చలాకీ చంటి లేటెస్ట్ హెల్త్ అప్‌డేట్: ఇంకా ఐసీయూలోనే.. డాక్టర్లు ఏం చెప్పారంటే!

సుదీర్ఘ కాలంగా అటు బుల్లితెరపై, ఇటు వెండితెరపై తనదైన కామెడీతో ప్రేక్షకులను నవ్విస్తూ స్టార్ కమెడియన్‌గా దూసుకుపోతోన్నాడు చలాకీ చంటి. జబర్ధస్త్ ద్వారా ఎనలేని క్రేజ్‌ను సొంతం చేసుకున్న అతడు.. వరుసగా ఆఫర్లను అందుకుంటూ సత్తా చాటుతోన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఈ ఫేమస్ కమెడియన్ గుండెపోటుకు గురైన విషయం తెలిసిందే. అప్పటి నుంచి అతడి ఆరోగ్యం గురించి ఎన్నో రకాల ప్రచారాలు జరుగుతోన్నాయి. ఈ నేపథ్యంలో చలాకీ చంటి ఆరోగ్య పరిస్థితిపై తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. ఆ వివరాలను మీరే చూడండి!

కమెడియన్ చంటికి హార్ట్ ఎటాక్:గతంలో వరుస పెట్టి షోలు, సినిమాలు చేసిన చలాకీ చంటి.. ఈ మధ్య కాలంలో మాత్రం బయట పెద్దగా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలోనే ఆదివారం ఉదయం అతడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడని తెలిసింది. దీంతో చలాకీ చంటి ఆ వెంటనే స్పృహ తప్పి పడిపోయాడని అంటున్నారు. ఆ తర్వాత అతడికి గుండెపోటు వచ్చిందని స్పష్టం అయినట్లు సమాచారం.

Jabardasth Chalaki Chanti Latest Health Condition Report

చంటిని ఆస్పత్రికి తరలించారు:సుదీర్ఘ కాలంగా తెలుగులో స్టార్ కమెడియన్‌గా వెలుగొందుతోన్న చలాకీ చంటి తాజాగా గుండెపోటుకు గురయ్యాడు. ఆదివారం ఉదయం అతడికి ఛాతిలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు వెలంటనే హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది. అక్కడ వైద్యులు చంటికి గుండెపోటు వచ్చినట్లు గుర్తించినట్లు తెలిసింది. దీంతో వెంటనే వైద్యం మొదలెట్టారు.

ఐసీయూలోనే చంటికి చికిత్స:గుండెపోటుకు గురైన తర్వాత చలాకీ చంటిని హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా.. అక్కడి వైద్యులు అతడిని ఐసీయూకు తరలించారని తెలిసింది. అప్పటి నుంచి అతడికి పలు రకాల వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు కొన్ని రకాల చికిత్సలను సైతం అందించినట్లు తెలుస్తోంది. ఈ వైద్యానికి చలాకీ చంటి స్పందించినట్లు కూడా ఓ న్యూస్ వైరల్ అవుతోంది.

Jabardasth Chalaki Chanti Latest Health Condition Report

ఫ్యాన్స్ ఆందోళన.. చెప్పట్లేగా:జబర్ధస్త్ ఫేమస్ కమెడియన్‌ చలాకీ చంటి గుండెపోటుకు గురైనట్లుగా వార్తలు అన్ని మీడియాల్లోనూ ప్రచారం అయ్యాయి. కానీ, కుటుంబ సభ్యుల నుంచి మాత్రం ఎలాంటి సమాచారం తెలియడం లేదు. దీంతో అతడి పరిస్థితి ఎలా ఉందోనని అభిమానులు తెగ టెన్షన్ పడుతున్నారు. ఈ క్రమంలోనే చలాకీ చంటి త్వరగా కోలుకోవాలి రావాలి అంటూ కోరుకుంటున్నారు.

చలాకీ చంటి తాజా పరిస్థితి:చంటి గుండెపోటుకు గురైనట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో.. అతడి గురించి ఎలాంటి సమాచారం అధికారికంగా రావడం లేదు. అయితే, ఈ కమెడియన్‌కు అత్యంత సన్నిహితంగా ఉండేవాళ్లు మాత్రం కొన్ని వివరాలను మీడియాతో పంచుకున్నట్లు తాజాగా తెలిసింది. దీని ప్రకారం.. ప్రస్తుతం చంటి కోలుకుంటున్నాడట. అంటే దాదాపుగా ప్రాణాపాయం తప్పిందని సమాచారం.

Chalaki Chanti

వైద్యులు కూడా అదే మాట:విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. చలాకీ చంటి తీవ్రమైన గుండెపోటుతో ఆస్పత్రిలో చేరాడని తెలిసింది. అయితే, కుటుంబ సభ్యులు సకాలంలోనే అతడిని ఆస్పత్రికి తీసుకు రావడంతో పాటు అన్ని రకాల చికిత్సలను అందించడంతో ప్రాణాపాయం తప్పిందని వైద్యులు చెప్పినట్లు ఓ న్యూస్ వైరల్ అవుతోంది. దీంతో అతడి ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకుంటున్నారు.

అప్పటి వరకూ ఐసీయూలో:చలాకీ చంటి ఆరోగ్యం గురించి అందుతోన్న తాజా సమాచారం ప్రకారం.. అతడికి ప్రస్తుతానికి ప్రాణాపాయం అయితే తప్పిందట. కానీ, పూర్తిగా కోలుకునే వరకూ ఐసీయూలోనే ఉంచి చికిత్సను అందించాలని వైద్యులు చెప్పినట్లు తెలిసింది. అన్నీ మంచిగా జరిగితే ఈ రెండు రోజుల్లోనే చంటిని జనరల్ వార్డుకు షిప్ట్ చేసి.. ఆ తర్వాత డిశ్చార్జ్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X