Hyper Aadi:పెళ్లి చేసుకున్న హైపర్ ఆది.. పాపులర్ షోలో భార్య ఫోటో..

హైపర్ ఆది.. ఈ పేరు తెలియని, ఈయన పంచుల గురించి తెలియని తెలుగు బుల్లితెర ప్రేక్షకులు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. ఆయన వేసేవి డబుల్ మీనింగ్ పంచులే అయినా కడుపుబ్బా నవ్వకుండా ఉండలేరు. గత పదేళ్లుగా జబర్దస్త్ షోలో కమెడియన్ గా చేస్తూ అందరినీ నవ్విస్తున్న ఈయన కెరియర్ పరంగా దూసుకు వెళ్తున్నారు. అయితే ఈయన ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు. కానీ చాలా సార్లు స్టేజీ మీద పెళ్లి చేసుకుని కనిపించారు. అలాగే తన భార్య ఈమేనంటూ చాలా మందిని తీసుకు వచ్చారు. తాజాగా మరోసారి ఓ అమ్మాయిని తీసుకు వచ్చి అతడి భార్య అని చెప్పారు. మరి ఇదైనా నిజమేనా కాదా అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

జబర్దస్త్ షోలో అదిరిపోయే పంచులు వేస్తూ అతి తక్కువ కాలంలోనే ట్రెండింగ్ లోకి వచ్చేసిన కమెడియన్ హైపర్ ఆది గురించి తెలుగు బుల్లితెప ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఈయన వేసే డబుల్ మీనింగ్ డైలాగ్ ల పంచులకు సెపరేట్ ఫ్యాన్స్ బేస్ ఉంది. బీటెక్ చేసిన ఈయన ఉద్యోగం చేయకుండా.. సినిమాలపై తనకు ఉన్న ఆసక్తితో ఇండస్ట్రీలోకి వచ్చాడు. అలా జబర్దస్త్ షోలో అవకాశం రాగా తన టాలెంట్ తో అత్యున్నత స్థాయికి చేరుకున్నాడు. కమెడియన్ స్థాయి నుంచి టీం లీడర్, యాంకర్ గా కూడా మారి సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాడు.

Jabardasth Comedian Hyper Aadi Wife Face Revealed Check Details

ఊహించని స్థాయిలో క్రేజ్ దక్కించుకున్న ఈయన ఒక్క జబర్దస్త్ లోనే కాకుండా అనేక రకాల షోలలో కనిపిస్తూ సందడి చేస్తున్నాడు. ముఖ్యంగా శ్రీదేవి డ్రామా కంపెనీ, మరోవైపు జబర్దస్త్.. ఇంకా ఢీ జోడీ ఇవే కాకుండా అనేక ఈవెంట్లు చేసుకుంటూ తన టాలెంట్ ప్రూవ్ చేసుకుంటున్నాడు. అయితే తాజాగా ఈయన శ్రీదేవి డ్రామా కంపెనీలో తన భార్యను తీసుకు వచ్చాడు. ఆమె ఎంట్రీ చూసిన ప్రతీ ఒక్కరూ షాక్ అయ్యారు. అయితే ఎప్పటిలాగా కాకుండా ఈసారినిజమైన భార్య అంటూ చెప్పుకొచ్చాుడ.

ముందుగా షోలోకి ఎంట్రీ ఇచ్చిన హైపర్ ఆది తనకు పెళ్లి అయిందని చెప్పుకొచ్చాడు. అయితే ఎవరికీ తెలియకుండా సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నానని .. తెలిపాడు. అంతేకాకుండా తన భార్యను ఇక్కడకు తీసుకు వచ్చానని కూడా వివరించాడు. అప్పుడే యాంకర్ రష్మి హైపర్ ఆది భార్యను స్టేజీ మీదకు పిలిచింది. అయితే వెంటనే వచ్చేసిన ఆమె.. మాస్క్ పెట్టుకుని, సన్ గ్లాసెస్ పెట్టుకుని మరీ స్టైల్ గా నడిచి వచ్చింది. గ్రీన్ కలర్ చీరలో ముద్దుగుమ్మలా ఉన్న ఈమె తెలుగు అమ్మాయి కాదని తెలుస్తోంది.

వేరే దేశపు అమ్మాయిని తీసుకు వచ్చి స్కిట్ లో భాగంగానే ఇలా చేయించినట్లు చూస్తుంటే అర్థం అవుతుంది. ముఖ్యంగా ఈ అందమైన నా భార్య మొహాన్ని ఇప్పటి వరకు నేనే చూడలేనని హైపర్ ఆది చెప్పాడు. ఆమె భర్త మాట కంటే కూడా మేనేజర్ మాటనే ఎక్కువగా వింటుందని వివరించాడు. తాను పిలిచినా రాదని.. మేనేజర్ వెళ్లమంటే మాత్రం కచ్చితంగా వెళ్తుందంటూ కామెడీ చేశాడు. ఇలా పదే పదే తన భార్య ఆమెనే, ఈమెనే అంటూ అనేక మంది అమ్మాయిలను స్టేజీ మీదకు తీసుకు వస్తున్నారు. దీంతో ఫ్యాన్స్ అంతా ఫైర్ అవుతున్నారు. ఇంకోసారి ఇలా చేయొద్దంటూ కామెంట్లు చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X