Jabardasth Hari: ఎర్రచందనం స్మగ్లింగ్‌లో జబర్దస్త్ కమెడియన్.. ప్రధాన సూత్రధారిగా వెల్లడి!
బుల్లితెర కామెడీ షో జబర్దస్త్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ షో ప్రారంభమైనప్పటి నుంచి వినోదాన్ని పంచుతూ తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఇక ఈ షో ద్వారా మోస్ట్ పాపులర్ అయినవాళ్లలో ఎంతోమంది ఉన్నారు. జబర్దస్త్ తో వచ్చిన క్రేజ్ ద్వారా వివిధ షోలలో, సినిమాల్లో అవకాశాలు కొట్టేస్తూ సినీ రంగంలో తమ కెరీర్ ను మరింతగా పదిలం చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఓ కమెడియన్ మాత్రం వీరందరికి భిన్నంగా ఎర్రచందనం స్మగ్గింగ్ చేశాడు. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..
జబర్దస్త్ కామెడీలో షోలో హాస్య నటుడిగా మెప్పించాడు హరిబాబు (Jabardasth Hari). ఎక్కువగా లేడీ గెటప్పులు వేస్తూ వైఫ్ పాత్రలతో ఆకట్టుకునేవాడు. అఫైర్స్ కు సంబంధించిన జోకులకు హరిబాబునే ఎక్కువగా వాడేవారు టీమ్ లీడర్స్. ఇలా కొన్నేళ్ల క్రితం కమెడియన్ గా చేసిన హరిబాబు ఎర్రచందనం స్మగ్గింగ్ కేసులో ఇరుక్కున్నాడు. చిత్తూరు జిల్లా పుంగనూరులో రూ. 60 లక్షళ విలువైన ఎర్రచందనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ అక్రమ తరలింపులో హరిబాబుకు సంబంధం ఉందని పోలీసులు చెబుతున్నారు.

శేషాచలం అటవీ ప్రాతంలో మాత్రమే లభ్యమయ్యే ఎర్రచందనాన్ని విదేశాలకు అక్రమంగా తరలిస్తూ కోట్లు సంపాదిస్తున్నారు. తాజాగా ఎర్రచందనం అక్రమ రవాణాలో జబర్దస్త్ కమెడియన్ హరిబాబు హస్తం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అసలు హరిబాబు ఎర్రచందనాన్ని ఎక్కడికి తరలించేవాడో పోలీసులు తెలిపారు. ఆదివారం అంటే జూన్ 11 రాత్రి పుంగనూరు పోలీసులకు వచ్చిన సమాచారంతో శివారు ప్రాంతంలో తనిఖీలు చేపట్టారు. పోలీసులను చూసి రెండు వాహనాలు తప్పించుకునేందుకు ప్రయత్నించగా వాటిని అడ్డగించి పట్టుకున్నారు. ఈ క్రమంలోనే వాహనం డ్రైవర్ పరార్ కాగా, మరో వాహనం డ్రైవర్ కిషోర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
దాదాపు రూ. 60 లక్షల విలువ గల 19 ఏ గ్రేడ్ ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. రెండు వాహనాలను సీజ్ చేశారు. పోలీసుల విచారణలో జబర్దస్త్ ఆర్టిస్ట్ హరిబాబు ప్రధాన సూత్రధారిగా ఉన్నట్లు తెలిసింది. అయితే ప్రస్తుతం హరిబాబు పరారీలో ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. అతని కోసం వెతుకుతున్న పోలీసులు హరిబాబుపై ఇదివరకు కూడా అనేక కేసులు ఉన్నట్లు వెల్లడించారు. 2021 మే నెలలో చిత్తూరు జిల్లా భాకరపేట సమీపంలోని చీకి మానుకోన అటవీ ప్రాంతంలో రెడ్ శాండిల్ అక్రమంగా సరఫరా అవుతుందన్న సమాచారంతో చేసిన దాడుల్లో ఎనిమిది మందిని పట్టుకున్నారు. అప్పుడూ కూడా హరిబాబు తప్పించుకున్నాడని సమాచారం.


Click it and Unblock the Notifications











