ఆ గొంతులను మూయించి.. మీసం మెలేసిన రాంచరణ్.. మెగా హీరోలు ఎంతమంది వస్తే ఏంది? అంటూ ఆది హైపర్ కామెంట్
మెగా పవర్ స్టార్ రాంచరణ్ జన్మదిన వేడుకలు హైదరాబాద్‌లోని శిల్పకళావేదిక ఆడిటోరియంలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలో దిల్ రాజు, మైత్రీ మూవీస్ అధినేత నవీన్, సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, హైపర్ ఆది తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హైపర్ ఆది చాలా ఎమోషనల్‌గా మాట్లాడారు. మెగా హీరోల గురించి ఆయన మాట్లాడుతూ...

నేను ఉన్నానంటూ చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి గురించి హైపర్ ఆది తనదైన శైలిలో స్పందిస్తూ.. ఎవరైనా వచ్చి మేము ఆపదలో ఉన్నామని అంటే.. నేను ఉన్నాను అంటూ వచ్చే చిరంజీవి గురించి మాట్లాడుకొందామా అంటూ మెగా అభిమానులను ప్రశ్నించారు. హైపర్ ఆది మాట్లాడుతుండగా మెగా ఫ్యాన్స్ ఆనందంతో కేకలు వేయడం కనిపించింది.
ఎద అందాల విందు.. రిషికా బాలి పిక్స్ వైరల్

అప్పు చేసి సహాయం చేసే పవన్
ఇక పవన్ కల్యాణ్ గురించి హైపర్ ఆది మాట్లాడుతూ.. తన వద్ద 100 రూపాయలు ఉంటే మరో 100 రూపాయలు అప్పు చేసి సహాయం చేసే పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ గురించి మాట్లాడుకొందామా అంటూ రాంచరణ్ బర్త్ డే సెలబ్రేషన్స్‌లో హంగామా చేశారు.

నాగబాబు, వైష్ణవ్ తేజ్ గురించి
అంతేకాకుండా నాగబాబు వ్యక్తిత్వం గురించి వెల్లడించారు.. అవతలి వారు ఎంతటివారైనా సరే.. తన సోదరుల గురించి ఒక్క కామెంట్ చేసినా సహించకుండా నువ్వెంత అనే నాగబాబు గురించి మాట్లాడుకొందామా? మెగా కాంపౌండ్ నుంచి ఎంత మంది వస్తారు అంటూ కామెంట్ చేసే వాళ్లకు ఉప్పెన మూవీతో ఘాటుగా సమాధానం చెప్పిన వైష్ణవ్ తేజ్ గురించి చెప్పుకొందామా అంటూ మెగా ఫ్యాన్స్ అడిగారు.

మీసం వెలేసిన రాంచరణ్
సినీ రంగానికి వచ్చిన సమయంలో తండ్రి పేరు నిలబెట్టగలడా? అని కామెంట్ చేసిన వారికి తన మీసం మెలెట్టి మెగాస్టార్ కొడుకా? మజాకా అనే నిరూపించిన మెగా పవర్ స్టార్ రాంచరణ్ గురించి మాట్లాడుదామా?.. లేదా అప్పుడెప్పుడూ వచ్చిన పునాది రాళ్లు సినిమా నుంచి ఇప్పటి వరకు ఎందరో హీరోలకు పునాది వేసిన మీ గురించి మాట్లాడుకొందామా అని హైపర్ ఆది తన స్పీచ్‌తో కేక పెట్టించాడు.

రికార్డుల తిరగరాసే స్టైలిష్ స్టార్
ఇక రికార్డులు ఎవరైనా కొట్టండి.. నేను తిరగరాస్తా అని చెప్పే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గురించి మాట్లాడుకొందామా? మెగా హీరోల్లో క్లాస్ హీరో అనే వాళ్లకు వాల్మికీతో తన మాస్ విశ్వరూపాన్ని చూపించిన వరుణ్ తేజ్ గురించి మాట్లాడుకొందామా? లేదా పెద్ద మామయ్యలా నటిస్తాడు? రెండో మామయ్యలా నవ్విస్తాడు? చిన్నమామయ్యలా నలుగురికి సహాయం చేస్తాడు అని చెప్పుకొన్న సాయిధరమ్ తేజ్ గురించి మాట్లాడుకొందామా అంటూ హైపర్ ఆది హల్‌చల్ చేశాడు.

మెగా ఫ్యామిలీ ప్రేమిస్తుంది...
రాంచరణ్ బర్త్ డే వేడుకకు వచ్చిన ప్రతీ అభిమాని మెగా ఫ్యామిలీని ప్రేమిస్తుంది. అలాగే తమ అభిమానులను మెగా ఫ్యామిలీ కూడా ప్రేమిస్తుంది. అంత మంచి మనసు ఉన్న మెగా ఫ్యామిలీ ఎప్పుడూ చల్లగా ఉండాలని కోరుకొంటున్నాను అని హైపర్ ఆది అన్నాడు.

ఎన్ని ఫ్యామిలీ బతుకుతున్నాయో తెలుసా?
మెగా ఫ్యామిలీ ఉన్నతిని ఓర్వలేని కొందరు.. ఎంత మంది హీరోలు వస్తారు అని ఏదేదో అంటుంటారు. మెగాస్టార్ ఇంటి నుంచి ఎంత మంది వస్తారయ్యా అంటారు. ఎంతమందైనా వస్తారు. ఎందకంటే మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన 8 మంది హీరోలు ఏడాదికి రెండు సినిమాలు తీస్తారు. మొత్త 16 సినిమాల వల్ల ఎంతో మందికి ఉపాధి దొరుకుతుంది. ఎన్ని ఫ్యామిలు బతుకుతున్నాయో తెలుసా? టాలెంట్ ఉంది.. ఎంతమందైనా వస్తారు. రికార్డులు కొడుతూనే ఉంటారు. అది మెగా ఫ్యామిలీ అంటూ హైపర్ ఆది ఎమోషనల్ అయ్యారు.


Click it and Unblock the Notifications











