Jabardasth జబర్దస్త్ షోలో అలాంటి దారుణాలు.. బండారం బయటపెట్టిన కమెడియన్!
జబర్దస్త్ కామెడీ షో బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడంతో పాటు ఎంతో మంది కమెడియన్లకు లైఫ్ ఇచ్చింది. అయితే మరి కొంత మంది మాత్రం జబర్దస్త్ వల్ల దారుణమైన పరిస్థితులను ఎదుర్కొన్నామని బాహాటంగానే చెప్పేస్తున్నారు. తాజాగా ఇదే షోతో పాపులర్ అయిన గడ్డం నవీన్ అనే సీనియర్ కమెడియన్ జబర్దస్త్ లో తనకు ఎదురైన చేదు అనుభవాలను బయట పెట్టారు. మరి జబర్దస్త్ షోలో ఆయనకు ఎదురైన ఆ దారుణమైన పరిస్థితులను గడ్డం నవీన్ ఎలా ఎదుర్కొన్నారో ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం.
బుల్లితెర పాపులర్ కామెడీ షో జబర్దస్త్ తో మంచి గుర్తింపును సంపాదించుకున్న నటుల్లో గడ్డం నవీన్ కూడా ఒకరు. ఒకప్పుడు జబర్దస్త్ టీం లీడర్లలో ఒకరైన అదిరే అభి టీంలో ఎక్కువగా కనిపించేవాడు గడ్డం నవీన్. ఇక తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో గతంలో తాను భార్యా, ఇద్దరు బిడ్డలతో కలిసి ఎదుర్కొన్న కష్టాలను కళ్ళకు కట్టినట్టుగా వివరించారు ఈ కమెడియన్.

2004 ఏడాదిలో జేబులో 400 వందలు ఉంటే చాలా ఎక్కువని, తినడానికి తిండి లేక ఎంతో ఇబ్బంది పడ్డామని గుర్తు చేసుకున్నాడు గడ్డం నవీన్. అంతేకాకుండా చాలాసార్లు తన భార్య పక్కింటి వాళ్ళ దగ్గర అడుక్కొచ్చి తమకు అన్నం పెట్టిందంటూ ఒకప్పుడు తన జీవితంలో ఎదురైనా గడ్డు పరిస్థితులను బయట పెట్టారు. దాదాపు 170 సినిమాల్లో తను నటించానని, కానీ అన్ని సినిమాల్లోనూ దాదాపుగా ఎక్కడో వెనక నిలబడే రోల్స్ లోనే కనిపించానని ఈ సందర్భంగా వెల్లడించారు గడ్డం నవీన్.
ఈ నేపథ్యంలోనే ఇటీవల కాలంలో మీరు జబర్దస్త్ లో ఎక్కువగా కన్పించడం లేదు ఎందుకు? అనే ప్రశ్నకు నవీన్ స్పందిస్తూ తనకు అదిరే అభి ఉన్నప్పుడు జబర్దస్త్ లో నటించడానికి, స్టేజ్ పై కనిపించడానికి ఎక్కువగా అవకాశం దొరికేదని అన్నారు. ఆయన వెళ్లిపోయాక తాము ఒంటరి పక్షులం అయిపోయామని చెప్పుకొచ్చారు. అభి జబర్దస్త్ నుంచి వెళ్లిపోయాక తమను ఎవ్వరూ పట్టించుకోలేదని గడ్డం నవీన్ వెల్లడించారు. అందుకే అప్పటి నుంచి జబర్దస్త్ వేదికపై సరిగ్గా కన్పించట్లేదని చెప్పారు.
ఇక ఈ ఇంటర్వ్యూలో జబర్దస్త్ లో డబ్బులు ఇస్తున్నారా? అనే ప్రశ్నకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. తెలిసినవాళ్లయితే ఇస్తారు, తెలియని వాళ్ళైతే ఇవ్వరని చెప్పుకొచ్చారు గడ్డం నవీన్. జబర్దస్త్ షోలో చేసినందుకు వచ్చే రెమ్యూనరేషన్ గురించి గడ్డం నవీన్ మాట్లాడుతూ తాను ఆ షోలో 80 నుంచి 90 ఎపిసోడ్లు చేసినా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని చెప్పుకొచ్చారు.

తాజాగా ఆయన ఇంటర్వ్యూ చూసిన కొంతమంది బుల్లితెర ప్రేక్షకులు జబర్దస్త్ తెర వెనుక మరీ ఇంత దారుణంగా ఉంటుందా? పని చేయించుకుని డబ్బులు ఇవ్వకపోవడం ఏంటి? అని ప్రశ్నిస్తున్నారు. ఇక స్టేజ్ పై అంతగా కితకితలు పెట్టే ఈ యాక్టర్ల రియల్ లైఫ్ ఇంత దారుణంగా ఉంటుందా? అని గడ్డం నవీన్ పై జాలిని చూపిస్తున్నారు.
ఏదేమైనా జబర్దస్త్ తరచుగా ఇలాంటి వివాదాలతో వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. ఇప్పటికే కొంతమంది ఈ షోలో వేసే డబుల్ మీనింగ్ డైలాగులపై విరుచుకు పడుతూ ఉంటారు. ఇక ఈ జబర్దస్త్ వల్ల కొంతమందికి మంచి పాపులారిటీ దక్కితే, మరి కొంతమందికి మాత్రం ఇలాంటి చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి.


Click it and Unblock the Notifications











