twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రాకేష్ మాస్టర్‌ను ఆడుకుంటున్న జబర్దస్త్.. నాడు హైపర్ ఆది నేడు చంటి.. ఏకిపారేస్తున్న టీమ్ లీడర్స్

    |

    రెండు తెలుగు రాష్ట్రాల్లో తన వ్యాఖ్యలతో, కామెంట్లతో సెన్సేషనల్‌గా మారాడు రాకేష్ మాస్టర్. సినీ ఇండస్ట్రీ, పెద్దల ముసుగులో ఉన్న బడా స్టార్లను ఏకిపారేస్తూ అందరి దృష్టిని ఆకర్షించాడు. ఎన్నో యేళ్ల నుంచి ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్.. ప్రస్తుతం యూట్యూబ్‌లో ఓ సంచలనం. ఆయన ఇంటర్వ్యూ కోసం యూట్యూబ్ చానెళ్లు వెంటపడుతూ ఉంటాయి. ఆయన ఇంటర్వ్యూ ఎంత ప్రత్యేకంగా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఎడా పెడా బూతుల వర్షం కురిపించడమే ఆయన ప్రత్యేకం. అలాంటి ఆయన్ను ఇమిటేట్ చేసి కించపరిస్తే ఊరుకుంటాడా.

     గతంలో హైపర్ ఆది..

    గతంలో హైపర్ ఆది..

    గతంలో హైపర్ ఆది ‘చెల్లెమ్మకు పెళ్లంటా.. అన్నయ్యకు సంబరం అంటా' రాకేష్ మాస్టర్ వేసినట్టు స్టెప్పులు, హావభావాలు ఇచ్చి ఇమిటేట్ చేశాడు. ఇక దీంతో రాకేష్ మాస్టర్ శివాలెత్తాడు. హైపర్ అదిని చెడామడా తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టాడు. మరి ఈ సారి ఏకంగా రాకేష్ మాస్టర్‌ వేషాన్ని, భాషను సెటైరికల్‌గా చూపించాడు జబర్దస్త్ చంటి.

     గతిలేని టీవీ..

    గతిలేని టీవీ..

    చంటి తన స్కిట్‌లో భాగంగా ఇంటర్యూలా ఉండే స్కిట్‌ను ప్లాన్ చేశాడు. అందులో భాగంగా బుల్లెట్ భాస్కర్ ఇంటర్వ్యూ చేసే వ్యక్తి. ముందుగా బుల్లెట్ భాస్కర్ వచ్చి.. ‘ఎంతో మందికి లైఫ్ ఇచ్చా... లైఫ్ ఇచ్చా అంటున్నాడు.. నిజంగా ఇతను లైఫ్ ఇచ్చాడా.. తెలుసుకుందాం అంటూ ‘చంటి మాస్టర్' అంటూ అందరికీ షాక్ ఇచ్చాడు.

    వేషధారణ, యాస..

    వేషధారణ, యాస..

    ఆ జుట్టు, ఆ పిలక అన్నీ రాకేష్ మాస్టర్ మాదిరిగానే ఉన్నాయి. పైగా చేతిలో ఆ మద్యం సీసా కూడా ఉండటంతో అందరికీ మరింత సులభంగా అర్థమవుతుంది. ఎందుకంటే రాకేష్ మాస్టర్ లైవ్‌లో తాగుతూ కూడా ఇంటర్వ్యూలు ఇస్తాడు. ఇక రాకేష్ మాస్టర్ ఊతపదంతో చంటి రెచ్చిపోయాడు.

    జఫ్పా అంటూ..

    జఫ్పా అంటూ..

    రాకేష్ మాస్టర్‌లా చేతిలో మందు బాటిల్ పట్టుకుని ‘అరేయ్ జప్ఫా.. ఎవడ్రా నువ్ అరేయ్'.. అంటూ శివాలెత్తాడు. కాస్త దగ్గరకు రారా అని బుల్లెట్ భాస్కర్ అనడంతో ‘ఏ ఇక్కడ ఉంటే తీయలేవా జప్ఫా' అంతూ మరోసారి రెచ్చిపోయాడు చంటి. ‘మీతో చేసిన వాళ్లు కార్లలో తిరుగుతుంటే మీ దగ్గర ఆటోకి కూడా డబ్బులు లేవు ఎందుకు'? అని చంటి మాస్టర్‌ని అడగ్గా.. ‘వెన్నుపోట్లు పొడిచి వెళిపోయారు లఫూట్ గాళ్లు'.. అంటూ రాకేష్ మాస్టర్‌లా ఇమిటేట్ చేశాడు.

    Recommended Video

    Jabardasth Comedian నా పెళ్లి జరగకపోతే అందుకు కారణం Sreemukhi, Jhansi నే
    పరోక్షంగా చంటికి పంచ్..

    పరోక్షంగా చంటికి పంచ్..

    అయితే ఇందులో చంటికి కూడా పంచ్ పడ్డట్టు కనిపిస్తోంది. మీరు సరిగ్గా పేమెంట్స్ ఇచ్చి ఉంటే వారంతా వెళ్లిపోయేవారు కాదు కదా? అని భాస్కర్ అనడంతో తన గతం గుర్తుకు వచ్చినట్టుంది. జబర్దస్త్‌లో తన టీమ్‌లో ఎంతో మంచి వచ్చి వెళ్లారు. ఇక భాస్కర్ అలా అనడంతో అందరూ ఫక్కున నవ్వేశారు. అయితే ఈ స్కిట్‌పై రాకేష్ మాస్టర్ ఎలాంటి కౌంటర్ వేస్తాడో చూడాలి మరి.

    English summary
    Jabardasth Chanti Imitates Rakesh Master In His Skit. in his lates skil chanti satirically imitates Rakesh Master.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X