంటూ సోహైల్ కామెంట్ చేస్తూ.. నేను దివి టాస్క్ గురించి మాట్లాడుతున్నా.. ఆ విషయంలో నీ నిర్ణయం తప్పు అంటున్నా అని అవినాష్ నిలదీశాడు.

సోహైల్ నీవు తప్పు చేసినట్టే కదా...

సోహైల్ నీవు తప్పు చేసినట్టే కదా...

దివి తన ఆటను ఆపేసి టబ్ నుంచి బయటకు వస్తే సోహైల్ వార్నింగ్ అంటూ ఆమెకు మళ్లీ ఆడే అవకాశం ఇచ్చారు. సంచాలకుడి పని తీరుపై నేను చాలా క్లారిటీతో మాట్లాడుతున్నాను. నీవు కోపగించుకొన్నా పర్వాలేదు. గేమ్‌లో వార్నింగ్‌లు ఏమిటి భయ్యా. సంచాలకుడిగా నా ఇష్టం అంటే తప్పు చేసినట్టే కాదా అంటూ సోహైల్‌ను ప్రశ్నించాడు.

 సంచాలకుడిగా నీవు కరెక్ట్ కాదు..

సంచాలకుడిగా నీవు కరెక్ట్ కాదు..

సంచాలకుడిగా సోహైల్ కరెక్ట్ కాదు. ఎందుకంటే స్కూల్లో చిన్న పిల్లలు హోం వర్క్ చేయకపోతే వార్నింగ్ ఇస్తున్నానానే విధంగా వ్యవహరిస్తే కుదరదు అని అవినాష్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. అయితే చిన్నపిల్లల్లా అనే పదం వాడకంటూ సోహైల్ హెచ్చరించినట్టు మాట్లాడాడు.

బిగ్‌బాస్ నన్ను ఎలిమినేట్ చేసుకో

బిగ్‌బాస్ నన్ను ఎలిమినేట్ చేసుకో

దాంతో అవినాష్ ఆగ్రహంతో ఊగిపోయాడు. బిగ్‌బాస్ ఇలా పక్షపాతంగా ఆడితే.. ఇక నుంచి నేను టాస్క్‌లు ఆడను. కావాలంటే నన్ను ఎలిమినేట్ చేసుకో. సంచాలకుడిగా నేను ఇష్టం వచ్చినట్టు చేస్తా అంటే కుదరదు. పొద్దున్నుంచి కష్టపడి ఆడుతుంటే సంచాలకుడిగా సోహైల్ తనకు నచ్చినట్టు నిర్ణయాలు తీసుకోవడం బాధగా ఉంది అని అవినాష్ అన్నాడు. నీకు ఆడటం రాకపోతే ఆడకు అని సోహైల్ అంటే.. నేను ఎలా ఆడుతానో ఇక్కడ అందరికీ తెలుసు అని అవినాష్ గట్టిగా జవాబిచ్చాడు.

Recommended Video

Bigg Boss Telugu 4 : Abhijeet, Sohel Fight | Silver Coins Task Made Housemates Furious
నాది సేఫ్ గేమ్ అంటావా?

నాది సేఫ్ గేమ్ అంటావా?

మమల్ని సేఫ్ గేమ్ ఆడుతున్నారని అనడంపై అవినాష్ భగ్గుమన్నారు. ఒక టీమ్‌కు సపోర్ట్ చేసుకొంటూ ఆడటం వారిది సేఫ్ గేమ్ కాదా? గేమ్‌ను గేమ్‌లా ఆడకుండా సంచాలకుడు వ్యవహరించడం తప్పే. నాది సేఫ్ గేమ్ అంటారా? నాకు కోపం వచ్చినప్పుడు ఇలానే ఉంటా. నవ్వించాల్సి వచ్చినప్పుడు నవ్విస్తాను. నేను జాగ్రత్తగా ఆడటానికే వచ్చా. నాకు సిట్యువేషన్‌ను బట్టి కోపం వస్తుంది అంటూ అవినాష్ ఊగిపోయారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X