భ్రమల్లో బతుకొద్దు.. ఆయనను నా రికార్డులు బ్రేక్ చేయమను.. పంచులు పేల్చిన హైపర్ ఆది

తెలుగు టెలివిజన్ రంగంలో జబర్దస్త్‌కు ఎదురే లేకుండా పోయింది. కాస్త అడల్డ్ కంటెంట్ ఎక్కువగానే అనిపించినా ప్రస్తుత కాల పరిస్థితులు రియాలిటీ షోకు కలిసివచ్చాయి. అయితే జబర్దస్త్‌కు ఎదురేలేకండా పోయిందనుకొన్న సమయంలో మరో చానెల్‌లో అదిరింది షో పడటం కాస్త గందరగోళంగా మారింది. ఈ క్రమంలో జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది మాట్లాడుతూ..

ఎవరి ప్రతిభ వారిదే

ఎవరి ప్రతిభ వారిదే

అదిరింది షోలో సద్దా రేటింగ్ హైపర్ ఆది కంటే ఎక్కువగా ఉందనే విషయంపై హైపర్ ఆది స్పందిస్తూ.. ఎవరి ప్రతిభ వారిది. కానీ వారి టాలెంట్‌ను కేవలం ఐదు వారాల్లోనే నిర్ధారించడం సరికాదు. నా విషయంలో గత ఐదేళ్లుగా ఒకే షోలో ఒకే టీమ్‌తో ప్రేక్షకులను మెప్పిస్తున్నాం. అంతేకానీ భ్రమల్లో బతకడం కుదరదు అని హైపర్ ఆది పంచ్ ఇచ్చాడు.

 పోలీకలు పెట్టుకోవద్దు..

పోలీకలు పెట్టుకోవద్దు..

సాధారణంగా పోటీ షో అంటే ఇలాంటి పోలీకలు కామన్‌గా ఉంటాయి. కానీ వాస్తవాలేంటో భ్రమలేంటో తెలుసుకోవాలి. హైపర్ ఆదిని దాటలాంటే కొన్ని లెక్కలు ఉన్నాయి. ఇప్పటి వరకు నేను 100కుపైగా స్కిట్లు చేశాను. అందులో 10 మిలియన్లు దాటిన వీడియోలు 40 ఉన్నాయి అని చెప్పారు.

నా వీడియోల రికార్డులు ఇలా

నా వీడియోల రికార్డులు ఇలా

అలాగే 20 మిలియన్‌కుపైగా వ్యూస్ వచ్చిన స్కిట్ల వీడియోలు 5కుపైనే ఉన్నాయి. 30 మిలియన్‌కుపైగా వచ్చినవి కూడా ఉన్నాయి. సుమారు 60 మిలియన్లు వచ్చిన వీడియోలు కూడా నా కెరీర్‌లో ఉన్నాయి. హైపర్ ఆదిని దాటాలంటే వీటన్నిటిని దాటాలి. ఎవరైనా ఇలాంటి రికార్డులను దాటితే వాళ్లు గ్రేట్ అని ఒప్పుకొంటాను అని హైపర్ ఆది అన్నారు.

Recommended Video

Jabardasth Comedy Show Management New Rules To Comedians
 ఇతరులను చిన్నచూపు చూడొద్దు

ఇతరులను చిన్నచూపు చూడొద్దు

నా విషయం పక్కన పెడితే.. సుడిగాలి సుధీర్, చమ్మక్ చంద్ర గత ఏడేళ్లుగా జబర్దస్త్‌లో టీమ్ లీడర్లుగా ఉన్నారు. వారిని దాటి చూపించమనండి వాళ్లను. వాళ్లకు వచ్చే ఒక మిలియనో, లేదా రెండు మిలియన్లో నేను టీమ్ మెంబర్‌గా ఉన్న సమయంలో నాకు వచ్చేవి. ఇలా పోలీకలు పెట్టుకోవడం మంచిది కాదు. ఎవరి ప్రతిభ, టాలెంట్ వారికే చెందుతుంది. తాము గొప్ప అనేది ఇతరులను చిన్నచూపు చూడవద్దు అని హైపర్ ఆది అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X