జబర్దస్త్ కమెడియన్‌కు ప్రభుత్వ ఉద్యోగం.. పాతికేళ్లుగా నిరీక్షణ.. ఎలాంటి జాబ్ అంటే?

బుల్లితెర కామెడీ షో జబర్దస్త్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ షో ప్రారంభమైనప్పటి నుంచి వినోదాన్ని పంచుతూ తెలుగు ప్రేక్షకులకు అలవాటుగా మారిపోయింది. ఇక ఈ షో ద్వారా మోస్ట్ పాపులర్ అయినవాళ్లలో ఎంతోమంది ఉన్నారు. జబర్దస్త్ తో వచ్చిన క్రేజ్ ద్వారా వివిధ షోలలో, సినిమాల్లో అవకాశాలు కొట్టేస్తూ సినీ రంగంలో తమ కెరీర్ ను మరింతగా పదిలం చేసుకుంటున్నారు. అయితే సాధారణంగా జబర్దస్త్ కమెడియన్లు అందరూ సినిమాల్లో అవకాశాల కోసం ఎదురుచూస్తుంటారు. కానీ ఈ కమెడిన్ మాత్రం ప్రభుత్వ ఉద్యోగం కోసం నిరీక్షించాడు. తాజాగా దాన్ని సాకారం చేసుకున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..

జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఎంతోమంది నటీనటులు లైమ్ లైట్ లోకి వచ్చారు. ఇప్పటికే యాంకర్ అనసూయ, రష్మీ గౌతమ్, సుడిగాలి సుధీర్, హైపర్ ఆది, గెటప్ శ్రీను వంటి తదితరులు సినిమాల్లో అవకాశాలు అందుకుంటూ సత్తా చాటుతున్నారు. ఇక తాజాగా వేణు వండర్స్ టీమ్ తో కామెడీ పండించిన వేణు యెల్దండి ఏకంగా బలగం సినిమాకు దర్శకత్వం వహించి సత్తా చాటాడు. అయితే తాజాగా మరో కమెడియన్ తను కల కన్న కోరికను నెరవేర్చుకున్నాడు.

Jabardasth Comedian Ganapathi Gets Government Teacher Job

జబర్దస్త్ కామెడీ షోలో గణపతి మంచి కామెడీ టైమింగ్ ఉన్న యాక్టర్. ఈ షో మాత్రమే కాకుండా పలు సినిమాల్లో కూడా చిన్న చిన్న పాత్రల్లో కూడా మెప్పించాడు. బొద్దుగా ఉండే గణపతి జబర్దస్త్ షోలో లేడీ గెటప్పులతో బాగా ఆకట్టుకునేవాడు. ఇప్పుడు తాజాగా గణపతికి ప్రభుత్వ ఉపాధ్యాయుడి ఉద్యోగం లభించడంతో సంతోషిస్తున్నాడు. ఇటీవల ఏపీ ప్రభుత్వం డీఎస్సీ పోస్టులు భర్తీ చేసింది. అందులో గణపతిని టీచర్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

ప్రభుత్వ ఉద్యోగం రావడంతో జబర్దస్త్ షోను మానేస్తున్నట్లుగా తెలిపాడు గణపతి. టీవీ, సినీ రంగంలో గుర్తింపు వచ్చిన సమయంలో ప్రభుత్వ ఉద్యోగం కోసం వాటిని వదులుకోవడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే బ్రహ్మానందం, ఎమ్మెస్ నారయణ వంటి వారు సినీ రంగంలో స్థిరపడేందుకు వారి టీచర్ వృత్తిని వదులుకున్న విషయం తెలిసిందే.

గణపతి స్వగ్రామం ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లాలోని ఆముదాలవలస. టీచర్ కావాలనే లక్ష్యాన్ని నెరవేర్చుకున్న గణపతి తన భావాలను పంచుకున్నాడు. "నా పాతికేళ్ల కల నెరవేరింది. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు పాఠాలు చెప్పాలన్న నా కల నేటికి నెరవేరింది. ఏపీ ప్రభుత్వానికి ధన్యవాదాలు" అని గణపతి తెలిపాడు.

More from Filmibeat

Read more about: jabardasth ganapathi jabardasth
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X