Kevvu Karthik: జబర్దస్త్ కెవ్వు కార్తీక్ పెళ్లి.. అమ్మాయితో రొమాంటిక్ ఫొటోలు.. వధువు ఎవరంటే?
జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఎంతోమంది నటీనటులు లైమ్ లైట్ లోకి వచ్చారు. ఇప్పటికే యాంకర్ అనసూయ, రష్మీ గౌతమ్, సుడిగాలి సుధీర్, హైపర్ ఆది, గెటప్ శ్రీను వంటి తదితరులు సినిమాల్లో అవకాశాలు అందుకుంటూ సత్తా చాటుతున్నారు. ఇటీవలే వేణు వండర్స్ టీమ్ తో కామెడీ పండించిన టిల్లు వేణు ఏకంగా బలగం సినిమాకు దర్శకత్వం వహించి సాలిడ్ హిట్ట కొట్టాడు.
అలాగే గణపతి ప్రభుత్వ ఉద్యోగం సాధించాడు. వీళ్లందరి సంగతి ఇలా ఉంటే జబర్దస్త్ కెవ్వు కార్తీక్ మాత్రం త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్నాడు. తాను చేసుకోబోయే అమ్మాయితో రొమాంటిక్ పోజు ఇచ్చి ఆమె గురించి చెప్పుకొచ్చాడు.

హాయిగా నవ్విస్తూ: మిమిక్రీ ఆర్టిస్ట్ గా హైదరాబాద్ లో అడుగుపెట్టిన కార్తీక్ జబర్దస్త్ లో అవకాశం అందుకున్నాడు. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుని ప్రత్యేకమైన గుర్తింపు సాధించాడు. సాధారణ కంటెస్టెంట్ నుంచి టీమ్ లీడర్ గా ఎదిగి కెరీల్ లో సక్సెస్ ఫుల్ గా అడుగులు ముందుకు వేస్తున్నాడు. తనదైన కామెడీతో, పంచులతో తెలుగు ప్రేక్షకులను హాయిగా నవ్విస్తున్నాడు.

టీమ్ లీడర్ వరకు: అయితే 2013లో జబర్దస్త్ ప్రారంభం కాగా 2015లో కార్తీక్ ఎంట్రీ ఇచ్చాడు. మొదట ధన్ రాజ్ టీమ్ లో సాధారణ కంటెస్టెంట్ గా చేరి తర్వాత తిరుపతి ప్రకాష్ టీమ్ లో ఆరో కంటెస్టెంట్ గా కనిపించాడు. ఇక 2016లో ముక్కు అవినాష్ తో టీమ్ లీడర్ గా చేసే అవకాశం అందుకున్నాడు. అప్పటి నుంచి అతని కెరీర్ మారిపోయింది. ఇప్పటివరకు టీమ్ లీడర్ గా కొనసాగుతు ముందుకు వెళ్తున్నాడు కార్తీక్.

రొమాంటిక్ పోజులు: ఇక జబర్దస్త్ లో కెవ్వు కార్తీక్ గా వినోదం పంచుతున్నాడు. అలాంటి కార్తీక్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు కార్తీక్. అంతేకాకుండా తాను పెళ్లి చేసుకుంటున్న అమ్మాయి ఫొటో సహా పోస్ట్ చేశాడు. అయితే ఆమె మొహం పూర్తిగా కనిపించకుండా జాగ్రత్త పడిన కార్తీక్ రొమాంటిక్ పోజులు ఇచ్చాడు.
థ్యాంక్యూ బ్యూటిఫుల్: "మన జీవితంలోకి కొత్త వ్యక్తి వస్తే లైఫ్ మరింత హ్యాపీగా మారుతుందని కొంతమంది చెప్పారు. అది ఇదేనేమో. నా జీవితంలోకి అడుగు పెడుతున్నందుకు థ్యాంక్యూ బ్యూటిఫుల్. నీతో కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు ఎంతగానో ఎదురుచూస్తున్నాను సోల్ మేట్" అని రొమాంటిక్ గా క్యాప్షన్ రాయడమే కాకుండా ఇద్దరు హగ్ చేసుకున్న పిక్స్ షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ తెగ వైరల్ అవుతుంది.
క్యూరియాసిటీ పెంచుతూ: ఫొటోలు మాత్రం చాలా బాగున్నప్పటికీ కెవ్వు కార్తీక్ కు కాబోయే భార్య ఎవరనేది సస్పెన్సింగ్ గా మారింది. ఫొటోల్లో కూడా ఆమె మొహాన్ని రివీల్ చేయకుండా మరింత క్యూరియాసిటీ పెంచాడు ఈ కమెడియన్. ఇదిలా ఉంటే వరంగల్ లో పుట్టిన కార్తీక్ ఇంజినీరింగ్ పూర్తి చేసి హైదరాబాద్ వచ్చాడు. మిమిక్రీ ఆర్టిస్ట్ గా చాలా తక్కువ పేమెంట్స్ కు షోలు చేస్తూ వచ్చాడు.


Click it and Unblock the Notifications











