Jabardasth కమెడియన్ పరిస్థితి విషమం.. అనసూయ, నాగబాబు ఎంత ఇచ్చారంటే..: కిర్రాక్ ఆర్పీ

జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపు అందుకున్న కమెడియన్స్ ఇప్పుడు ఆర్థికంగా కూడా చాలా వరకు నిలదొక్కుకుంటున్నారు అనే చెప్పాలి. అంతేకాకుండా సినిమా పరిశ్రమలో కూడా మంచి అవకాశాలతో చాలా బిజీగా మారిపోయారు. కొందరు సినిమాల కారణంగా ఇప్పుడు జబర్దస్త్ కు కూడా దూరమవుతున్నారు. అయితే కష్ట సమయాల్లో జబర్దస్త్ లో ఉన్నవారి బాధల గురించి మిగతావారు ఆలోచిస్తున్న విధానం కూడా ఆసక్తికరంగా మారింది. ఒక కమెడియన్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది అని తెలియగానే నాగబాబు అనసూయ అలాగే మరి కొంతమంది సహాయం చేసిన విషయం గురించి ఇటీవల కిరాక్ ఆర్పీ తెలియజేశాడు.

 కొత్తవారికి అవకాశాలు

కొత్తవారికి అవకాశాలు


జబర్దస్త్ ఎలాంటి కాంట్రవర్సీ క్రియేట్ చేసినప్పటికీ కూడా ఆ కామెడీ షో ద్వారా చాలామందికి ఉపాధి దొరుకుతుందని మంచి రేటింగ్ అందుకుంటు ఉండడంతో అవకాశాల కోసం ఎదురుచూస్తున్న కొత్తవారికి కూడా చాలా ఉపయోగపడుతుంది అని కమెడియన్స్ చెబుతున్నారు. జబర్దస్త్ లో నుంచి సీనియర్ కమెడియన్స్ వెళ్లిపోయిన తర్వాత కొంతమంది కొత్తవారు కూడా ఇప్పుడు టీం లీడర్స్ గా మారిపోయారు.

గొడవల కారణంగా

గొడవల కారణంగా

ఇక జబర్దస్త్ షోలో కొన్ని గొడవల కారణంగా కూడా చాలామంది బయటకు రావాల్సి వచ్చింది అక్కడ యాజమాన్యం తీరు సరిగ్గా లేదు అని ప్రవర్తించే విధానం అలాగే సపోర్ట్ చేయడంలో కూడా నిర్లక్ష్యంగా ఉంటారు అని అభిప్రాయాలు కూడా వచ్చాయి. ఆ కారణం చేతనే నాగబాబు బయటకు వచ్చినట్లు క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే.

నాగబాబు అలా చెప్పారు

నాగబాబు అలా చెప్పారు

అయితే నాగబాబు బయటకు వచ్చేసిన తర్వాత మిగతా కమెడియన్స్ చాలా వరకు కూడా జబర్దస్త్ షో నుంచి బయటకు వచ్చేశారు. ఆ తర్వాత మళ్లీ వారితోనే సరికొత్త ప్రయాణాన్ని కూడా ఆయన మొదలుపెట్టారు. కానీ ఎవరిని కూడా మంచి అవకాశాలను వదులుకోవద్దు అని జబర్దస్త్ లోనే ఉండాలి అని కూడా నాగబాబు సలహాలు ఇచ్చారు. తన కోసం మాత్రమే ఆ షోను విడిచి రావద్దు అని కూడా ఆయన ఇతరులకు తెలియజేశారు.

కిర్రాక్ ఆర్పీ కామెంట్స్

కిర్రాక్ ఆర్పీ కామెంట్స్


ఇక రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో కిరాక్రి ఆర్పీ జబర్దస్త్ లో ఒకప్పుడు అందరూ సహాయపడిన విషయం గురించి కూడా తెలియజేశాడు. ఒక కమెడియన్ పరిస్థితి విషమంగా ఉండడంతో అందరూ కలిసికట్టుగా అతనికి సహాయం చేశారని ముఖ్యంగా నాగబాబు అనసూయ కూడా ప్రత్యేకంగా అందరితో మాట్లాడి అండగా నిలిచినట్లు కిరాక్ ఆర్పి తెలియజేశాడు.

అతని.పరిస్థితి విషమంగా

అతని.పరిస్థితి విషమంగా

కిర్రాక్ ఆర్పీ మాట్లాడుతూ.. జబర్దస్త్ కమెడియన్ పంచ్ ప్రసాద్ కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడ్డాడు. డయాలసిస్ కూడా కొనసాగుతోంది అయితే ఒకరోజు అతను హాస్పిటల్లో ఉన్నాడు అని తెలియగానే అందరం వెళ్లి చూసాము. అక్కడ అతని పరిస్థితి చాలా విషమంగానే కనిపించింది. దీంతో వెంటనే నేను వాట్సాప్ గ్రూపులో పంచ ప్రసాద్ బెడ్ పై ఉన్న ఫోటోలు పెట్టాను. ఇక తర్వాత నాగబాబు షూటింగ్లో ఉండగా హఠాత్తుగా బ్రేక్ తీసుకొని కమెడియన్స్ అందరితో ప్రత్యేకంగా మాట్లాడారు.. అని అన్నాడు.

 రెమ్యునరేషన్ ఇవ్వాలని..

రెమ్యునరేషన్ ఇవ్వాలని..

పంచ ప్రసాద్ ఆరోగ్యం బాగోలేనప్పుడు అదే సమయంలో అతని భార్య గర్భవతి ఉండడంతో నాగబాబు తన ఒకరోజు రెమ్యునరేషన్ ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. ఇక ఆయన 2 లక్షల ఇవ్వగా రోజా అనసూయ ఇద్దరు కూడా మరో లక్ష రూపాయలు ఇచ్చారు. ఇక మిగతా వారందరూ కలిసి మొత్తంలో ఒక 6 లక్షలు పోగు చేసి ఆ డబ్బులు పంచ్ ప్రసాద్ భార్యకు నాగబాబు ద్వారా అందించాము. ఇప్పటికి కూడా నాగబాబు గారు ప్రసాద్ ఆరోగ్య గురించి తెలుసుకుంటూ అతనికి సహాయం చేస్తూనే ఉంటారు.. ఆయన మనసు అంత గొప్పది.. అంటూ కిర్రాక్ ఆర్పీ తెలియజేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X