విషం తాగి రష్మీ గౌతమ్ సూసైడ్ ప్రయత్నం.. జబర్దస్త్ కమెడియన్ షాకింగ్‌గా!

కామెడీ షో జబర్దస్త్ అనగానే ముందుగా గుర్తొచ్చేది హాట్ యాంకర్స్ రష్మీ గౌతమ్, అనసూయ. ఆ తర్వాత ఎంతమంది యాంకర్స్ వచ్చినప్పటికీ వీళ్ళ ప్లేస్ ను భర్తీ చేయలేకపోయారు. అయితే తాజాగా రష్మీ గౌతమ్ జబర్దస్త్ షోలో అవకాశం కోసం విషం తాగింది అంటూ షాకింగ్ విషయాన్ని బయట పెట్టాడు ఆటో రాంప్రసాద్. మరి అసలేం జరిగిందో మనం కూడా తెలుసుకుందాం పదండి.

బుల్లితెరపై హాట్ నెస్ కు కేరాఫ్ అడ్రస్ గా మారిన అనసూయ విపరీతమైన పాపులారిటీని సంపాదించుకుంది. యాంకర్ అంటే ఇలాగే ఉండాలి అన్న మూస పద్ధతి రూల్స్ ను బ్రేక్ చేసి, అదే పాపులారిటీతో సినిమాలలో అవకాశం కూడా దక్కించుకుంది. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల అవకాశాలు రావడంతో వాటితోనే ఫుల్ బిజీగా ఉంది అను. మరోవైపు రష్మి గౌతమ్ సినిమాలలో ట్రై చేసి డీలా పడింది. పెద్దగా సినిమా అవకాశాలు లేక కంప్లీట్ గా టెలివిజన్ పైనే ఫోకస్ చేస్తోంది. ఆమె ఉందంటే షో అంతా పంచులు, నవ్వులతో నిండిపోతుంది. గ్లామర్ గ్లామర్, కామెడీకి కామెడీ అన్నట్టుగా ఉంటుంది ఆ షో.

Jabardasth Comedian Auto Ram Prasad satires on Rashmi Gautham

జబర్దస్త్ కామెడీ షో ద్వారా యాంకర్స్ మాత్రమే కాదు ఇప్పటిదాకా ఎంతోమంది కమెడియన్లు కూడా బాగా పాపులర్ అయ్యారు. అందులో హైపర్ ఆది, సుడిగాలి సుధీర్, ఆటో రామ్ ప్రసాద్ కూడా ఉన్నారు. ఇంతకుముందు సుడిగాలి సుధీర్ టీంలో ఉన్న ఆటో రామ్ ప్రసాద్ ప్రస్తుతం టీం లీడ్ గా మారాడు. గతంలో సుడిగాలి సుధీర్, ఆటో రామ్ ప్రసాద్, గెటప్ శ్రీను ముగ్గురూ ఒక టీంగా ఉండేవారు. ఈ ముగ్గురు వేసే పంచులు, స్టేజ్ పై వేసే స్కిట్లు మంచి కామెడీ టైమింగ్ తో ఆకట్టుకునేవి. అప్పట్లో ఈ ముగ్గురు స్కిట్ కోసమే ఎక్కువగా జబర్దస్త్ షోను చూసేవారంటే అతిశయోక్తి కాదు.

ఇక ఇప్పుడు గెటప్ శ్రీను, సుడిగాలి సుదీర్ వేరే సినిమాలు, షోలతో బిజీ అయ్యారు. ఆటో రామ్ ప్రసాద్ టీం లీడర్ గా మారి తన కొత్త టీంతో ప్రస్తుతం జబర్దస్త్ లో స్కిట్స్ చేస్తూ ప్రేక్షకులను నవ్వించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే రామ్ ప్రసాద్ రష్మి జబర్దస్త్ లో ఛాన్స్ కోసం విషం తాగింది అంటూ చేసిన కామెంట్స్ కోసమే.

Jabardasth Comedian Auto Ram Prasad satires on Rashmi Gautham

తాజాగా రిలీజ్ అయిన జబర్దస్త్ ప్రోమోలో ఆటో రామ్ ప్రసాద్ రష్మీకి సంబంధించిన ఈ షాకింగ్ విషయాన్ని వెల్లడించారు. అయితే అదంతా స్కిట్ లో భాగంగానే జరిగింది. ఎక్స్ట్రా జబర్దస్త్ ఆపేసారని రష్మీ విషం తాగుతూ... అంటూ మధ్యలోనే ఆపేసి, ఇంతలో యాజమాన్యం ఆపి రెండు ఎపిసోడ్లు నువ్వే చేస్తావు అని చెప్పగానే విషం పక్కన పెట్టి విస్కీ తాగేసింది అంటూ న్యూస్ పేపర్ చదువుతున్నట్టుగా చెప్పేశాడు.

ప్రస్తుతం ఈ తాజా జబర్దస్త్ ప్రోమో వైరల్ అవుతుండగా, ఈ శుక్రవారం, శనివారం కొత్త ఎపిసోడ్లు టీవీలో టెలికాస్ట్ కాబోతున్నాయి. అంతలోపు ప్రోమో ద్వారా ఈవారం కామెడీ ఎలా ఉంటుంది అనే విషయాన్ని ప్రేక్షకులకు తెలిసేలా చేశారు. ఇక ఇప్పుడు ఈ ప్రోమోను చూశాక ఈ వీకెండ్ టెలికాస్ట్ కాబోతున్న జబర్దస్త్ రెండు ఎపిసోడ్లు కూడా హిలేరియస్ గా ఉండబోతున్నాయి అన్న విషయం అర్థమవుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X