హైపర్ ఆదితో విభేదాలు.. వాళ్లే మొత్తం చేశారు: నిజాలు మొత్తం బయటపెట్టిన గురువు

తెలుగు బుల్లితెరపై సుదీర్ఘ కాలంగా ప్రభావాన్ని చూపిస్తోన్న ఏకైక షోనే జబర్ధస్త్. దాదాపు పదేళ్ల ప్రయాణంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూసిన ఈ కార్యక్రమం.. నెంబర్ వన్ ప్లేస్‌లో హవాను చూపిస్తోంది. ఇది ఎంతో మంది కళాకారులను ఇండస్ట్రీకి పరిచయం చేసింది. ఈ షో వల్లే చాలా మంది సెలెబ్రిటీలు అయిపోయారు. ఈ క్రమంలోనే సినీ పరిశ్రమలో అవకాశాలు కూడా దక్కించుకున్నారు. అలాంటి వారిలో అదిరే అభి అలియాస్ అభినయ కృష్ణ ఒకడు. తాజాగా అభి ఓ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా అతడు ఏం చెప్పాడో మీరే చూడండి!

బుల్లితెరపై ఫేమస్‌గానే
అదిరే అభి జబర్థస్ షోలోకి ఎంట్రీ ఇవ్వడానికి ముందే సినిమాల్లో నటించాడు. అలాగే బుల్లితెరపై యాంకర్‌గా కనిపించాడు. అయినా.. అంతగా పేరు దక్కలేదు. కానీ, జబర్ధస్త్ షోలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత మాత్రం అతడు బాగా ఫేమస్ అయ్యాడు. సాధారణ కమెడియన్ నుంచి టీమ్‌కు లీడర్‌గా మారిన అభి.. ఎన్నో సంవత్సరాల పాటు అందులో కొనసాగాడు.

Jabardasth Comedian Adire Abhi Gives clarity about Clashes With Hyper Aadi

టీమ్ లీడర్‌గానూ సత్తా
'జబర్థస్' షోలో అభి ఓ టీమ్‌కు లీడర్‌గా చాలా కాలం పాటు కొనసాగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే బయట అవకాశాల కోసం ఎదురు చూస్తున్న ఎంతో మంది కళాకారులను బుల్లితెరకు పరిచయం చేశాడు. ఇప్పుడు ఎంతో పాపులర్ అయిన 'హైపర్ ఆది'ని కూడా పరిచయం చేసింది అతడే అని చాలా మందికి తెలీదు. అందుకే టీమ్ లీడర్‌గానూ అతడు పేరు పొందాడు.

జబర్ధస్త్ షోకు దూరం
దాదాపు ఏడేళ్ల పాటు జబర్ధస్త్ షోలో సాధారణ కమెడియన్‌గా, టీమ్ లీడర్‌గా సందడి చేసిన అదిరే అభి.. ఈ మధ్యనే ఆ షో నుంచి తప్పుకున్నాడు. వ్యక్తిగత కారణాలతోనే అతడు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. దీంతో అదిరే అభిని అభిమానించే వాళ్లంతా నిరాశ చెందుతున్నారు. అయితే, అతడు సినిమాలపై ఫోకస్ చేయడం కోసమే ఇలా తప్పుకున్నాడని అంటున్నారు.

Jabardasth Comedian Adire Abhi Gives clarity about Clashes With Hyper Aadi

ఆదితో విభేదాలు అని
జబర్ధస్త్ షోలో ఉన్న టాప్ కమెడియన్లలో హైపర్ ఆది ఒకడు అన్న విషయం తెలిసిందే. అయితే, అతడిని పరిచయం చేసిన ఘనత మాత్రం అదిరే అభికే దక్కుతుంది. ఇలా వీళ్లిద్దరూ గురు శిష్యుల్లా ఉండేవారు. అయితే, కొంత కాలంగా వీళ్లిద్దరి మధ్య విభేదాలు ఉన్నట్లు వార్తలు వైరల్ అయ్యాయి. వీటిపై ఇద్దరూ స్పందించినా ఇప్పటికీ అడపాదడపా ఇలాంటివి వస్తూనే ఉన్నాయి.

ఆదితో గొడవల గురించి
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అభి 'హైపర్ ఆదికి నాకు మధ్య ఎలాంటి గొడవలు లేవు. నాతో విభేదాల కారణంగానే ఆది బయటకు వెళ్లిపోయాడన్న వార్తల్లో నిజం లేదు. కొత్త టీమ్స్‌ను ఏర్పాటు చేయాలని సెకండ్ పొజిషన్‌లో ఉన్న వాళ్లందరినీ కలిపి ఒక టీమ్‌ను తయారు చేశారు. అలా హైపర్ ఆది టీమ్ వచ్చింది. ఆది టీమ్ లీడర్ అయినందుకు సంతోషిస్తాన్నా' అన్నాడు.

Jabardasth Comedian Adire Abhi Gives clarity about Clashes With Hyper Aadi

డైరెక్షన్‌ అంటే ఇష్టం
ఆ తర్వాత అదిరే అభి తనకు సినిమా డైరెక్షన్ అంటే చాలా ఇష్టం అంటూ బయటపెట్టాడు. దీనిపై స్పందిస్తూ అతడు 'నాకు డైరెక్షన్ అంటే చాలా ఇష్టం. అందుకే జబర్ధస్త్‌లో కొనసాగిన సమయంలోనే నాకు ఎంతో ఇష్టమైన డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌పై ఫోకస్ చేశాను. ఇప్పుడు కూడా ఆ దిశగా ప్రయత్నాలు సాగిస్తున్నాను' అని వెల్లడించాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X