ఎవరు పడితే వాళ్లు ఎక్కడానికి షేర్ ఆటోనా?.. అది నా పెళ్లాం.. పంచులతో అదరగొట్టిన చమ్మక్ చంద్ర!

తెలుగు బుల్లితెరపై కామెడీ స్టార్స్ కార్యక్రమం మంచి వినోదాన్ని పంచుతూ ప్రేక్షకులను ఆకట్టుకొంటున్నది. న్యాయ నిర్ణేతలుగా శేఖర్ మాస్టర్, నటి శ్రీదేవి విజయ్ కుమార్ వ్యవహరిస్తుండగా.. యాంకర్ లాస్య, యాంకర్ రవి హోస్టులుగా వ్యవహరిస్తున్నారు. ఈ షోలో జబర్దస్త్ కమెడియన్లు చమ్మక్ చంద్ర, ముక్కు అవినాష్ తదితరులు తమదైన శైలిలో రాణిస్తున్నారు. తాజా ఎపిసోడ్‌లో వారు చేసిన హంగామా ఎలా ఉందంటే...

ఎన్ని జన్మలైనా నీతోనే

ఎన్ని జన్మలైనా నీతోనే

ప్రేమలో విఫలమైన చమ్మక్ చంద్ర తన మాజీ ప్రియురాలితో మాట్లాడుతూ.. ఎన్ని జన్మలైనా నీతోనే ఉంటానని చెప్పి ఎవడినో చేసుకొన్నావేమిటే.. ఇంతకు నీవు చేసుకొన్న గొట్టం గాడు ఎవడు అంటూ ప్రశ్నించాడు. అంతలోనే మాజీ లవర్ భర్త అక్కడికి వస్తూ.. నీవు ఎవడితో మాట్లాడుతున్నావు అని అడగ్గానే.. పక్కనే ఉన్న శేఖర్ మాస్టర్.. వచ్చాడు గొట్టం అంటూ కామెంట్ చేశాడు.

నీవు దాని లవర్‌వా?

నీవు దాని లవర్‌వా?

శేఖర్ మాస్టర్ చేసిన కామెంట్ నుంచి తేరుకొన్న కమెడియన్.. చమ్మక్ చంద్రను చూసి ఎవడే వీడు అని ఎగాదిగా చూశాడు. దాంతో నీవు ఏడడుగులు వేయకముందు నేను.. ఎన్నో అడుగులు వేసిన వాడిని అంటూ చంద్ర సమాధానం ఇచ్చాడు. అంటే నీవు దాని లవర్‌వా అంటే.. చంద్ర పక్కనే ఉన్న మరో కమెడియన్ అంతకు మించి అంటూ కామెంట్ చేయడంతో భర్త బిత్తరపోయాడు.

అదేమైనా ఆటోనా.. నా భార్య

అదేమైనా ఆటోనా.. నా భార్య

తన మాజీ లవర్ భర్తను ఉద్దేశించి చంద్ర మాట్లాడుతూ.. తన ప్రియురాలిని చూపిస్తూ.. ఇక ఆ ఆటోలో ప్రయాణించింది చాలూ.. ఇక దిగిపో.. ఇక నుంచి ఈ ఆటోలో నేను ప్రయాణిస్తా అంటూ చంద్ర సెటైర్ వేశారు. చంద్ర మాటలతో ఆగ్రహం చెందిన భర్త.. ఎవరు పడితే వారు ఎక్కడానికి అది ఏమైనా షేర్ ఆటోనా.. నా పెళ్లాం అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.

నా భార్య చేతిని వదిలేయ్

నా భార్య చేతిని వదిలేయ్

అయితే తన ప్రియురాలి చేతిని చమ్మక్ చంద్ర పట్టుకోవడంపై ఆమె భర్త స్పందిస్తూ.. నా పెళ్లి చేయిని ఎందుకు పట్టుకొంటావు బ్రదర్ అంటూ ప్రాధేయపడ్డారు. ఒకసారి వదిలితే నీవు పట్టుకొన్నావు.. ఇక వదిలే ప్రస్తక్తి లేదు. కావాలంటే నీవే వదిలేయ్ అంటూ చమ్మక్ చంద్ర అన్నాడు. దాంతో భర్త దేవుడా అంటూ కేక పెట్టారు.

ఫసక్.. కసక్.. భలే జోడి..

ఫసక్.. కసక్.. భలే జోడి..

కామెడీ స్టార్స్ తాజా ఎపిసోడ్‌లో మరో కమెడియన్స్ జంట సున్నితమైన హాస్యాన్ని పండిస్తూ కనిపించారు. ప్రేమికులుగా నటిస్తున్న ఇద్దరు కూర్చొని మాట్లాడుకొంటూ.. నా ఇంటి పేరు ఫసక్.. మీ ఇంటి పేరు ఏమిటని ప్రియుడు అడుగగా.. కసక్ అంటూ ప్రియురాలు సమాధానం ఇచ్చింది. దాంతో ఏం జోడే మనది అంటూ ప్రియుడు సంతోషంలో మునిగిపోయాడు. ఇలా ఫన్నీ ఎపిసోడ్స్‌తో కామెడీ స్టార్స్ ఆకట్టుకొంటున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X