పాములను పెంచుతున్న రష్మీ గౌతమ్.. అదిరిపోయే ట్విస్ట్.. షాక్ అవ్వాల్సిందే!

జబర్దస్త్ యాంకర్ గా రష్మీ గౌతమ్ బుల్లితెర ప్రేక్షకుల్లో ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందో. తన టాలెంట్ తో స్మాల్ స్క్రీన్ పై అంచెలంచెలుగా ఎదిగింది. జబర్దస్త్ కు రాకముందే రష్మీ గౌతమ్ సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ లో నటిస్తూ వచ్చింది. తనకు వచ్చిన అవకాశాలను అందించిపుచ్చుకుంటూ ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేసింది. కానీ అప్పట్లో పెద్దగా షైన్ కాలేకపోయింది. ఇక జబర్దస్త్ కామెడీ షో ద్వారా మాత్రం యాంకర్ గా తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. ఈ షో ద్వారా ఇప్పటికీ రష్మీ గౌతమ్ ప్రేక్షకులకు ఎంటర్ టైన్ మెంట్ ను అందిస్తోంది...

రష్మీ గౌతమ్ తెలుగు సినిమాలు..
నటిగా, టెలివిజన్ ప్రజెంటర్ గా రష్మీ గౌతమ్ మంచి పేరు సంపాదించుకుంది. సినిమాల విషయానికొస్తే.. ఉదయ్ కిరణ్ హోలీ, కరెంట్, ఎవరైనా ఎప్పుడైనా, బిందాస్, ప్రస్థానం వంటి చిత్రాల్లో నటించింది. ఇక తొలుత హీరోయిన్ గా కన్నడ చిత్రం 'గురు'లో అవకాశం అందుకుంది. అక్కడ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆ తర్వాత తెలుగులో గుంటూరు టాకీస్, అంతం, నెక్ట్స్ నువ్వే, అంతకు మించి, బొమ్మ బ్లాక్ బాస్టర్ వంటి చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది. చివరిగా 'హాస్టల్ బాయ్స్' మూవీలో మెరిసింది.

Jabardasth Comdian on Shocking Comments on Anchor Rashmi Gautam

మూగ జీవాలపై రష్మీ గౌతమ్ ప్రత్యేక శ్రద్ధ..
రష్మీ గౌతమ్ బుల్లితెరపై, వెండితెరపై మెరుస్తూ వస్తోంది. తన మంచి తనంతో టాలెంట్ తో ముందుకు వెళ్తోంది. ఇదే సమయంలో రష్మీ గౌతమ్ మూగ జీవాలపై ప్రేమను చూపిస్తూ ఉంటుంది. కరోనా సమయంలో, అంతకు ముందు, ఆ తర్వాత పెట్స్ కు ఆహారం, నీళ్లు, గాయపడ్డ పెట్స్ కు వైద్యం అందించడం వంటి కార్యక్రమాలతో మూగజీవాలపై తనకున్న ప్రేమను చాటుకుంటూ వస్తున్న సంగతి తెలిసిందే. కాగా తాజాగా జబర్దస్త్ లేటెస్ట్ ఎపిసోడ్ లోనూ కమెడియన్ ఇదే విషయాన్ని గుర్తుచేయడం ఆసక్తికరంగా మారింది.

జబర్దస్త్ లేటెస్ట్ ఎపిసోడ్ లో..
జబర్దస్త్ కామెడీ షో 2012 నుంచి తెలుగు బుల్లితెర ప్రేక్షకులను నిర్విరామంగా అలరిస్తున్న సంగతి తెలిసిందే. కాగా తాజాగా జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమో విడుదలైంది. జూన్ 13, జూన్ 14కు సంబంధించిన ఎపిసోడ్స్ షూట్ పూర్తవడంతో తాజాగా ఫన్ ఫిల్డ్ ప్రోమోను విడుదల చేశారు. అయితే ఆ ప్రమోలో రాకెట్ రాఘవా స్కిట్ లో రష్మీపై సెటైర్ వేసే ప్రయత్నం చేశారు. రష్మీ గౌతమ్ పాములను పెంచుతోందంటూ కామిక్ గా సెటైర్ వేస్తారు. నాగుల పంచమి ఉండటంతో పామును పెంచుతోందని సెటైర్ వేస్తాడు. అలా చేసిన స్కిట్ నవ్వులు పూయిస్తోంది. ఇక ఆ డైలాగ్ కు రష్మీ గౌతమ్ కూడా నవ్వి ఊరుకుంటుంది. కానీ ఆమె మూగ జీవాలపై ఎంతటి ప్రేమ చూపిస్తుందో తన అభిమానులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

రష్మీ గౌతమ్ రాబోయే చిత్రాలు..
చివరిగా రష్మీ గౌతమ్ 'భోళా శంకర్' చిత్రంలో క్యామియో అప్పియరెన్స్ ఇచ్చింది. ఆ తర్వాత హాస్టల్ బాయ్స్ చిత్రంతో అలరించింది. ఇక నెక్ట్స్ ఎలాంటి చిత్రాల్లో నటించబోతుందనేది ఇంకా ప్రకటించలేదు. ఇక జబర్దస్ లోనే యాంకర్ గా పనిచేసిన అనసూయ భరద్వాజ్ ఇప్పుడు వెండితెరపై సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. అదే మాదిరిగి రష్మీ ఫుల్ టైమ్ సినిమాలతో ఎప్పుడు బిజీ అవుతుందా? అని అభిమానులు ఆశిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X