Kevvu Karthik: ఘనంగా జబర్దస్త్ కమెడియన్ పెళ్లి.. పిక్స్ వైరల్.. హాజరైన సెలబ్రిటీలు ఎవరంటే?

మిమిక్రీ ఆర్టిస్ట్ గా హైదరాబాద్ లో అడుగుపెట్టిన కార్తీక్ జబర్దస్త్ లో అవకాశం అందుకున్నాడు. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుని ప్రత్యేకమైన గుర్తింపు సాధించాడు. సాధారణ కంటెస్టెంట్ నుంచి టీమ్ లీడర్ గా ఎదిగి కెవ్వు కార్తీక్ గా మారాడు. కెరీల్ లో సక్సెస్ ఫుల్ గా అడుగులు ముందుకు వేస్తున్న కెవ్వు కార్తీక్ తాజాగా ఓ ఇంటివాడు అయ్యాడు. శ్రీలేఖ అనే అమ్మాయితో కెవ్వు కార్తీక్ పెళ్లి హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు బుల్లితెర నుంచి పలువురు హాజరయ్యారు.

ప్రముఖ కామెడీ షో జబర్దస్త్ ద్వారా పాపులర్ అయిన కమెడియిన్లలో కెవ్వు కార్తీక్ ఒకరు. కమెడియన్ గా, రైటర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న కెవ్వు కార్తీక్ తాజాగా వివాహబంధంలోకి అడుగు పెట్టాడు. కెవ్వు కార్తీక్, శ్రీలేఖల వివాహం జూన్ 8న అంటే గురువారం రోజున హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ పెళ్లి వేడుకకు తెలుగు బుల్లితెర పరిశ్రమ నుంచి పలువురు సెలబ్రిటీలు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

Jabardasth Comedian Kevvu Karthik Marriage With Srilekha On June 8

కెవ్వు కార్తీక్ వివాహానికి జబర్దస్త్ కామెడీ షో నుంచి గెటప్ శ్రీను సతీసమేతంగా హాజరయ్యాడు. అలాగే పలువురు కమెడియన్స్ పాల్గొన్నట్లు సమాచారం. కెవ్వు కార్తీక్ కు అభినందనలు తెలియజేస్తూ గెటప్ శ్రీను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. "వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టిన మా కెవ్వు కార్తీక్, శ్రీలేఖలకు మీరు జీవితాంతం సుఖ సంతోషాలతో వర్దిల్లాలని ఆశిస్తూ.. ఇరువురికి వివాహ మహోత్సవ శుభాకాంక్షలు" అని రాసుకొచ్చిన గెటప్ శ్రీను ఫొటోలు షేర్ చేశాడు.

Jabardasth Comedian Kevvu Karthik Marriage With Srilekha On June 8

ప్రస్తుతం కెవ్వు కార్తీక్-శ్రీలేఖల వివాహం ఫొటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో పలువురు బుల్లితెర తారలు, నెటిజన్లు, తెలుగు ప్రేక్షకులు నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇదిలా ఉంటే తనకు కాబోయే భార్యను మే 31న సోషల్ మీడియా ద్వారా పరిచయం చేశాడు కెవ్వు కార్తీక్. అయితే అందులో ఆమె మొహం కనిపడకుండా జాగ్రత్త పడిన కార్తీక్ రొమాంటిక్ పోజులతో అట్రాక్ట్ చేశాడు. తర్వాత కొద్దిరోజులకు భార్య ముఖాన్ని చూపిస్తూ ఫొటోలు షేర్ చేశాడు.

తనకు కాబోయే భార్య మొహాన్ని చూపించిన పోస్టులో తనపేరు సిరిగా సంబోధించాడు కెవ్వు కార్తీక్. కానీ గెటప్ శ్రీను మాత్రం శ్రీలేఖ అని రాసుకొచ్చాడు. అంటే బహుశా.. తనకు కాబోయే భార్యకు సిరి అని ముద్దుగా కెవ్వు కార్తీక్ పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఏదైతేనేం ఇప్పుడు ఎట్టకేలకు ఘనంగా ఓ ఇంటివాడు అయ్యాడు కెవ్వు కార్తీక్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X