నాపై కేసులు పెట్టింది అందుకే.. జబర్దస్త్ కమెడియన్ హరి సంచలన ఆరోపణ!
ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో జబర్దస్త్ కమెడియన్ హరి అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. స్మగ్లింగ్ కేసుతో పాటు ఇంకా చాలా కేసులు అతడిపై నమోదై ఉన్నాయి. ఇటీవల చిత్తూరు పోలీసులు హరిని అదుపులోకి తీసుకున్నారు. విచారణ తరువాత హరి మీడియాతో మాట్లాడుతూ సంచలన ఆరోపణలు చేసాడు.
తాను జీవితంలో కేవలం ఒక్కసారి మాత్రమే స్మగ్లింగ్ చేసానని తెలిపాడు. ఓ కానిస్టేబుల్ అక్రమంగా ఎర్రచందం రవాణా చేస్తుంటే పోలీసులకు సమాచారం ఇచ్చా. దేనితో అతడు నాపై పగ పెంచుకున్నాడు. పలురకాల తప్పుడు కేసులు పెట్టి తనని ఇరికించాడని హరి ఆరోపించాడు.

స్మగ్లింగ్ తో హరి కోట్లకు పడగలెత్తినట్లు పోలీసులు చెబుతున్నారు. ఇటీవల విడుదలైన శంభో శంకర చిత్రానికి కూడా హరి ఫైనాన్స్ చేశాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. హరి కేసుని తిరుపతి టాస్క్ ఫోర్స్ అధికారులు డీల్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











