ఆ అమ్మాయి కోసం పిచ్చోడిలా.. జబర్థస్త్ నటుడు హార్ట్ బ్రేకింగ్ స్టోరీ

తెలుగు బుల్లితెరపై నవ్వులు పంచే ఓ జబర్దస్త్ కమెడియన్ జీవితంలో ఇంత బాధ దాగి ఉంటుందని ఎవ్వరూ ఊహించరు. ప్రేమ పేరుతో దగ్గరైన ఓ అమ్మాయి, చివరికి డబ్బుల కోసం తనను వాడుకుని మోసం చేసిందట. ఆ ప్రేమలో అంతగా మునిగిపోయి, ఆమె కోసం పిచ్చోడిలా రోడ్లపై తిరిగాడంట. నవ్వుల వెనుక దాగిన ఈ లవ్ బ్రేకప్ స్టోరీ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకీ ఆ జబర్దస్త్ నటుడు ఎవరు? అసలేం జరిగిందంటే?

ఆ కామెడియన్ ఎవరో కాదు.. తెలుగు బుల్లితెరపై తన కామెడీ టైమింగ్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఎక్స్‌ప్రెస్ హరి (Express Hari). కామెడియన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్టాండప్ కమెడియన్‌గా ప్రారంభమైన ఆయన ప్రయాణం పటాస్ (Pataas) వంటి కార్యక్రమాలతో వేగం అందుకుంది. తర్వాత జబర్దస్త్ (Jabardasth) ద్వారా మరింత పాపులారిటీ సంపాదించుకున్నారు హరి, ప్రస్తుతం ఈటీవీ, మా టీవీ, జీ తెలుగు వంటి ఛానెల్స్‌లో పలు షోలతో బిజీగా కొనసాగుతున్నారు.

Jabardasth Comedian Express Hari Emotional Breakup Story Goes Viral on Social Media

ఇదిలా ఉండగా, గతంలో హరి పేరు ఆశు రెడ్డితో లవ్ ట్రాక్ కారణంగా వార్తల్లో నిలిచింది. ఆమె పేరు టాటూ వేయించుకోవడం, బైక్ గిఫ్ట్ వంటి సంఘటనలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని ప్రచారం జరిగింది. అయితే ఆ వార్తలన్నీ షో కోసం చేసిన ప్రచారమేనని తర్వాత స్పష్టమైంది. ఇలాంటి నేపథ్యంలో ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న హరి తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని ఎమోషనల్ విషయాలను బయటపెట్టాడు. ముఖ్యంగా తన లవ్ బ్రేకప్ గురించి చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఆ ఇంటర్య్యూలో హరి మాట్లాడుతూ..'పటాస్ షోలో తన ఓ అమ్మాయి పరిచయమైంది. ఆ అమ్మాయిది వైజాగ్. ఆ అమ్మాయి ఏదైనా చేయొచ్చు అనిపించింది. ఎన్నో సార్లు డబ్బులు కూడా పంపించాను. నేను ఒక అమ్మాయిని చాలా గాఢంగా ప్రేమించాను. కానీ ఆమె నన్ను మోసం చేసింది. ఆ సమయంలో నేను పూర్తిగా డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాను. సూసైడ్ చేసుకోవాలనే ఆలోచనలు కూడా వచ్చాయి. ప్రేమకు ఎంత పవర్ ఉందో అప్పుడే నాకు అర్థమైంది' అని చెప్పాడు. ఒకరోజు ఆ అమ్మాయి తనతో మాట్లాడకపోతే తట్టుకోలేకపోయేవాడినని, ఆమె కోసం ఎంతగా మానసికంగా డిపెండ్ అయ్యానో గుర్తు చేసుకున్నాడు.

ఈ సందర్భంలో ఒక షాకింగ్ సంఘటనను కూడా హరి వెల్లడించాడు. 'ఒకరోజు ఆమెకు 96 మిస్డ్ కాల్స్ ఇచ్చాను. 97వ కాల్‌కు ఫోన్ లిఫ్ట్ చేసి 'ఎందుకు నన్ను విసిగిస్తున్నావు?' అని మాట్లాడింది. ఒకసారి విశాఖపట్నం వస్తాను, నన్ను కలవమని చెప్పింది. నేను ఆమె చెప్పిన లొకేషన్‌కు వెళ్లి గంటల తరబడి ఎదురు చూశాను. కానీ ఆమె రాలేదు. ఫోన్ చేస్తే 'నేను అక్కడ లేను' అని చెప్పింది' అంటూ ఆ బాధను గుర్తు చేసుకున్నాడు.

ఆ సంఘటన తన జీవితంలో పెద్ద మలుపు తీసుకొచ్చిందని హరి చెప్పాడు. 'ఆమె కోసం పిచ్చోడిలా రోడ్లపై తిరిగాను. కానీ ఒక్కసారిగా నాకు ఒక ప్రశ్న వచ్చింది. నన్ను ఇష్టపడని వ్యక్తి కోసం నేను ఎందుకు ఇలా మారిపోవాలి? అదే నాకు టర్నింగ్ పాయింట్ అయింది' అని తెలిపాడు. ఆ సమయంలో నేరుగా గుడికి వెళ్లి కూర్చొని చాలా సేపు ఏడ్చానని, ఆ తర్వాత కొంత రిలీఫ్‌తో ఇంటికి తిరిగి వెళ్లానని చెప్పారు. ఈ అనుభవం తనకు పెద్ద గుణపాఠంగా మారిందని హరి పేర్కొన్నాడు. 'మన జీవితంలో జరిగే ప్రతి సంఘటన ఒక పాఠం నేర్పుతుంది. ఆ బాధ కూడా నాకు చాలా విషయాలు నేర్పింది' అంటూ తన భావోద్వేగాలను పంచుకున్నాడు. అయితే తనను మోసం చేసిన ఆ అమ్మాయి ఎవరు అనే విషయాన్ని మాత్రం ఎక్కడా వెల్లడించలేదు.

ప్రస్తుతం హరి చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, నెటిజన్లలో చర్చకు దారి తీస్తున్నాయి. కొందరు ఆయన ఓపెన్‌గా తన బాధను పంచుకున్నందుకు అభినందిస్తుంటే, మరికొందరు "ప్రేమలో ఇలాంటి అనుభవాలు చాలా మందికి ఉంటాయి" అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక కెరీర్ పరంగా చూస్తే, పటాస్, జబర్దస్త్ వంటి షోలు హరికి మంచి పేరు తెచ్చిపెట్టాయి. తన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను అలరిస్తూనే, ఇప్పుడు వ్యక్తిగత జీవితంలోని నిజాలను కూడా పంచుకోవడం ద్వారా మరో కోణాన్ని చూపించాడు. మొత్తానికి, హరి చెప్పిన ఈ లవ్ బ్రేకప్ కథ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X