Jabardasth: సీక్రెట్‌గా జబర్దస్త్ కమెడియన్ ప్రేమ పెళ్లి... వధువు ఎవరో తెలిస్తే షాకే!

బుల్లితెరపై దశబ్దంకు పైగా ప్రేక్షకులను అలరిస్తూ నవ్విస్తూ వస్తున్న షోల్లో ఒకటి జబర్దస్త్. ఇక ఈ జబర్దస్త్ షో ఎంతో మందికి లైఫ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక్కడికి కమెడియన్స్ గా వచ్చి.. సినిమా ఇండస్ట్రీల్లో హీరోలుగా, డైరెక్టర్లుగా, క్యారెక్టర్ ఆర్టిస్టులుగా, కమెడియన్స్ గా సెటిల్ అయిపోయారు. ఇక ఈ షోలో కిర్రాక్ ఆర్పీ ఓ కమెడియన్ గా ఎంటర్ అయి.. టీమ్ లీడర్ అయి క్రేజ్ సంపాదించుకున్నాడు. అయితే ఈ కమెడియన్ ఇప్పుడు సైలెంటుగా పెళ్లి చేసేసుకున్నాడు. ఇది చూసిన నెటిజన్స్ షాక్ అవుతున్నారు. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

జబర్దస్త్ షో గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఈ షో నుంచి ఎంతో మంది కమెడియన్స్ సినిమా ఇండస్ట్రీలో సెటిల్ అయిపోయారు. ఇక ఇటీవల కాలంలో ఈ షోకు కాస్త ఆదరణ తగ్గిపోయినా.. ప్రేక్షకులను అలరించేందుకు ప్రయత్నిస్తునే ఉంది. ఆ విషయం పక్కన పెడితే.. జబర్దస్త్ కిర్రాక్ ఆర్పీ అందరికి తెలిసే ఉంటుంది. ఆయన మామూలు టీమ్ మెంబర్ గా ఎంటర్ అయి.. ఆ తర్వాత తన పంచులతో తనదైన మార్క్ కామెడీతో టీమ్ లీడర్ అయిపోయాడు.

Jabardasth comedian Kiraak RP secretly married his girlfriend Lakshmi Prasanna in Vizag Full Details Here

కిర్రాక్ ఆర్పీ టీమ్ అని పెట్టుకుని ప్రేక్షకులను అలరించే వాడు. ఇక ఇప్పుడు ఈ ఆర్పీ సైలెంటుగా ఓ ఇంటివాడయ్యాడు. తన ప్రేయసి మెడలో మూడు ముళ్లు వేసి.. వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. వీరి పెళ్లి ఈరోజు అనగా నవంబర్ 29 బంధు మిత్రుల సమక్షంలో ఘనంగా వైజాగ్ లో జరిగింది. అయితే ఎలాంటి హాడావిడి లేకుండా ఇలా గప్ చుప్ గా పెళ్లి చేసుకోవడం ఏంటని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.

అయితే పెళ్లి తర్వాత ఓ మీడియాతో మాట్లాడుతూ.. ఏడాదిన్నర క్రితమే తాము ఎంగేజ్మెంట్ చేసుకున్నామని.. ఆ ఎంగేజ్మెంట్ కు సినీ తారలు, ప్రముఖులు వచ్చారు. ఇప్పుడు వైజాగ్ లో చేసుకోవడానికి కారణం.. బంధువుల సమక్షంలో చేసుకోవాలని అనుకున్నాం.. అందుకే పెళ్లి చేసుకున్నాం. పక్కనే బీచ్ ఉంది.. అలలు వస్తూ ఉంటాయి.. చల్లని గాలి.. వస్తుంది. అందరికీ బాగుంటుందని ఇక్కడే చేసుకున్నామని వెల్లడించారు. అందుకే సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నామని తెలిపారు.

Jabardasth comedian Kiraak RP secretly married his girlfriend Lakshmi Prasanna in Vizag Full Details Here

ఇక వధువు విషయానికి వస్తే.. అమ్మాయి లక్ష్మీ ప్రసన్నది వైజాగ్ అని తెలుస్తోంది. కిర్రాక్ ఆర్పీతో మూడేళ్లుగా ప్రేమలో పడి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంది. గత ఏడాదే వీరి ఎంగేజ్మెంట్ జరగ్గా.. ఈ వేడుకకు చాలా మంది సెలబ్రేటీలు హాజురు అయ్యారు. ఏడాదిన్నర తర్వాత వీరు మూడు మూళ్లతో ఒక్కటయ్యారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు నెటిజన్స్.. ఈ జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు.

ఇక లక్ష్మీ ప్రసన్న ఐఏఎస్ కు కోచింగ్ తీసుకుంటుందని తెలుస్తోంది. ఇక ఐఎఎస్ కావాల్సిన పిల్లను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ఆర్పీ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇక జబర్దస్త్ షో నుంచి తప్పుకున్న కిర్రాక్ ఆర్పీ ప్రస్తుతం హైద‌రాబాద్‌ లో నెల్లూరు పెద్దారెడ్డి చేప‌ల పులుసు పేరిట క‌ర్రీ పాయింట్ వ్యాపారం చేస్తున్నాడు. ఇది సక్సెస్ కావడంతో ఇదే పేరిట ఇతర ప్రాంతాల్లో కూడా బ్రాంచ్ లు ప్రారంభించాడు ఆర్పీ.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X