జబర్దస్త్‌లో ఏపీ సర్కార్‌పై ట్రోలింగ్.. ఎవర్నీ టార్గెట్ చేయలేదంటూ బుల్లెట్ భాస్కర్.. అసలేం జరిగిందంటే?

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై సెటైర్లు వేశారనే కారణంతో సోషల్ మీడియాలో చేస్తున్న ట్రోలింగ్స్‌పై జబర్దస్త్ కమెడియన్ బుల్లెట్ భాస్కర్ స్పందించారు. తన తల్లి, ఆ కార్యక్రమంలో ఉద్దేశపూర్వకంగా ఎలాంటి కామెంట్స్ చేయలేదని ఆయన వివరణ ఇచ్చారు. ఇటీవల టెలివిజన్ కామెడీ షో జబర్దస్త్ చేసిన ఓ స్కిట్ వివాదానికి దారి తీసింది. ఆ స్కిట్‌లో ప్రభుత్వంపై ఏమని కామెంట్ చేశారు? అందుకు బుల్లెట్ భాస్కర్ ఎలాంటి వివరణ ఇచ్చారు అనే వివరాల్లోకి వెళితే..

ఖతర్నాక్ కామెడీ షో ఎక్స్‌ట్రా జబర్దస్త్‌కు ఎంత పాపులారిటీ ఉందో తెలిసిందే. ఈ షోకు మంచి ర్యాంకింగ్స్‌తోపాటు పాపులారిటీ కూడా అదే రేంజ్‌లో ఉంటుంది. ఈ షో ద్వారా డజన్ల కొద్ది కమెడియన్లు తెలుగు తెరకు పరిచయమయ్యారనే విషయం కూడా తెలిసిందే. ఇలాంటి షోలో ముఖ్యంగా సెటైర్లు భారీగా పేలుతుంటాయి.

Jabardasth

అయితే తాజాగా జబర్దస్త్ కామెడీ షోలో ప్రసారం కానున్న ఓ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోలో ప్రభుత్వంపై సెటైర్ వేశారు. అందులో మీకు ఎంత ఫించన్ ఎంత వస్తుందంటే.. బుల్లెట్ భాస్కర్ తల్లి 2750 రూపాయలు అని సమాధానం చెప్పారు. అయితే ఇంకా పెరగదా? అని మరో క్యారెక్టర్ అడిగితే.. ఇంకా పెరగదు.. గవర్నమెంట్ మారితే పెరుగుతుంది అని బుల్లెట్ భాస్కర్ తల్లి జవాబిస్తుంది.

Jabardasth

ప్రభుత్వం ఫించన్‌ విషయంలో రెండు క్యారెక్లర్లు మాట్లాడుకొన్న సంభాషణపై వైఎస్ఆర్ కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బుల్లెట్ భాస్కర్‌ను టార్గెట్‌గా చేసుకొని ట్రోల్స్ చేశారు. సోషల్ మీడియాలో ట్రోల్స్ దాడి పెరగడంతో బుల్లెట్ భాస్కర్ వీడియో రిలీజ్ చేసి వివరణ ఇచ్చారు.

వీడియోలో బుల్లెట్ భాస్కర్ మాట్లాడుతూ.. ఎక్స్ర్‌టా జబర్దస్త్‌లో నా తల్లి చెప్పిన డైలాగ్స్ చాలా కాజువల్‌గా అన్నారు. ఎవరిని ఉద్దేశించి కాదు. సాధారణంగా గవర్నమెంట్లు మారినప్పుడు.. పార్టీలు తమ మ్యానిఫెస్టోలో ఫించన్ పెంచుతామని చెబుతుంటారు. ఆ ఉద్దేశంతో అన్నారే తప్పా. ప్రభుత్వాన్ని కించపరచాలనే ఉద్దేశం లేదు అని బుల్లెట్ భాస్కర్ వివరణ ఇచ్చారు.

Jabardasth

అయితే జబర్దస్త్ కామెడీ షోలో ప్రోమోలో డైలాగ్స్ చూసి కొందరు బాధపడ్డారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలందరికీ నా తల్లి తరపున క్షమాపణ కోరుతున్నాను. అది స్కిట్‌లో ఉండే ఫ్లోలో వచ్చిందే తప్ప.. ప్రభుత్వాన్ని తప్పు పట్టే విషయం కాదు. సాధారణంగా చెప్పు డైలాగ్స్ మాత్రమే. ఎవరైనా హర్ట్ అయితే నా తల్లి తరఫున, నా తరఫున నేను క్షమాపణ చెబుతున్నాను. ఆ ప్రోమో, ఎపిసోడ్ నుంచి డైలాగ్స్ డీలీట్ చేయమని చెప్పాను. ఇక ఆ డైలాగ్స్ ఉండవు అని బుల్లెట్ భాస్కర్ చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X