శ్రీదేవి డ్రామా కంపెనీలో పారిశుధ్య కార్మికుల గోస.. కన్నీళ్లు పెట్టుకున్న అలీ
బుల్లితెర ప్రేక్షకులను శ్రీదేవి డ్రామా కంపెనీ ఎంతగానో అలరిస్తోంది. రోటీన్ కు భిన్నంగా కంటెంట్ ను అందిస్తూ వస్తోంది. ఆడియెన్స్ హృదయాలను గెలుచుకునే ఈ షో కార్యక్రమాలు సాగుతున్నాయి. ఇటీవల సామాజిక కొణాల్లో ప్రొగ్రామ్స్ ను చిత్రీకరించి టెలికాస్ట్ చేస్తున్నారు. ఈ సందర్భంగా తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీకి సంబంధించిన లేటెస్ట్ ప్రోమోను విడుదల చేశారు. ఆ ప్రొమో ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది.. ఆ వివరాల్లోకి వెళితే..
శ్రీదేవి డ్రామా కంపెనీ షో..
ఈ టీవీ నెట్ వర్క్ లో ఆడియెన్స్ కు మంచి ఎంటర్ టైన్ అందించే షో శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ షోకు ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ దక్కుతోంది. కరోనా తర్వాత కొత్త కాన్సెప్ట్ తో వచ్చిన ఈ షోకు టెలివిజన్ ఆడియెన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. 2021 జనవరి 14న ప్రారంభమైన ఈ ఎంటర్ టైన్ మెంట్ షో ప్రస్తుతం విజయవంతంగా రన్ అవుతోంది. ఈ షోకు ఫీమేల్ జడ్జీగా ఇంద్రజ వ్యవహరిస్తున్నారు. యంగ్ అండ్ టాలెంటెడ్ బ్యూటీ రష్మీ గౌతమ్ యాంకర్ గా వ్యవహరిస్తోంది. జబర్దస్త్ లోని ఆర్టిస్ట్ లు, సెలబ్రెటీలు, టీవీ నటులు, సినిమా నటీనటులు ఈ షోలో సందడి చేస్తూ ప్రేక్షకులకు మంచి ఎంటర్ టైన్ మెంట్ ను అందిస్తున్నారు.

సమాజానికి ఉపయోగ పడేలా..
శ్రీదేవి డ్రామా కంపెనీలో కొన్నాళ్లుగా వస్తున్న ఎపిసోడ్స్ ఎంతో ఆసక్తికరంగా ఉంటున్నాయి. సమాజానికి ఉపయోగకరమైన సబ్జెక్ట్ తో షోను నడిపిస్తున్నారు. ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటున్నారు. ఇప్పటికే ఈ షోలో 'ఆపరేషణ్ సింధూర్', 'విద్యార్థులకు చదువు' వంటి ఎపిసోడ్స్ తో రీసెంట్ గా ఆకట్టుకున్నారు. ఇక తాజాగా పారిశుధ్య కార్మికులతో స్పెషల్ ఎపిసోడ్ ను చిత్రీకరించారు. తాజాగా ప్రోమో విడుదల చేయడంతో అందరినీ ఆకట్టుకుంటోంది.
పారిశుధ్య కార్మికుల గోస...
కమెడియన్ ఆటో రాం ప్రసాద్ తో ప్రమో మొదలైంది. పారిశుధ్య కార్మికుడిగా ఆయన దర్శనమిస్తాడు. వర్ష, తదితరులు మిగితా పాత్రలు పోషించారు. పారిశుద్ద్య కార్మికులు సమాజంలో ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారో అన్ని విషయాలను కండ్లకు కట్టినట్టు చూపించారు. వారి సవాళ్లను తెలిజేసే ప్రయ్నం చేశారు. ఈ సందర్భంగా పారిశుధ్య కార్మికులు తమ గోసలు చెప్పుకున్నారు. పారిశుధ్య పనులు చేయడం ద్వారా తమని ఎవరూ గౌరవించడం లేదని, మనిషిలా కూడా చూడటం లేదని ఓ మహిళా కార్మికురాలు చెప్పుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ఒక్కోసారి నిద్ర, తిండి లేకుండానే రోడ్లపై పని చేస్తున్నామని చెప్పారు.
అలీ, ఇంద్రజా సపోర్ట్..
పారిశుద్ధ్య కార్మికులను ప్రత్యేకంగా తమ షోకు ఆహ్వానించి శాలువాలతో ఆహ్వానించారు. తమ బాధలను చూపించేలా స్పెషల్ స్కిట్లు చేశారు. ప్రేక్షకులకు కండ్లకు కట్టేలా చూపించారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులకు తమ వంతుగా సాయం చేస్తామని కమెడయిన్ అలీ హామీనిచ్చారు. వారి కన్నీళ్లు తుడికి నటి ఇంద్రజా ఓదార్చింది. ఈ ఫుల్ ఎపిసోడ్ జనవరి 8న ఈటీవీలో ప్రసారం కానుంది.


Click it and Unblock the Notifications











