హైపర్ ఆదినా మజాకా.. అలాంటి వారి గూబ పగలగొట్టిన బుల్లితెర స్టార్
బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు హైపర్ ఆది. తెలుగు టెలివిజన్ రంగంలో ఈయన ఒక సునామీ. జబర్దస్త్ కామెడీ షోతో తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరయ్యాడు. తన రైటింగ్ స్కిల్స్, పంచులు, ప్రాసలతో టెలివిజన్ లో సెన్సేషన్ గా మారిన సంగతి అందరికీ విధితమే. ప్రస్తుతం జబర్దస్త్ కామెడీ షోకు దూరమైన ఈయన ఇప్పుడు ఆయా షోల్లో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు సినిమాల్లోనూ విభిన్న పాత్రలు పోషిస్తూ ఆకట్టుకుంటున్నారు. ఈ క్రమంలో తాజాగా హైపర్ ఆదికి సంబంధించిన లేటెస్ట్ న్యూస్ ఆసక్తికరంగా మారింది. ఆయన వ్యాఖ్యలు కూడా అందరి చూపును కట్టి పడేస్తున్నాయి.
జబర్దస్త్ టు జనసేన కార్యకర్తగా..
హైపర్ ఆది తొలుత జబర్దస్త్ కామెడీ షోకు ఎంట్రీ ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. అదిరి అభి టీమ్ లో జాయిన్ అయ్యి తన టాలెంట్ తో అతి తక్కువ సమయంలోనే టీమ్ లీడర్ గానూ ఎదిగాడు. ప్రేక్షకుల్లో విశేష ఆదరణ దక్కించుకున్న తర్వాత అటు పొలిటికల్ క్యాంపెయినింగ్ లోనూ తన ముద్ర వేసుకున్నారు. పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పొలిటికల్ పార్టీ జనసేన తరుఫుణ గత ఎన్నికల్లో విశేషంగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. ఇలా అదిరే అభి అంచెలంచెలుగా ఎదుగుతూ వస్తుండటం అందరూ అభినందించదగిన విషయం.

తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీలో..
జబర్దస్త్ కామెడీ షోను విడిచి పెట్టిన తర్వాత హైపర్ ఆది శ్రీదేవి డ్రామా కంపెనీలో తరుచూ కనిపిస్తున్నారు. కొత్త కొత్త కంటెంట్ తో అలరిస్తున్నారు. ఈ షోకు జడ్జీగా ఇద్రజ వ్యవహరిస్తున్నారు. మేల్ జడ్జీగా కృష్ణ భగవాన్ ఉన్నారు. యాంకర్ రష్మీ గౌతమ్ వ్యాఖ్యాతగా షోను నడిపిస్తోంది. అయితే లేటెస్ట్ ఎపిసోడ్ లో తన ఎడ్యుకేషన్ గురించి ప్రస్తావించారు. ఏకంగా తన సర్టిఫికెట్ లను ప్రదర్శించి స్కూల్, ఇంటర్ లో ఎంత స్కోర్ చేశారో చూపించారు. టెన్త్ లో 534, ఇంటర్ లో 945 మార్కులు సాధించానని చెప్పారు. అయితే తను ఈ సర్టిఫికెట్లను చూపించడం వెనకాల ఓ రీజన్ ఉంది.
గట్టిగా సమాధానం ఇచ్చిన హైపర్ ఆది..
సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్లందరూ ఏం చదువుకోని ఉండరనే అపోహాలు ఉన్నాయని, కానీ అది రాంగ్ అని చెప్పారు. చదువు లేకుండా ఏ ప్రొఫెషన్ కు వెళ్లినా రాణించడం కష్టమని చెప్పారు. చాలా మంది చదువు లేని వాళ్లు ఇండస్ట్రీలోకి రావడం కాదని, తను బాగా చదువుకున్నాడు కాబట్టే అక్కడి పరిస్థితులను త్వరగా అర్థం చేసుకొని అందరికీ పోటీగా నిలిచానని చెప్పుకొచ్చారు. అలాగే నూకరాజు, బుల్లెట్ భాస్కర్లకు సంబంధించిన సర్టిఫికెట్లను కూడా ప్రదర్శించారు. వారందరినీ జడ్జీ ఇంద్రజ అభినందించారు.
ఇక హైపర్ ఆది జబర్దస్త్ తర్వాత శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ వంటి షోల్లో మెరుస్తూ సందడి చేస్తున్నారు. ఇక వెండితెరపైనా వరుస చిత్రాలతో అలరిస్తున్నారు. 2017 నుంచి వరుసగా సినిమాల్లో విభిన్న పాత్రలు పోషిస్తూ అలరించారు. చివరిగా పుష్ప 2, రాచరికం, మజాకా వంటి చిత్రాల ద్వారా వెండితెరపై మెరిశారు.


Click it and Unblock the Notifications











