పుచ్చలు లేస్తాయి అంటూ రెచ్చిపోయిన మెహబూబ్.. రౌడీయిజం చేయకు అవినాష్ వార్నింగ్

తెలుగు బిగ్‌బాస్ సీజన్ 4లో 30వ రోజు బీబీ హోటల్ టాస్క్‌తో కొనసాగింది. హోటల్ స్టాఫ్‌కు, రిచ్ పీపుల్స్ మధ్య చిచ్చు పెట్టేందుకు సీక్రెట్ టాస్క్ ఆడుతున్న అవినాష్ ప్రయత్నించారు. హోటల్ సర్వీస్ బాగాలేదన్న కారణంగా ఇంట్లో గొడవ జరిగింది. మెహబూబ్ రెచ్చిపోవడంతో అవినాష్ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఇంతకు ఇంటిలో ఏం జరిగిందంటే..

బిర్యానీలో వెంట్రుక రావడంతో

బిర్యానీలో వెంట్రుక రావడంతో

బీబీ హోటల్‌కు వచ్చిన అతిథులు మెహబూబ్, సోహైల్‌కు సరైన ఫుడ్ పెట్టుకోకుండా ఇబ్బంది పెట్టారు. సోహైల్‌కు పెట్టిన బిర్యానీలో వెంట్రుక రావడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత బిర్యానీలో పిన్ను రావడంతో మళ్లీ గొడవ జరిగింది. సరైన ఫుడ్ పెట్టడం లేదు. సరైన సర్వీస్ లేదని సోహైల్ అసంతృప్తిని వ్యక్తం చేశారు.

స్విమ్మింగ్ పూల్‌లో దూకిన అమ్మా రాజశేఖర్ మాస్టర్

స్విమ్మింగ్ పూల్‌లో దూకిన అమ్మా రాజశేఖర్ మాస్టర్

గెస్టుగా వచ్చిన మెహబూబ్ హోటల్ స్టాఫ్‌లోని సిబ్బంది అమ్మా రాజశేఖర్‌కు ఓ టాస్క్ ఇచ్చారు. 100 సార్లు స్విమ్మింగ్ పూల్‌లో దూకాలని చెప్పారు. అలా చేస్తే 3000 టిప్ ఇస్తానని చెప్పాడు. టాస్క్ మేరకు అమ్మా రాజశేఖర్ 100 సార్లు స్విమ్మింగ్ పూల్‌లో దూకి టాస్క్ పూర్తి చేశారు. ఆ తర్వాత వెయిట్ లిఫ్టింగ్‌తో భుజాలపై గుంజీలు తీయాలని టాస్క్ పెడితే దానిని అభిజిత్ పూర్తి చేశాడు. లాస్య, సుజాతకు హారిక ఓ టాస్క్ ఇచ్చింది. బీన్ బ్యాగులోని మొత్తం బీన్స్‌ను లెక్కించి నంబర్‌ను చెప్పాలని సూచించింది.

పుచ్చలు ఎగిరిపోతాయని మెహబూబ్

పుచ్చలు ఎగిరిపోతాయని మెహబూబ్


ఇక ఇంటిలో సర్వీస్ విషయంలో అభిప్రాయ బేధాలు రావడంతో ఒక గ్రూప్‌పై మరో గ్రూప్‌ అరుచుకొన్నది. ఈ క్రమంలో మెహబూబ్ రెచ్చిపోయి ఎవడైనా ఎక్కువ మాట్లాడితే.. పుచ్చలు ఎగిరిపోతాయి అంటూ రెండు మూడుసార్లు అరిచాడు. మెహబూబ్ అరవడంతో అఖిల్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

మర్యాదగా మాట్లాడు.. మాటలు జారకు అంటూ అవినాష్

మర్యాదగా మాట్లాడు.. మాటలు జారకు అంటూ అవినాష్

అయినా మెహబూబ్‌ అలాగే రెచ్చిపోతుండటంతో అవినాష్ రంగంలోకి దిగి.. ఎవడు అంటూ మాట జారకు. మర్యాదగా మాట్లాడు అంటూ వార్నింగ్ ఇచ్చాడు. పుచ్చలు లేచిపోతాయంటే పడటానికి ఎవరు లేరు. రౌడీయిజం చేయడానికి నీ ఊరు కాదు. ఇది బిగ్‌బాస్ హౌస్ అంటూ మెహబూబ్‌కు గట్టిగా అవినాష్‌ వార్నింగ్ ఇచ్చారు. దాంతో మధ్యలో ఇంటి సభ్యులు వచ్చి సముదాయించడంతో అక్కడితో గొడవ ఆగింది.

ఆర్టిస్టులమనే విషయాన్ని పక్కన పెడితే

ఆర్టిస్టులమనే విషయాన్ని పక్కన పెడితే

మెహబూబ్‌ ఏమనుకొంటున్నారో అర్థం కావడం లేదు. ఆర్టిస్టులమనే విషయాన్ని, బిగ్‌బాస్ హౌస్ అనే అంశాన్ని పక్కన పెడితే హైదరాబాద్‌లో ఏం చేయాలో అది చేస్తాను. ఎవడు.. పుచ్చలు అంటూ మాట్లాడితే పడటానికి, ఊరుకోవడానికి ఎవరు తక్కువ కాదు. గేమ్ గేమ్‌లా ఆడాలి అంటూ అవినాష్ ఇంటిసభ్యులతో అన్నాడు.

Recommended Video

Bigg Boss Telugu 4 : Fake Voting Says Swati Dixit
కంటతడి పెట్టిన హారిక

కంటతడి పెట్టిన హారిక

ఇక 31వ రోజు కూడా ఇంటిలో బీబీ టాస్క్‌ కొనసాగుతూనే ఉంది. గెస్టుల నుంచి స్టార్స్, టిప్స్ పొందడానికి హోటల్ సిబ్బంది ప్రయత్నిస్తుండగా, వాటిని ఇవ్వకుండా ఏదో కారణం చెప్పడానికి గెస్టులు ప్రయత్నిస్తున్నారు. ఇక అభిజిత్ చేతిలో 5 స్టార్లు పెట్టిన హారిక ఇరుక్కుపోయింది. పదే పదే బిగ్‌బాస్ కెమెరా ముందుకు వచ్చి నేను ఒకటే స్టార్ ఇచ్చాను. ఐదు స్టార్స్ ఇవ్వలేదని ఓ దశలో కంటతడి పెట్టుకోవడం కనిపించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X