నాకు పెళ్లి కాలేదు.. నీవు అర్ధం చేసుకోవడం లేదు.. ఆ విషయంపై అరియాకు అవినాష్ క్లాస్
బిగ్‌బాస్ ఇంటిలో అరియానా, అవినాష్ మధ్య కెమిస్ట్రీ మంచి హ్యూమర్‌ను క్రియేట్ చేస్తున్నది. వారి మధ్య ఉన్న సున్నిత, సన్నిహిత బంధం ఆరోగ్యకరమైన కామెడీని జనరేట్ చేస్తున్నది. దాంతో ఇంటిలోని ఆ జంటపై ప్రేక్షకులకు ప్రత్యేకమైన ఆసక్తి పెరుగుతున్నది. ప్రతీ ఎపిసోడ్‌లో వారి కంటెంట్ ఆడియెన్స్‌ను ఆకట్టుకొనేలా బిగ్‌బాస్ ప్లాన్ చేస్తున్నారు. 40వ రోజు జరిగిన ఎపిసోడ్‌లో వారి మధ్య జరిగిన ఓ సీరియస్ టాపిక్ ఏమిటంటే..

ఇంటిలోని క్లీనింగ్ గురించి
ఇంటిలో క్లీనింగ్ విషయంపై అరియానాతో అవినాష్ తీరిగ్గా చర్చ పెట్టారు. ఓ ఇంటి సభ్యుడి పేరు చెప్పకుండానే అతడు అలా చేయడం సరికాదు. క్లీన్‌గా ఉంచుకోవడం చేతకాకపోతే ఎలా అంటే.. నీ పని నీవు చేస్తున్నావు కదా అంటూ అరియానా అన్నారు. దాంతో నేను ఊడ్చను. వేరే వారితో నేను ఇన్‌ఫ్లూయెన్స్ కాను. నా పని నేను చేసుకొంటాను. నీ పని నీవు చేసుకో. ఇతరుల గురించి ఆలోచించకు అంటూ అరియానా తెలిపారు.

నిన్ను తిట్టాలనిపిస్తున్నదంటూ అవినాష్
ఇది వాళ్ల ఇల్లు కాదు మన ఇల్లు. అతడికి సపరేట్‌గా ఉంటే వదిలేద్దాం. కానీ మనం అంతా కలిసి ఉంటున్నాం. అందుకే క్లీన్‌గా ఉంచుకోవాలని చెబుతున్నాను. నీవు తిక్క తిక్కగా ఇలా మాట్లాడితే నిన్ను తిట్టాలనిపిస్తుంది. అందరం కలిసి ఉంటున్న సమయంలో చెత్తలో కూర్చొని తింటావా? ఎవరి పని వాళ్లు చేయాలి. మరొకరి పని నీవు ఎందుకు చేస్తావు. ఇక్కడే కాదు ఇంట్లో కూడా మన పనులు మనం చేసుకొంటున్నాం కదా అంటూ అవినాష్ క్లాస్ పీకాడు.

మన ఇంట్లో పని మనం చేసుకొంటాం
బిగ్‌బాస్ ఇంటిని వదిలేస్తే.. నాకు పెళ్లి కాలేదు. నాతో తల్లిదండ్రులు ఉండటం లేదు. మన షూటింగులు మనం చేసుకొంటూ ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో పనులు నేను చేసుకొంటాను. ఇంటిని నేను శుభ్రం చేసుకొంటాను. కింద చూడు ఎంత చెత్త వేశారో చూడు అవినాష్ అంటే.. నీ ఏరియా వరకు నీవు క్లీన్ చేసుకో. వారిది వదిలేయ్ అంటూ అరియానా సలహా ఇచ్చింది.
Recommended Video

మా ఇంట్లో నేను క్లీన్ చేసుకొంటా
నాకు పనిచేయడం రాదు. నేను ఇలానే ఉంటా అంటే కుదరదు. మన ఇంటిలో కూడా ఇలాంటి పనులు మనమే చేస్తాం కదా.. నా ఇంట్లో గిన్నెలు నేనే తోముకుంటా. నా ఇల్లు నేను ఊడ్చుకొంటాను. అంతేగాని ఇక్కడి వచ్చినంత మాత్రాన మన బేసిక్స్ మరిచిపోవద్దు అనే విధంగా అవినాష్ క్లాస్ పీకారు. ఆ తర్వాత మెహబూబ్, దివి ఇంటిలోని డైనింగ్ ఏరియాలో క్లీనింగ్ చేస్తూ కనిపించారు. ఇలా అరియానా, అవినాష్ మధ్య జరిగిన డిస్కషన్ ఆసక్తిగా కొనసాగింది.


Click it and Unblock the Notifications











