twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Jabardasth: అనసూయ సినిమాల్లోకి రాకముందు అలా.. ఇప్పుడిలా.. ఎవరో పెట్టిన భిక్ష కాదు: అదిరే అభి

    |

    యాంకర్ అంటే కేవలం మాటలతోనే కాకుండా గ్లామర్ తో నటనతో కూడా ఆకట్టుకోవాలి అని తెలుగు ఎంటర్టైన్మెంట్ వరల్డ్ లో సరికొత్త ట్రెండ్ తీసుకువచ్చిన వారిలో అనసూయ భరద్వాజ్ ఒకరు. ఆమె మొదట జబర్దస్త్ ద్వారా యాంకర్ గా పరిచయమైన విషయం తెలిసిందే. ఇక వచ్చిన మొదట్లోనే ఓ వర్గం వారిని ఎంతగానో ఆకట్టుకుంది. కామెడీ షో లోనే తన అందమైన నవ్వుతో అలాగే మాటలతో కూడా ఎంతగానో అట్రాక్ట్ చేసింది. అయితే అనసూయ భరద్వాజ్ ఈ స్థాయికి రావడానికి ఆమె ఎంతగానో హార్డ్ వర్క్ కూడా చేసింది. ఇక రీసెంట్ గా జబర్దస్త్ ఫేమ్ అదిరే అభి.. ఆమె గురించి చెప్పినా ఒక విషయం వైరల్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..

    అప్పట్లో బన్నీ సినిమాలో ఛాన్స్

    అప్పట్లో బన్నీ సినిమాలో ఛాన్స్

    జబర్దస్త్ కంటే ముందు అనసూయ భరద్వాజ్ కొన్ని సినిమాల్లో చిన్న పాత్రల్లో కూడా నటించింది. కానీ అక్కడ ఎక్కువ రోజులు కొనసాగలేదు. కుటుంబ పరిస్థితుల కారణంగా కొన్నాళ్లపాటు ప్రైవేట్ కంపెనీలలో కూడా జాబ్ చేసింది. ఆర్య 2 సినిమాలో కూడా అనసూయకు శ్రద్దా దాస్ క్యారెక్టర్ చేసే అవకాశం వచ్చింది. కానీ ఆమె అప్పుడే సినిమాల్లో అలాంటి పాత్రలు చేయడానికి పెద్దగా ఇష్టపడలేదు.

    నటిగా కూడా..

    నటిగా కూడా..

    జబర్దస్త్ లోకి వచ్చిన తర్వాత అనసూయ సరికొత్తగా జనాలను ఎట్రాక్ట్ చేయడం స్టార్ట్ చేసింది. ఒకవైపు కామెడీ షో సక్సెస్ అవుతున్నప్పటికీ కూడా ఆమె గ్లామర్ కు అభిమానులు ఎంతగానో పెరిగిపోయారు. ఇక సోషల్ మీడియాలో ఎంట్రీ ఇచ్చిన తర్వాత కూడా ఆమె మంచి గుర్తింపు అందుకుంది. కేవలం యాంకర్ గానే కాకుండా నటిగా కూడా అనసూయ సాధించిన ఘనత అంతా కాదు. క్షణం, రంగస్థలం సినిమాల్లో ఆమె చేసిన పాత్రలు మంచి క్రేజ్ అంధించాయి.

    అనసూయపై అభి ప్రశంసలు

    అనసూయపై అభి ప్రశంసలు

    అయితే రీసెంట్ గా జబర్దస్త్ కమెడియన్ అదిరే అభి ఆమె గురించి చెప్పిన ఒక విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదిరే అభి ఇలా మాట్లాడుతూ.. అను నేను నిన్ను నీ కెరీర్ ప్రారంభం నుంచి చూస్తున్నాను. ఓ న్యూస్ రీడర్ గా కూడా వర్క్ చేశావు. ఆ తర్వాత మళ్లీ యాంకర్ గా స్థిరపడ్డావు. ఇప్పుడేమో నటిగా కూడా పెద్ద పెద్ద స్టార్ హీరోల సినిమాలలో చేస్తున్నావు. ఈ స్థాయిలోకి రావడానికి నీకు ఎవరో పెట్టిన బిక్ష కాదు. నీకు నువ్వే కష్టపడి సంపాదించుకుని ఈ స్థాయికి వచ్చావు.. అంటూ అభి అనసూయ పై ప్రశంసల వర్షం కురిపించాడు.

    అనసూయ రియాక్షన్

    అనసూయ రియాక్షన్

    ఒక షోలో ప్రత్యేకంగా అనసూయ భరద్వాజ్ గురించి అదిరే అభి అలా చెప్పడంతో అనసూయ కూడా అందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ అతనికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపింది. అంతేకాకుండా ఈ జర్నీ అనేది చాలా ప్రేరణ ఇచ్చేది అని కూడా ఆమె వివరణ ఇచ్చింది

    మంచి కంటెంట్ ఉన్న సినిమాలతో..

    మంచి కంటెంట్ ఉన్న సినిమాలతో..

    ఇక అనసూయ సినిమాల విషయానికి వస్తే రంగస్థలం సినిమా నుంచి కూడా ఆమె రేంజ్ మరింత పెరిగింది అనే చెప్పాలి. రెగ్యులర్ కమర్షియల్ క్యారెక్టర్స్ చేసేందుకు ఒప్పుకోకుండా పాత్ర చాలా భిన్నంగా ఉంటేనే సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. ఇక రంగమార్తాండలో సినిమా కూడా ఆమె ఒక విభిన్నమైన పాత్రలో నటించింది. అలాగే ఒక లేడి ఓరియెంటెడ్ ప్రాజెక్టు కూడా పూర్తి చేయాల్సి ఉంది. పుష్ప 2 మాత్రమే కాకుండా ఇటీవల క్రిష్ అందించిన ఒక విభిన్నమైన కథతో వెబ్ సీరీస్ రూపొందుతుండగా అందులో అనసూయ వేశ్య పాత్రలో నటించడానికి ఒప్పుకున్నట్లు సమాచారం.

    English summary
    Jabardasth comedian adire abhi about anasuya bharadwaj journey
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X