గొర్రెల కాపరిగా మారిన జబర్దస్త్ కమెడియన్... లాక్ డౌన్ ఎఫెక్ట్‌తో దారుణంగా జీవితం!
కరోనా మహమ్మారి ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తోంది. మొదటి దశ కంటే రెండో దశ దారుణంగా ప్రభావం చూపిస్తోంది. మొదటి దశలో మరణాల సంఖ్య పెద్దగా ఉండేది కాదు కానీ రెండో దశలో మరణాల సంఖ్య కూడా భారీగా నమోదవుతోంది. కరోనా వల్ల దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో మళ్లీ లాక్ డౌన్ విధించిన పరిస్థితి నెలకొంది.. దీంతో ఎవరికి వాళ్లు మళ్లీ సొంత ఊళ్ల బాట పట్టారు.. అయితే ఇంటికి వెళ్లిన ఒక జబర్దస్త్ కమెడియన్ గొర్రెల కాసుకుంటూ ఉపాధి హామీ పనులకు వెళ్లడం ఆసక్తికరంగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే

మిలియన్ల కొద్దీ వ్యూస్
జబర్దస్త్ ప్రోగ్రాం అంటే తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండడు ఏమో. ఈ టీవీలో ప్రసారం అవుతున్న జబర్దస్త్ కార్యక్రమం ఇప్పటికే అందరినీ ఆకట్టుకుంటుంది. గురు, శుక్రవారాలు వస్తున్నాయి అంటే దాదాపు అందరూ ఈ ప్రోగ్రామ్ చూడటానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అంతేకాక యూట్యూబ్ లో కూడా ఎప్పటికప్పుడు ఈ వీడియోలకు మిలియన్ల కొద్దీ వ్యూస్ వస్తున్నాయి.

కొత్త కొత్త కాన్సెప్ట్ లతో
ఈటీవీలో ప్రతి గురువారం, శుక్రవారం నాడు జబర్దస్త్ తో పాటు ఎక్స్‌ట్రా జబర్దస్త్ అంటే తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు. ప్రస్తుతం బుల్లి తెరపై నంబర్‌వన్ ప్రోగ్రాంగా, నవ్వులు పండింస్తున్న ఈ షోలు మంచి పేరు సంపాదించుకున్నాయి. ఈ షోలలో కంటెస్టెంట్లు తమ సరికొత్త స్కిట్లతో, పంచ్ డైలాగ్‌లతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంటారు. ఎప్పటికప్పుడు కొత్త కొత్త కాన్సెప్ట్ లతో ప్రేక్షకుల ముందుకి వస్తుంటారు.

చాలామంది కమెడియన్స్
ఇక ఈ షో ద్వారా చాలామంది కమెడియన్స్ పాపులర్ అయ్యారు. చాలా మంది సినిమా అవకాశాలు కూడా దక్కించుకుని సినిమాలు చేస్తున్నారు. ఈ షో ద్వారా హైపర్ ఆది, సుడిగాలి సుదీర్ వంటి వాళ్లు ఎంత పాపులర్ అయ్యారో ఆ తరువాత వచ్చిన వచ్చిన ఇమ్మానియేల్ వంటి వాళ్లు కూడా అంతే పాపులర్ అయ్యారు.

గొర్రెలు కాస్తూ
ఇక అలాగే పాపులరైన జబర్దస్త్ కమెడియన్ బాబు ఇప్పుడు లాక్ డౌన్ కారణంగా స్వగ్రామానికి పరిమితమయ్యాడు.. బయటకు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో ఊర్లోనే ఉండి తన కుటుంబానికి ఉన్న గొర్రెలు కాస్తూ ఉపాధి హామీ పనులకు కూడా వెళుతున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే కొన్ని వీడియోల ద్వారా ఫోటోల ద్వారా పంచుకున్నాడు.
Recommended Video
కరోనా కాలంలో
పొలానికి వెళ్లి అక్కడ అందరితో పాటు తాను కూడా కొడవలి పట్టి కలుపు తీస్తున్నాడు. తాను ఓ సెలబ్రిటీ అనే సంగతి కూడా మర్చిపోయి బాబు హాయిగా ఫ్రెండ్స్‌తో గడుపుతూ వాళ్లతో ఎంజాయ్ చేస్తూ సొంత వాళ్లతో గడుపుతూ సెకండ్ వేవ్ లాక్‌డౌన్ ఎంజాయ్ చేస్తున్నాడు. బాబు జబర్దస్త్‌లో పలు టీమ్స్ లో కమెడియన్‌గా నటిస్తున్నాడు. బాబు హావభావాలకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. దీంతో ఆయనకు సోషల్ మీడియాలో కూడా ఫాలోవర్స్ బాగానే ఉన్నారు.


Click it and Unblock the Notifications











