షూటింగ్ లో ప్రమాదం.. జబర్దస్త్ అదిరే అభికి గాయాలు.. ఏం జరిగిందంటే?
జబర్దస్త్ షో ద్వారా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న కమెడియన్స్ లలో అదిరే అభి ఒకరు. కేవలం కామెడీ షోలు మాత్రమే కాకుండా నటుడిగా సినీ పరిశ్రమలో కొనసాగుతున్న అభి దర్శకుడిగా కూడా అడుగులు వేశాడు. అయితే ఇటీవల అదిరే అభికి షూటింగ్ లో గాయాలు అయ్యాయి. అతని చేతికి అలాగే కాలికి కూడా దెబ్బలు తగిలిన విషయాన్ని కూడా తెలియజేశాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..

జాబ్ వదిలేసి..
మొదట ఈశ్వర్ సినిమాతో వెండితెరపై పరిచయమైన నటుడు అభి ఆ తర్వాత కొన్నాళ్ళు పలు రియాలిటీ షోలతో కూడా యాంకర్ గా కొనసాగారు. ఇక ఇండస్ట్రీలోకి రాకముందే హైదరాబాద్ ప్రముఖ సాఫ్ట్ వర్క్ కంపెనీలో జాబ్ చేసుకుంటున్న అభి తనకి ఇష్టమైన యాక్టింగ్ ఫీల్డ్ లో ఉండాలని జాబ్ వదిలేసి వచ్చాడు.

జబర్దస్త్ షోలో..
చాలా కాలంగా ఇండస్ట్రీలో నటుడిగా టెలివిజన్ రంగంలో యాంకర్ గా కూడా కొనసాగిన అభి అనంతరం జబర్దస్త్ లో మొదటి అవకాశంతోనే మంచి క్రేజ్ అందుకున్నారు. ఇక అతనితో పాటు కొంతమంది కొత్త వారిని కూడా తీసుకువచ్చి వారికి కూడా లైఫ్ ఇచ్చాడు. మొదట హైపర్ ఆది జబర్దస్త్ లోకి అడుగు పెట్టింది అభి ద్వారానే. అతను అవకాశం ఇవ్వడంతో మొదట డైలాగ్స్ అందించాడు.

చేతికి గాయాలు
అయితే అభి ఒకవైపు సినిమాలు మరోవైపు కామెడీ షోలు చేసుకుంటూ ఒక సరైన ట్రాక్ లో తన కెరీర్ ను ముందుకు సాగిస్తున్నాడు. అయితే కొద్దిసేపటి క్రితం అతను యాక్సిడెంట్ కు గురయ్యాడు. అందుకు సంబంధించిన కొన్ని ఫొటోలు కూడా మీడియాకు అందాయి. చేతికి అలాగే కాలికి గాయాలు కావడంతో రక్తం కూడా వచ్చింది.

షూటింగ్ లో ప్రమాదం
ఇటీవల ఒక సినిమా షూటింగ్ లో పాల్గొన్న అదిరే అభి రెండు రోజుల కీలక షెడ్యూల్ లో యాక్షన్ సన్నివేశాల్లో స్టంట్స్ చేసేందుకు ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకున్నాడు. అయితే హఠాత్తుగా అభికి ఈ యాక్షన్ సన్నివేశాల్లో గాయాలు అయ్యాయి. అతని చేతికి కాస్త తీవ్రంగా దెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. ఇక వెంటనే షూటింగ్ స్పాట్ లో ప్రధమచికిత్స చేసినట్లుగా తెలుస్తోంది.

చురుగ్గా ఉండగా..
ఈ ప్రమాదంలో యాక్షన్ సన్నివేశాల్లో అభి చాలా చురుగ్గా పాల్గొంటుండగా గాయపడినట్లు సమాచారం. ఇక అతను గాయపడిన తరువాత వెంటనే షూటింగ్ ఆగిపోయినట్లు తెలుస్తోంది. అభి కూడా కాస్త రెస్ట్ తీసుకోవాలని డిసైడ్ అయ్యాడట. ఈ ప్రమాదంలో లో మిగతా ఎవరికి కూడా పెద్దగా గాయాలు కాలేనట్లు తెలుస్తోంది. ఇంకా ఈ ప్రమాదం గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

బిగ్ బాస్ లో అవకాశం..?
ఇక అదిరే అభి జబర్దస్త్ షో ద్వారా మంచి క్రేజ్ అందుకుంటున్నాడు. టెలివిజన్ రంగంలోనే కాకుండా అభి ఇతర సినిమాల్లో కూడా నటిస్తున్నాడు. ఇక అభికి కూడా గతంలో బిగ్ బాస్ ఆఫర్స్ వచ్చినట్లు టాక్ వచ్చింది. కానీ అతను మాత్రం ఆ ఆఫర్స్ కు ఒప్పుకోలేదట. ఇక ఈసారి కూడా కొంతమంది జబర్దస్త్ కమెడియన్స్ పై బిగ్ బాస్ సీజన్ 6 నిర్వాహకులు ఫోకస్ చేస్తున్నట్లు సమాచారం. మరి ఆ షోలో అవకాశం వస్తే అభి వెళతాడో లేదో చూడాలి.


Click it and Unblock the Notifications











