25 మంది కమెడియన్లతో ఆస్ట్రేలియాలో జబర్ధస్త్ కామె‘ఢీ’ ఈవెంట్
ఫారిన్‌లో టాలీవుడ్ సెలబ్రిటీల షోలకు అద్భుత ఆదరణ ఉంది. లైవ్ కాన్సెర్టులు.. మ్యూజిక్ షోలు.. కామెడీ షోలు విజయవంతం అవుతున్నాయి. సెలబ్రిటీ డ్యాన్స్ ప్రోగ్రామ్స్.. సింగింగ్ ప్రోగ్రామ్స్‌కి చక్కని ఆదరణ దక్కుతోంది. గాయనీగాయకులు, ఆర్టిస్టులు, డ్యాన్సర్లు, కమెడియన్లు అందరికీ ఆదరణ అసాధారణంగా ఉంది. ఈ నేపథ్యంలో 25 మంది టాలీవుడ్ కమెడియన్లతో ఆస్ట్రేలియాలో ఓ భారీ ఈవెంట్ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
జబర్ధస్త్ కామెడీ షో గురించి మెల్ బా ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రతినిధి శ్రీహరి మాట్లాడుతూ-మార్చి 16న మెల్‌బా ఎంటర్ టైన్ మెంట్స్ ఆధ్వర్యంలో తొలిసారి ఆస్ట్రేలియాలో తెలుగువారికోసం చేస్తున్న షో ఇది. ఇంతమంది ఆర్టిస్టులతో ఆస్ట్రేలియాలో ఇలాంటి షో చేయడం ఇదే తొలిసారి. దుబాయ్ సహా ఎక్కడా ఇలాంటి వేరొక షో చేయలేదు. తెలుగు కమ్యూనిటీకి అతి పెద్ద ఈవెంట్ అవుతుంది' అన్నారు.

ఛమ్మక్ చంద్ర, ఆది, సుధీర్ జబర్దస్త్ టీమ్స్‌తో సహా అందరూ ఈ షోలో వినోదం పండించనున్నారు. ఢీ షో మాస్టర్లు.. వారి తరపున పాల్గొనే 9 మంది డ్యాన్సర్లను కలుపుకుని ఈ ప్రోగ్రామ్ ప్లాన్ చేశాం. జబర్ధస్త్ కామెడీ ఈ భారీ ఈవెంట్ జరుగబోతోందని తెలిపారు.
హిస్టారికల్ పాలెస్ థియేటర్ ఈ భారీ ఈవెంటుకు వేధిక కాబోతోంది. మీటీవీ(ఆస్ట్రేలియాలోని తొలి ఇండియన్ టీవీ), దోసా హట్, కోట్ సెంటర్ ఇన్సూరెన్స్ ఈ ఈవెంటుకు స్పాన్సర్లుగా వ్యవహరించబోతున్నారు. కామెడీ, డ్యాన్స్, సింగింగ్, మ్యాజిక్ షోతో సాగే ఈ ఈవెంటులో యాంకర్ ప్రదీప్, వర్షిని, విష్ణుప్రియ, బిగ్‌బాస్ భానుశ్రీ, డాన్స్ మాస్టర్ యష్ పాల్గొనబోతున్నారు.


Click it and Unblock the Notifications











