ఆఖరికి వాళ్ళ పెళ్లాల వద్ద కూడా.. ఆ రూమర్స్ సృష్టించడం వల్లే నాకు ఈ పరిస్థితి.. చలాకి చంటి!

జబర్దస్త్ షోతో పాపులర్ అయిన కమెడియన్స్ లో చలాకి చంటి కూడా ఒకరు. జబర్డస్త్ తీసుకు వచ్చిన పాపులారిటీతో చలాకి చంటి పలు చిత్రాల్లో అవకాశాలు అందుకున్నాడు. కమెడియన్ గా మంచి గుర్తింపు పొందాడు. బుల్లి తెరపై కొన్ని షోలకు హోస్ట్ గా కూడా పనిచేశాడు. కానీ ప్రస్తుతం చలాకి చంటి కెరీర్ అంత జోరుగా లేదు. చంటికి అవకాశాలు బాగా తగ్గాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో చంటి మాట్లాడుతూ తనకు చిత్ర పరిశ్రమలో అవకాశాలు లేకపోవడంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీలో నాపై కొందరు సృష్టించిన రూమర్స్ వలనే ఈ పరిస్థితి ఏర్పడిందని చంటి తెలిపాడు.

బోల్డ్‌గా మాట్లాడడం వలనే

బోల్డ్‌గా మాట్లాడడం వలనే

తనకు సహజంగా బోల్డ్ గా మాట్లాడే స్వభావం ఉందని చంటి తెలిపాడు. అన్ని విషయాలలో ఉన్నది ఉన్నట్లు మాట్లాడతాను. అందుకే నాకు అవకాశాలు రావడం లేదు. దర్శకులకు నేను కనిపించినప్పుడు పలకరిస్తారు. కానీ గౌరవం ఇవ్వరు. అందుకు నాకు ఎలాంటి భాద లేదని చంటి తెలిపాడు. ఎందుకంటే వారంతా పెద్ద దర్శకులు. వారు గౌరవం ఇవ్వకపోయినా అవకాశాలు కోసం వెళ్లి కలుస్తుంటాను. అవకాశం ఉంటే చెబుతా. మేనేజర్ తో టచ్ లో ఉండు అని చెబుతారు.

ఆ రూమర్స్ సృష్టించడం వలనే

ఆ రూమర్స్ సృష్టించడం వలనే

దర్శకులకు నన్ను తీసుకోవాలనే ఆలోచన ఉంటుంది. కానీ వాళ్ళ చుట్టుపక్కల ఉన్నవాళ్లు చెడగొడుతారు. చలాకి చంటినా.. అతడు వద్దు సర్.. షూటింగ్స్ కి టైమ్ రాదంట. వాళ్ళతో నేనేప్పుడూ కలసి పనిచేయలేదు. కానీ నేను షూటింగులకు సమయానికి రానని రూమర్స్ క్రియేట్ చేస్తుంటారు. అందువలన నాకు దక్కాల్సిన అవకాశాలు ఎన్నో చేజారిపోయాయి అని అని చంటి తెలిపాడు. దర్శకులు ఆర్టిస్టులతో బాగానే మాట్లాడుతారు. కానీ వాళ్ళ మేనేజర్స్ మాత్రం కనీసం ఫోన్ చేసినా విసిగించుకుంటారు. ఎన్నిసార్లు ఫోన్ చేస్తావయా. డైరెక్టర్ తో నేను మాట్లాడుతాను కదా అని అంటారు.

 జీవితాలు నాశనం అయ్యాయి

జీవితాలు నాశనం అయ్యాయి

కొందరు దర్శకులు ఒక చోట కూర్చున్నప్పుడు నా గురించి మాట్లాడుకుంటారు. ఆ పాత్రకు చలాకి చంటి అయివుంటే అదిరిపోయేది. కానీ అతడు టైమ్ కి రాదంట అని మాట్లాడుకుంటారు. ఇదంతా దర్శకుల చుట్టూ ఉన్న వాళ్ళ వల్లే జరుగుతుంది. అది నిజం కాకపోయినా దర్శకులు అదే నిజమేమో అని అనుకుంటారు. ఇలాంటి పుకార్ల వలన చాలా మంది ఆర్టిస్టులు, హీరోయిన్ల జీవితాలు నాశనం అయ్యాయి అని చలాకి చంటి తెలిపాడు. దేవుడి దయవలన నాకు అవకాశాలు రాకున్నా నా కుటుంబం బాగానే ఉంది అని చంటి తెలిపాడు.

ఆఖరికి వాళ్ళ పెళ్లాల వద్ద కూడా

ఆఖరికి వాళ్ళ పెళ్లాల వద్ద కూడా

సినిమాలు నటించాక.. డబ్బులు అడిగితే ఆ విషయంలో మరో రూమర్ క్రియేట్ చేస్తారు. చంటి డబ్బు కోసం గొడవ పెట్టుకుంటాడు. అతడు వద్దులే అని ఇంకో దర్శకుడికి చెబుతారు. ఆర్టిస్టులు కృష్ణానగర్ కు అప్పులు చేసి వస్తుంటారని చంటి తెలిపారు. ప్రతి ఆర్టిస్టు వాళ్ళ గురించి వాళ్ళు డబ్బా కొట్టుకుంటూ.. అవకాశాల కోసం అవతలి వాళ్ళని కూడా నిత్యం పొగుడుతూనే ఉండాలి. ఆఖరికి వాళ్ళ పిల్లల వద్దకు వెళ్లి కూడా పొగడ్తలతో భజన చేయాలి. లేకుంటే అవకాశాలు ఉండవు.

హీరో ముఖమే మారిపోతుంది

హీరో ముఖమే మారిపోతుంది

కొందరు హీరోలు సెట్ లో ఉన్నపుడు కనీసం నవ్వకూడదు, జోక్ కూడా వేయకూడదు. సెట్ లో కామెడీ చేస్తే వెంటనే హీరో ముఖం మారిపోతుంది. ఇగో హర్ట్ అవుతుంది. కామెడీ చేస్తే నేనే చేయాలి అనే ఉద్దేశంతో వాళ్ళు ఉంటారు అని చంటి తెలిపాడు. సరదాగా మాట్లాడితే మీరు జబర్దస్త్ ఆర్టిస్టులు.. భలే కామెడీ చేస్తారు అని సెటైర్లు వేస్తారు అని చంటి తెలిపాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X