సుడిగాలి సుధీర్ సీక్రెట్ బయటపెట్టిన ధనరాజ్.. అందుకే ఫోన్లకు దూరం అంటూ..
జబర్దస్త్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైన కమెడియన్ ధనరాజ్ (Dhanaraj). చిన్న చిన్న స్కిట్స్‌తో ప్రారంభమైన ఆయన ప్రయాణం, క్రమంగా టెలివిజన్ షోల నుంచి సినిమాల వరకూ విస్తరించి, తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది. తన టైమింగ్, డైలాగ్ డెలివరీ, ఎక్స్‌ప్రెషన్స్‌తో ప్రేక్షకులను అలరించిన ధనరాజ్, బుల్లితెరపై మాత్రమే కాదు.. వెండితెరపైనా తన ముద్ర వేసుకున్నాడు. ధనరాజ్‌ను కేవలం కామెడీ పాత్రలకు మాత్రమే పరిమితం కాలేదు.
అవకాశం వస్తే ఎమోషనల్, సీరియస్, క్యారెక్టర్ రోల్స్ కూడా సమర్థంగా పోషించగలడని పలుమార్లు నిరూపించాడు. కమెడియన్‌గా ఎంట్రీ ఇచ్చినా, తన నటనలో ఉన్న వెర్సటిలిటీతో ఇండస్ట్రీలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. నటుడిగా మాత్రమే కాకుండా, నిర్మాతగా కూడా తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు. ఇటీవల ఓ ఇంటర్య్వూలో పాల్గొన ఆయన సుడిగాలి సుధీర్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇంతకీ ఏమన్నారంటే?

జబర్దస్త్ కమెడియన్ ధనరాజ్ తాజాగా తన కెరీర్, జబర్దస్త్ షోతో ఉన్న అనుబంధం, సహచర కమెడియన్ల ఎదుగుదల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన, జబర్దస్త్ తన జీవితంలో ఎంత కీలక పాత్ర పోషించిందో భావోద్వేగంగా వివరించారు. "జబర్దస్త్ నాకు తల్లి లాంటిది" అంటూ ప్రారంభించిన ధనరాజ్, ఈ షో తనకు కేవలం గుర్తింపు మాత్రమే కాకుండా ఆర్థికంగా కూడా బలాన్ని ఇచ్చిందని చెప్పారు. అదే తనను నటుడిగానే కాకుండా ప్రొడ్యూసర్‌గా ఎదగడానికి దారితీసిందని పేర్కొన్నారు. "ధనాధన్ ధనరాజ్" అనే పేరు చిన్న పిల్లలకూ తెలిసే స్థాయికి తీసుకెళ్లింది జబర్దస్త్ అంటూ గుర్తుచేసుకున్నారు.
జబర్దస్త్ నుంచి బయటకు వచ్చిన వారిలో ఎక్కువ మంది సక్సెస్ అవ్వడం ప్రత్యేకమని ధనరాజ్ చెప్పారు. సత్య, నవీన్ నేని, రాకేష్, వేణు వంటి వారు ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా సత్య ప్రస్తుతం టాలీవుడ్‌లో హ్యాపెనింగ్ కమెడియన్‌గా దూసుకుపోతున్నాడని అన్నారు. అలాగే రాకెట్ రాఘవ వంటి వారు వందల స్కిట్స్‌తో ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారని ప్రశంసించారు. తమ తర్వాత వచ్చిన సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, ఆటో రాంప్రసాద్, బుల్లెట్ భాస్కర్ వంటి కమెడియన్లు కూడా అద్భుతంగా రాణిస్తున్నారని ధనరాజ్ తెలిపారు.
తాను, వేణు జబర్దస్త్‌ను విడిచిపెట్టిన తర్వాత ఆ స్థానాల్లోకి వచ్చిన వీరంతా టీమ్ లీడర్లుగా ఎదిగి, ఇప్పుడు మంచి స్థాయిలో సెటిల్ అయ్యారని అన్నారు. "అది మా వల్ల కాదు.. వారి టాలెంట్ వల్లే. వారికి అలా రాసి ఉంది కాబట్టి ఈ స్థాయికి వచ్చారు" అంటూ వారి విజయాన్ని ప్రశంసించారు. ఇక సుడిగాలి సుధీర్ ఫోన్‌లు ఎత్తరనే ప్రచారంపై కూడా ధనరాజ్ క్లారిటీ ఇచ్చారు.
'సుధీర్ అందరికీ అందుబాటులో ఉండడు అనేది నిజమే కానీ, తనకు దగ్గరైన వాళ్లతో మాత్రం రెగ్యులర్‌గా టచ్‌లో ఉంటాడు. కొత్త నంబర్ల నుంచి కాల్స్ వస్తే తప్పనిసరిగా ఎత్తకపోవచ్చు. దాన్ని తప్పుగా అర్థం చేసుకోవద్దు, దాని ప్రధాన కారణం బిజీ షెడ్యూల్ కారణమే కావొచ్చు' అంటూ స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలతో సుధీర్‌పై ఉన్న అనుమానాలకు చెక్ పెట్టారు.
కమెడియన్లు కూడా సీరియస్, ఎమోషనల్ సినిమాలు చేయగలరని వేణు నిరూపించాడని ధనరాజ్ అన్నారు. ఇది తమలాంటి వారికి కూడా కొత్త దారులు చూపిందని చెప్పారు. ఇక జబర్దస్త్‌ను వదిలేయడానికి ఎలాంటి విభేదాలు కారణం కాదని, షూటింగ్స్ బిజీ షెడ్యూల్స్ వల్లే డేట్స్ కుదరక బయటకు రావాల్సి వచ్చిందని వివరించారు. అదేవిధంగా మల్లెమాల ప్రొడక్షన్స్, శ్రీదేవి డ్రామా కంపెనీతో ఇప్పటికీ తనకు మంచి అనుబంధం ఉందని, నాగబాబు, రోజా, అనసూయ, లక్ష్మి వంటి వారితో కూడా టచ్‌లోనే ఉన్నానని తెలిపారు.


Click it and Unblock the Notifications



















