రెమ్యునరేషన్‌పై క్లారిటీ ఇచ్చిన జబర్దస్త్ కెవ్వు కార్తిక్.. 200రూపాయలతో మొదలైన జీవితం..

జబర్దస్త్ ద్వారా చాలా మంది కమెడియన్స్ కు ఒక ప్రత్యేకమైన ప్లాట్ ఫార్మ్ దొరికింది. ఎలాగైనా సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వాలని కష్టపడే వారికి జబర్దస్త్ లాంటీ రియాలిటీ షోలు మంచి బూస్ట్ ఇస్తున్నాయి. ఇక టీమ్ లీడర్ గా చేసే అవకాశం వస్తే కమెడియన్స్ పంట పండినట్లే. ఆదాయం టీమ్ లో ఉన్న వారి కంటే ఎక్కువగా అందుతుందట. కెవ్వు కార్తిక్ కూడా ఒక సాధారణ టీమ్ మెంబర్ నుంచి టీమ్ లీడర్ వరకు వచ్చాడు. ఇక ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ కమెడియన్ కొన్ని ఆసక్తికరమైన విషయాలని చెప్పాడు.

సీనియర్లు వెళ్లిపోవడంతో..

సీనియర్లు వెళ్లిపోవడంతో..

కెవ్వు కార్తీక్ మొదట జబర్దస్త్ లో వివిధ టీమ్ లలో ఒక కమెడియన్ గా చేసుకుంటూ వచ్చాడు. అయితే అప్పట్లో అతనికి అంతగా గుర్తింపు రాలేదు. మెల్లగా సీనియర్ టీమ్ లీడర్స్ సంఖ్య తగ్గడంతో జూనియర్స్ కు ఛాన్సులు రావడం మొదలయ్యాయి. ఆ విధంగా కార్తిక్ సొంతంగా స్క్రిప్ట్ రాసే అనుభవం రావడంతో అతనికి ప్రమోషన్ లభించింది.

మరోసారి ప్రమోషన్ లభించింది

మరోసారి ప్రమోషన్ లభించింది

మాస్ అవినాష్ - కెవ్వు కార్తిక్ ఇద్దరు కూడా స్క్రిప్ట్ రాసుకుంటూ టీమ్ లీడర్స్ గా కొనసాగారు. అయితే అవినాష్ బిగ్ బాస్ ఛాన్స్ రావడం వలన బయటకు వెళ్లిపోవడంతో కెవ్వు కార్తిక్ కు సోలో లీడర్ గా మరోసారి ప్రమోషన్ లభించింది. పేమెంట్స్ కూడా గట్టిగానే పెరిగాయి. విభిన్నంగా ట్రై చేస్తూ కెవ్వు కార్తిక్ బయట కూడా మంచి ఛాన్సులు అందుకుంటున్నాడు.

200రూపాయలతో మొదలుపెట్టి

200రూపాయలతో మొదలుపెట్టి

ఇక ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో కార్తిక్ తన జీవితం గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. మొదట 200రూపాయలతో చిన్న తరహా ఈవెంట్స్ లలో మిమిక్రి చేసుకుంటూ వచ్చినట్లు చెప్పాడు. ఇంజినీరింగ్ పూర్తి చేసిన అనంతరం కొన్నాళ్ళు జాబ్ చేశానని కానీ కుటుంబ ఆర్థిక పరిస్థితులకు అది ఏ మాత్రం సరిపోదనే ఉద్దేశ్యంతో ఈవెంట్స్ చేయడం స్టార్ట్ చేసినట్లు తెలిపారు.

ఈవెంట్స్ తో భారీ సంపాదన

ఈవెంట్స్ తో భారీ సంపాదన

హైదరాబాద్ లోకి వచ్చినప్పుడు 1500 రూపాయలకు ఈవెంట్స్ చేసుకుంటూ వచ్చాను. అయితే వరంగల్ లో ఒక బర్త్ డే ఈవెంట్ తో వచ్చిన క్రేజ్ తో నా జీవితమే మారిపోయింది. అక్కడ అందరికి కార్డ్స్ ఇవ్వడంతో కొన్ని నెలల్లోనే నా సంపాదన లక్ష రూపాయలు దాటింది అంటూ ఈవెంట్స్ లలో టాప్ సింగర్స్ తో కూడా పాటలు పాడించినట్లు.. కార్తిక్ వివరణ ఇచ్చారు.

Recommended Video

Anchor Anasuya జబర్దస్త్ క్రేజ్.. చేతినిండా ప్రెస్టీజియస్ సినిమాలు | #HBDAnasuya | Filmibeat Telugu
జబర్దస్త్ లో కూడా...

జబర్దస్త్ లో కూడా...

ఇక జబర్దస్త్ లోకి వచ్చిన తరువాత అటు వైపు వెళ్లకుండా ఇక్కడే తన టాలెంట్ ను నీరూపించుకుంటున్నట్లు తెలియజేశాడు. ఇక ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం కార్తిక్ జబర్దస్త్ టీమ్ లీడర్ గా కూడా నెలకు లక్షల్లోనే సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక అందరిలనే ఈ కమెడియన్ కూడా మల్లెమాలలో అగ్రిమెంట్ తో కొనసాగుతున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X