Jabardasth: ప్రపంచం మెచ్చిన క్రికెటర్ తో కమెడియన్ ధన్ రాజ్.. ఎంతగా మారిపోయాడో చూశారా?

జబర్దస్త్ ద్వారా కమెడియన్ గా తన స్థాయిని మరింత పెంచుకున్న వారిలో ధన్ రాజ్ ఒకరు. ఆ కామెడీ షో తర్వాత ధన్ రాజ్ తెలుగు చిత్ర పరిశ్రమలో మరింత బిజీగా మారిపోయాడు. అయితే మళ్లీ కొంతకాలం తర్వాత ఎక్కువగా హడావిడి చేయని ధన్ రాజ్ కేవలం అప్పుడప్పుడు మాత్రమే సినిమాల్లో కనిపిస్తూ ఉన్నాడు ఇక రీసెంట్ గా అతను ప్రపంచంలో పవర్ఫుల్ బ్యాట్స్ మెన్ లో ఒకరైన క్రికెటర్ ను కలిసి ప్రత్యేకంగా ఫోటోను కూడా పోస్ట్ చేశాడు. ధన్ రాజ్ లుక్కు కూడా కొంతగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే

ఆ సిమిమతో క్రేజ్

ఆ సిమిమతో క్రేజ్

జబర్దస్త్ కంటే ముందు ధన్ రాజ్ తెలుగు చిత్ర పరిశ్రమలో కొనసాగుతూ ఉన్నాడు. మొదట్లో సుకుమార్ రామ్ పోతినేని కలయికలు వచ్చిన జగడం సినిమాలో అతను చేసిన ఒక కామెడీ క్యారెక్టర్ కు మంచి గుర్తింపు లభించింది. అందులో హీరో గ్యాంగ్ లో ఒకడిగా అతను చేసిన అల్లరి అంతా కాదు. ఆ తర్వాత అలా చాలా సినిమాల్లో నటించి మంచి గుర్తింపు అందుకున్నాడు.

జబర్దస్త్ ద్వారా మరో స్థాయికి

జబర్దస్త్ ద్వారా మరో స్థాయికి

అయితే ధన్ రాజ్ ఎంతగా ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆ స్థాయి నుంచి మరో స్థాయికి వెళ్లలేకపోయాడు. ఇక అప్పుడు జబర్దస్త్ లో మంచి అవకాశాలు వస్తున్నాయని ఒక ప్రయత్నం చేసిన ధన్ రాజ్ ఆడిషన్స్ లోనే నిర్వాహకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. దీంతో అతన్ని ప్రత్యేకంగా టీమ్ లీడర్ గా చేసి కొంత కాలం వరకు కొనసాగించారు. ధన్ రాజ్ జబర్దస్త్ ద్వారా కూడా మంచి పారితోషికం అందుకుని ఆర్థికంగా స్థిరపడ్డాడు.

లీడ్స్ రోల్స్ వరకు

లీడ్స్ రోల్స్ వరకు

జబర్దస్త్ లోకి అడుగు పెట్టిన తర్వాత ధన్ రాజ్ కి తెలుగు చిత్ర పరిశ్రమల్లో మరిన్ని అవకాశాలు వచ్చాయి. అంతేకాకుండా ఒకానొక సమయంలో అతను లీడ్ రోల్స్ లో కనిపించే ఆఫర్స్ కూడా వచ్చాయి. ముఖ్యంగా మంచు లక్ష్మితో ఒకసారి జోడిగా ఒక లవ్ స్టోరీ లో నటించబోతున్నట్లు కథనాలు వెలువడిన విషయం తెలిసిందే. ఇక ఆ సినిమా కూడా లంచ్ అయింది. కాకపోతే ఆర్థిక కారణాల వలన ఆ సినిమా క్యాన్సిల్ అయ్యింది.

ఆర్థిక నష్టాలు

ఆర్థిక నష్టాలు

అయితే మధ్యలో నిర్మాతగా కూడా కొన్ని ప్రయత్నాలు చేసి ధన్ రాజ్ ఆర్థికంగా దెబ్బ తిన్నాడు. అనంతరం ఎక్కువగా మళ్లీ అలాంటి ప్రయోగాలు చేయకుండా సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకునే ప్రయత్నం చేశాడు. అంతేకాకుండా పలు రియాలిటీ విషయంలో కూడా అవకాశాలు అందుకుంటూ వచ్చాడు.

స్టార్ క్రికెట్ తో సెల్ఫీ

స్టార్ క్రికెట్ తో సెల్ఫీ

ఇక చాలా రోజుల తర్వాత సోషల్ మీడియాలో సందడి చేస్తున్న ధన్ రాజ్ ఇటీవల విదేశాలకు వెళ్లి అక్కడ ఒక ప్రముఖ క్రికెటర్ ను కలుసుకోవడం విశేషం. అతను మరెవరు. కాదు ప్రపంచంలోనే అతి భీకరమైన బ్యాట్స్ మెన్ లో ఒకరైన క్రిస్ గేల్. అతన్ని కలిసిన ధనరాజ్ కొంతసేపు ముచ్చటించి అనంతరం సెల్ఫీ కూడా తీసుకున్నాడు. ఆ సెల్ఫీ తీసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది అని కూడా సోషల్ మీడియాలో స్పందించాడు. ప్రస్తుతం ధన్ రాజ్ పలు సినిమాల్లోనే కాకుండా వెబ్ సీరీస్ లలో కూడా నటిస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X