జబర్దస్త్ కమెడియన్ పై స్మగ్లింగ్ ఆరోపణలు.. ఆ అనుమానంపై క్లారిటీ ఇచ్చిన నటుడు!

చిత్తూరులో ఎర్రచందనం స్మగ్లింగ్ లో ప్రధాన నిందితుడుగా తరుచుగా హరిబాబు అనే వ్యక్తి పేరు వినిపిస్తోంది. పోలీసులకి చిక్కకుండా ఈ స్మగ్లింగ్ వ్యాపారం చేస్తోన్న ఆ హరిబాబు గురించి తాజాగా మరోసారి వార్తలు తెరపైకి వచ్చాయి. చిత్తూరులో ఎర్రచందనం అక్రమ సరఫరాపై నిఘా వేసి పోలీసులు ఓ వ్యక్తిని పట్టుకున్నారు. అతను హరిబాబు పేరు చెప్పారు.

జబర్దస్త్ లో చేసాడని చెప్పారు. పోలీసులు కూడా అదే విషయాలని మీడియాతో ప్రస్తావించారు. అయితే పూర్తిస్థాయిలో సమాచారం తెలుసుకోకుండా జబర్దస్త్ లో ప్రస్తుతం లేడీ గెటప్ లు వస్తోన్న హరికృష్ణని టీవీ ఛానల్స్, సోషల్ మీడియాలో విస్తృతంగా ట్రోల్ చేస్తున్నాయి. అతని ఫోటోలు వేసి మరి వార్తలు ప్రసారం చేస్తున్నాయి. గతంలో ఆ స్మగ్లర్ హరిబాబు నేను కాదు అంటూ లేడీ గెటప్ హరికృష్ణ క్లారిటీ ఇచ్చారు.

jabardasth comedian hari babu clarifications on smuggling allegations

అయినా కాని మరోసారి ట్రోల్స్ బారిన పడ్డారు. తాజాగా మరోసారి ఓ మీడియా ఛానల్ ముందుకొచ్చిన హరికృష్ణ తనపై వచ్చిన స్మగ్లింగ్ ఆరోపణలని ఖండించారు. స్మగ్లర్ హరిబాబు నేను కాదని వివరణ ఇచ్చాడు. 2013లో షకలక శంకర్ టీమ్ లో ఓ రెండు, మూడు ఎపిసోడ్స్ లో హరిబాబు అనే వ్యక్తి కనిపించాడు. అయితే అప్పటి నుంచి నేను లీడింగ్ లోనే ఉన్నాను.

అతను మొదటి సారి స్మగ్లింగ్ లో పట్టుబదినపుడు గూగుల్ లో నా ఫోటోలు రావడంతో అన్ని మీడియా ఛానల్స్ నన్నే హైలైట్ చేసి స్మగ్లర్ గా ముద్ర వేశాయి. తరువాత అందరూ ఒరిజినల్ వ్యక్తిని హైలైట్ చేశాయి. మరల మరోసారి ఇప్పుడు నా ఫోటోలని కొన్ని ఛానల్స్ అదే పనిగా చూపిస్తూ నేనే ఆ స్మగ్లింగ్ చేసినట్లు ప్రసారం చేస్తున్నాయి.

దీని వలన నాతో పాటు మా కుటుంబం మొత్తం సఫర్ అవుతోంది. ఈ నా ఫోటోలని తక్షణమే తొలగించి సదరు మీడియా ఛానల్స్ క్షమాపణలు చెప్పకపోతే పరువునష్టం క్రింద లీగల్ నోటీసులు పంపిస్తా అని హరికృష్ణ చెప్పుకొచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X