డబ్బుల విషయంలో మోసం.. కత్తులతో చంపాలని ప్లాన్: జబర్దస్త్ కమెడియన్

జబర్దస్త్ కామెడీ షో ద్వారా క్రేజ్ అందుకున్న వారిలో నవీన్ ఒకడు. ఎంతో కాలంగా సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్న నవీన్ కి అవకాశాలు రావడానికి చాలా సమయం పట్టింది. జబర్దస్త్ ద్వారా అదిరే అభి అవకాశం ఇవ్వడంతో మనోడు బాగానే క్లిక్కయ్యాడు. ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఈ కమెడియన్ తన జీవితంలో జరిగిన ఒక భయంకర సంఘటన గురించి బయటపెట్టాడు.

జబర్దస్త్ నుంచి టాలీవుడ్..

జబర్దస్త్ నుంచి టాలీవుడ్..

జబర్దస్త్ షో ద్వారా నవీన్ పేరు గడ్డం నవీన్ గా మారిపోయింది. ఆ తరువాత జూనియర్ రాఘవేంద్రరావు అనే ట్యాగ్ కూడా అందుకున్నాడు. అతని కామెడీ టైమింగ్ ని మెచ్చి కొందరు దర్శకులు సినిమాల్లో కూడా అవకాశం ఇచ్చారు. సినిమాల్లో ఎంత బిజీగా మారినా కూడా జబర్దస్త్ ని వదలేది లేదని నవీన్ చెబుతున్నారు.

ఆ సంఘటన మరచిపోలేను..

ఆ సంఘటన మరచిపోలేను..

నవీన్ తనకు ఎదురైన ఒక చేదు అనుభవం గురించి మాట్లాడుతూ.. నేను జాబ్ చేసే సమయంలో ఒక ఒక వ్యక్తి కత్తులతో నాపై దాడి చేయాలని చూశాడు. అందుకు కారణం డబ్బు. అసలు ఏం జరిగిందంటే.. నా ఫ్రెండ్ వెంకటేష్ ద్వారా మల్లేష్ అనే మరో ఫ్రెండ్ పరిచయమయ్యాడు. అయితే అతని వల్ల ఎదురైన సంఘటనను నేను ఇప్పటికి మర్చిపోలేను.

డబ్బు విషయంలో..

డబ్బు విషయంలో..

ఒక వ్యక్తి దగ్గర 12వేలు కావాలని మల్లేష్ తన బండిని తాకట్టుపెట్టాడు. మల్లేష్ నన్ను కూడా అక్కడికి తీసుకెళ్లాడు. ఆ తరువాత అతను డబ్బులు ఇవ్వకపోవడంతో నేను మధ్యవర్తిగా ఉన్నానని అప్పుల వాళ్ళు నన్ను తగులుకున్నారు. దీంతో ఆ డబ్బు నేను ఇవ్వక తప్పలేదు. అనంతరం మల్లేష్ ని నిలదీయగా అతను మరొక వ్యక్తి దగ్గర డబ్బు తీలుకొని నా డబ్బు నాకు ఇచ్చేశాడు.

మరో సమస్య..

మరో సమస్య..

అంతా కూల్ గా జరిగింది అనుకుంటున్న సమయంలో మల్లేష్ నా కోసం అప్పు చేసినట్లుగా ఆ వ్యక్తి దగ్గర చెప్పడంతో వాళ్ళు మళ్ళీ నా వెంట పడ్డారు. అతను ఇవ్వకపోతే నాకేంటి సంబంధం అని నేను సీరియస్ అయ్యాను. కానీ వాళ్ళు వినలేదు. ఒక దగ్గరికి వస్తే... మ్యాటర్ సెటిల్ చేసుకుందామని నన్ను పిలిచారు.

Recommended Video

Anchor Anasuya Live: She Loses her Mental Balance on Netizen over her Dressing
కత్తులతో దాడి చేయాలని..

కత్తులతో దాడి చేయాలని..

వాళ్ళు చెప్పిన చోటుకు వెళ్లగా ఒక వ్యక్తి స్కూటర్ లో కత్తులు తీసుకొని వచ్చాడు. వాళ్ళు నాపై దాడి చేయడానికి సిద్ధమయ్యారని నాకు అర్ధమయ్యింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నన్ను వెళ్ళనివ్వకుండా అడ్డుకున్నారు. ఇక మొత్తానికి వారి నుంచి తప్పించుకొని పోలీసులకు జరిగింది చెప్పాను. ఆ తర్వాత ఆ ప్రమాదం నుంచి బయటపడటంతో మరోసారి ఎవరిని నమ్మవద్దని తెలుసుకున్నట్లు నవీన్ వివరించాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X