44 ఏళ్ల నటితో జబర్దస్త్ అవినాష్ రొమాన్స్.. లవ్ యూ బేబ్ అంటూ పోస్ట్

జబర్దస్త్ కామెడీ షోతో బుల్లితెర ఆడియెన్స్ ల్లో మంచి గుర్తింపు దక్కించుకున్నారు ముక్కు అవినాశ్. ప్రస్తుతం జబర్దస్త్ తో పాటు మరిన్ని షోల్లో మెరుస్తూ స్మాల్ స్క్రీన్ ఆడియెన్స్ ను అలరిస్తున్నాడు. మరోవైపు టాలీవుడ్ సీనియర్ నటి శైలజా ప్రియా కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు దక్కించుకుంది. మరోవైపు టెలివిజన్ సీరియల్స్, సినిమాల్లో నటించి అలరించింది. ఇప్పటికీ ఆయా చిత్రాల్లో కీలక పాత్రల్లో నటిస్తూ ఆకట్టుకుంటోంది. ఇదిలా ఉంటే ఈమె సోషల్ మీడియాలోనూ తెగ యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ వీడియోను తన అభిమానులతో పంచుకుంది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..

శైలజా ప్రియా గురించి..
మామిళ్ల శైలజ ప్రియ ఆమె పూర్తి పేరు. ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్లలో 1981లో జన్మించింది. మామిళ్ల వెంకటేశ్వర్ రావు, మామిళ్ల కుసుమ కుమారి. ఆమెకు ఇద్దరు తోబుట్టువులు. కానీ శైలజా తెలంగాణలోని హైదరాబాద్‌ మహానగరంలోనే పెరిగింది. ఇక ఆమె స్కూలింగ్ ను పూర్తి చేసుకుంది. కాలేజీ కూడా హైదరాబాద్ లోనే పూర్తి చేసింది. బీఏ పట్టాను అందుకుంది. అదే సమయంలో శైలజా ప్రియకు మిస్ కాలేజీ టైటిల్ అవార్డ్ గెలుచుకుంది. ఆ తర్వాత నుంచి తన నటనా జీవితాన్ని ప్రారంభించింది. ఇక 2002లో వెంకట కిషోర్ మాచిరాజ్ ను పెళ్లి చేసుకుంది. ఆమెకు కొడుకు నిశ్చయ్ ఉన్నాడు. ప్రస్తుతం హైదరాబాద్ లో సెట్ అయ్యారు.

Jabardasth Comedian Avinash duet with Actress Shailaja Priya

శైలజా ప్రియా సినిమాలు, సీరియల్స్
ఈమె కెరీయర్ ను తొలుత టెలివిజన్ సీరియల్స్ తో ప్రారంభించింది. ప్రియా శక్తి, ప్రియా నిను చూడలేక, ప్రియా ఓ ప్రియా, పెళ్లి చేసుకుందాం, కొత్త బంగారం, చిన్న కోడలు, శశిరేఖ పరిణయం, నెంబర్ 1 కోడలు వంటి సీరియల్స్ లో నటించి బుల్లితెర ఆడియెన్స్ ను ఎంతగానో అలరించింది. ఆమె నటకు ఫ్యాన్స్ కూడా ఏర్పడ్డారు. ఇక పాపులర్ తెలుగు రియాలిటీ గేమ్ షోలోనూ మెరిసింది. బిగ్ బాస్ తెలుగు 5 షోతో హౌజ్ లో ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ ను అందించింది. మరోవైపు 1997 నుంచి సినిమాల్లోనూ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మెరుస్తూ వస్తోంది. చిరంజీవి మాస్టర్, మావిడాకులు, సూర్యవంశం, రాజ కుమారుడు, అన్నయ్య, జయం మనదేరా, మర్చి, ఇద్దరమ్మాయిలతో, సన్నాఫ్ సత్యమూర్తి, బెంగాల్ టైర్, హైపర్, వెంకీ మామ, జాబీ రెడ్డి చివరిగా సామజవరగమన వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది.

ఇన్ స్టాలో శైలజా ప్రియా
సినిమాలతో వెండితెరపైన, సీరియల్స్ తో బుల్లితెరపైన మెరియడమే కాకుండా నటి శైలజా ప్రియా సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటుంది. తన గురించిన ఇంట్రెస్టింగ్ విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఆమెకు ఇన్ స్టా గ్రామ్ లో 1.2 మిలియన్ ఫాలోవర్స్ ఉండటం విశేషం. ఇక తన ఫ్యాన్స్ కోసం ఇంట్రెస్టింగ్ పోస్టులు పెడుతూ వస్తుంది. ఈ క్రమంలో తాజాగా జబర్దస్త్ అవినాశ్ తో కలిసి ఓ వీడియోను పంచుకుంది.

జజర్దస్త్ అవినాశ్ తో రచ్చ..
ఇటీవల ఓ ఈవెంట్ కోసమని ఒక హోటల్ కు వెళ్లిన శైలజా ప్రియా, జబర్దస్త్ ఆర్టిస్ట్ ముక్కు అవినాశ్ తో కలిసి ఓ రీల్ చేసింది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన సూపర్ హిట్ సాంగ్ నిలవదే మది నిలవదే సాంగ్ కు ఇద్దరూ కలిసి నటించారు. వీడియోలో శైలజా ప్రియా అందాన్ని పొగుడుతూ కనిపించాడు. అందుకు ఆమె స్పందిస్తూ ఆకట్టుకుంది. చేతిలో చేయి వేసి డ్యుయెట్ పాడుకున్నట్టుగా కనిపించారు. అయితే ప్రస్తుతం ఆమె వయస్సు 44 ఏళ్లు ఉంటుంది. అయినా ఇంత యాక్టివ్ గా, ఇంత బ్యూటీఫుల్ గా కనిపించడంతో ఆమె అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. ఆమె అందాన్ని పొగుడుతూ ఆకాశానికి ఎత్తున్నారు. తాజాగా శైలజా ప్రియా పంచుకున్న వీడియోను లైక్స్, కామెంట్లతో వైరల్ గా మారుస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X