హైపర్ ఆది ఎక్కువ మేము తక్కువ అంటే ఎలా?... జబర్దస్త్ గెటప్ శ్రీను సీరియస్!

By Bojja Kumar

Recommended Video

Getup Seenu Shocking Comments On Hyper Aadhi

తెలుగు ఎంటర్టెన్మెంట్ రంగంలో జబర్దస్త్ కామెడీ షో సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఈ షో సక్సెస్ అయినంతగా ఏ కామెడీ షో హిట్ కాలేదు. అంతే కాకుండా ఇందులో యాక్ట్ చేసిన కమెడియన్లకు సినిమా అవకాశాలు కూడా వస్తుండటంతో ప్రేక్షకులకు సరికొత్త వినోదం అందించడంలో పోటీ పడుతూ ముందుకు సాగుతున్నారు ఇందులోని టీమ్ మెంబర్స్. ఇప్పటికే ఈ షో ద్వారా పరిచయం అయిన చాలా మంది పలు చిత్రాల్లో వరుస అవకాశాలు దక్కించుకుంటూ దూసుకెళుతున్నారు.

 అతి తక్కువ కాలంలోనే హై లెవల్‌కి వెళ్లిన హైపర్ ఆది

అతి తక్కువ కాలంలోనే హై లెవల్‌కి వెళ్లిన హైపర్ ఆది

ఇక ఈ మధ్య కాలంలో జబర్దస్త్ షోలలో బాగా పాపులర్ అయిన కమెడియన్ హైపర్ ఆది. అతి తక్కువకాలంలోనే ఆది టాప్ పొజిషన్‌కు వెళ్లిపోయాడు. ఆది స్కిట్లలో పంచ్‌లు కడుపుబ్బా నవ్వించేలా, ఇప్పటి ట్రెండును పాలో అవుతూ ఉండటమే ఇందుకు కారణం. ఆది ఇటు అటు సినిమాల్లోనూ అవకాశాలు దక్కించుకుంటూ దూసుకెళుతున్నాడు.

 ఆది వచ్చిన తర్వాత అంతా డీలా

ఆది వచ్చిన తర్వాత అంతా డీలా

ఆది వచ్చిన తర్వాత జబర్దస్త్‌లోని మిగతా టీమ్స్ అన్నీ రేటింగ్స్ పరంగా, యూట్యూబ్ వ్యూస్ పరంగా డీలా పడిపోయాయి. ఆది ఎంటర్టెన్ చేసినంతగా ఎవరూ చేయడం లేదనే ఓ వాదన కూడా తెరపైకి వచ్చింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో హూపర్ ఆది ప్రస్తావన రాగా జబర్దస్త్ గెటప్ శ్రీను సీరియస్‌గా సమాధానం ఇచ్చారు.

 మాది ఏమాత్రం తగ్గలేదు అంటున్న గెటప్ శ్రీను

మాది ఏమాత్రం తగ్గలేదు అంటున్న గెటప్ శ్రీను

ఆది వచ్చిన తర్వాత మా షో వ్యూస్ తగ్గిపోయాయి అనడం సరికాదు. మాది ఏమాత్రం తగ్గలేదు. ఆది స్కిట్ వ్యూస్ పెరిగాయి. మాషోను ఆది రాకముందు 10 లక్షల మంది చూసేవారు. తనకు 30 లక్షల మంది, 40 లక్షల మంది చూస్తున్నారు. మాది లేడీ గెటప్ వేసుకుంటే 60 లక్షలు చూశారు. 70 లక్షలు రీచ్ అయిన స్కిట్లు కూడా ఉన్నాయి. తనవి ఎక్కువ ఉంటున్నాయే తప్ప మాది తగ్గలేదు అని గెటప్ శ్రీను తెలిపారు.

 ఎవరికి వారే నెం.1

ఎవరికి వారే నెం.1

ఆది ఫేంలో ఉన్నాడు. తను చేస్తున్న పంచ్ స్కిట్లలో తాను నెం.1.... మేము చేసే బిజినెస్ స్కిట్లలో మేము నెం1..... ఫ్యామిలీ స్కిట్లలో చంద్రన్న నెం.1.... ఎవరి స్కిట్లు వారి వారి స్టైల్ లో వారు నెం.1...... అని గెటప్ శ్రీను చెప్పుకొచ్చాడు.

అలా చేస్తే ఆదికి మాకు తేడా ఏముంటుంది?

అలా చేస్తే ఆదికి మాకు తేడా ఏముంటుంది?

ఇపుడు ఆది లాగే మేము పంచ్ వేయాలనుకుంటే ఆదికి మాకు తేడా ఉండదు. ఆది మేము చేసినట్లు చేస్తే మాకు ఆదికి తేడా ఉండదు. అలాగే చంద్రన్న లాగా మేము చేస్తే జబర్దస్త్ షోలో అన్ని స్కిట్లు ఒకేలా ఉండి బోర్ కొట్టిస్తుంది. ఒక్కొక్కరు ఒక్కోరకమైన వేరియేషన్‌తో ఉన్నాం కాబట్టే జబర్దస్త్ ఇంత సక్సెస్ అయింది.... అని గెటప్ శ్రీను తెలిపారు.

ఊపు తగ్గింది అంటే ఎలా

ఊపు తగ్గింది అంటే ఎలా

ఎవరైనా మా స్కిట్లలో ఊపు తగ్గిపోయింది అనే వరకు వచ్చారంటే.... వారు ఆది స్కిట్లను అంత ఇష్టపడుతున్నారని అర్థం. అంతే కానీ మనల్ని దూరం చేస్తున్నారని అర్థం కాదు అని గెటప్ శ్రీను తెలిపారు.

 జలసీ...

జలసీ...

మా మధ్య జలసీ ఎందుకు లేదంటే... తను జబర్దస్త్, మేము ఎక్స్‌ట్రా జబర్దస్త్. ఒక వేళ మేము ఇద్దరం కలిసి చేసినపుడు తను ఎక్కువ స్కిట్లు కొట్టడం చేస్తే అంతకంటే మెక్కువ చేయాలని మాత్రమే ఉంటుంది. అంతేకానీ జలసీ అనేది ఉండదు.... అని గెటప్ శ్రీను తెలిపారు.

 అలా ఆలోచిస్తే హెల్త్ పాడవుతుంది

అలా ఆలోచిస్తే హెల్త్ పాడవుతుంది

ఎదుటివాడు స్కిట్లు కొట్టాడని మనం జలసీ పీలయిపోయి... ఎక్కువ ఆలోచిస్తే హెల్త్ పాడవ్వటం తప్ప మరేమీ ఉండదు. మా ఎక్స్‌ట్రా జబర్దస్త్ లో మేము ఏం చేయాలనుకుంటే అది చేస్తాం. ఆది అందులో చేయాల్సింది చేస్తాడు. అంతే తప్ప మా మధ్య ఎలాంటి జలసీలు లాంటివి ఏమీ ఉండవని గెటప్ శ్రీను తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X