బిగ్‌బాస్ బ్యూటీ సిరి హన్మంతుకు ఆఫర్లు లేకపోతే.. ఆమె ఏం చేసిందంటే? నూకరాజు లీక్ చేసిందేమిటంటే?

టెలివిజన్ పరిశ్రమలో, ఎంటర్‌టైనింగ్ ఇండస్ట్రీలో సిరి హన్మంతు గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. బుల్లితెర, వెండి తెర అనే తేడా లేకుండా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే బిగ్ బాస్ తెలుగు బ్యూటీ, యాంకర్ సిరి హనుమంతు అవకాశాల కోసం ఏం చేసింది అనే ఇంట్రెస్టింగ్ విషయాన్ని జబర్దస్త్ కమెడియన్ నూకరాజు తాజాగా బయట పెట్టాడు. అతను సిరిపై చేసిన ఆసక్తికర కామెంట్స్ పై మనం కూడా ఓ లుక్కేద్దాం పదండి.

సిరి హనుమంతు గురించి తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు సపరేట్ గా పరిచయం అక్కర్లేదు. యూట్యూబ్ వీడియోల ద్వారా పాపులర్ అయిన ఈ బ్యూటీ బిగ్ బాస్ సీజన్ 5లో అడుగు పెట్టి బుల్లితెర ప్రేక్షకులకు మరింతగా దగ్గరయింది. అయితే ఈ షో ద్వారా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకున్న సిరి మరో యూట్యూబర్ షణ్ముక్ కు దగ్గరవుతున్నట్టుగా కనిపించడంతో ఆమెపై తీవ్రమైన నెగెటివిటీ వచ్చింది.

Jabardasth Comedian Nooka Raju intresting comments on Bigg Boss Telugu Fame and Anchor Siri Hanmanthu

అయితే షోలో ఇద్దరూ స్నేహితులుగా ఉన్నప్పటికీ బయటకు వచ్చాక మాత్రం ఎవరి దారి వారు చూసుకున్నారు. ఆ తర్వాత పలు బుల్లితెర షోలలోకి అడుగు పెట్టి సందడి చేస్తోంది ఈ బ్యూటీ. ఇప్పుడు సిరి పాపులర్ టీవీ షో జబర్దస్త్‌లో యాంకర్‌గా చేస్తోంది. ముందుగా సౌమ్యరావు ఈ షోకు హోస్ట్ గా చేస్తుండగా, సడన్ గా ఆమె స్థానంలో సిరి జబర్దస్త్ షోలోకి హోస్ట్ గా అడుగు పెట్టింది. ఈ షో ద్వారా ఆమె మరింతగా పాపులర్ అయ్యే అవకాశం ఉంది. అనసూయ, రష్మి జబర్దస్త్ ద్వారానే పాపులర్ అయిన విషయం తెలిసిందే.

అయితే సాధారణంగానే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాక అందులో పాల్గొన్న సెలబ్రిటీలకు పెద్దగా అవకాశాలు రావు అని టాక్ నడుస్తోంది. తాజాగా దానికి సింక్ అయ్యేలా నూకరాజు సిరిపై వేసిన పంచులు హైలెట్ అవుతున్నాయి.

Jabardasth Comedian Nooka Raju intresting comments on Bigg Boss Telugu Fame and Anchor Siri Hanmanthu

తాజాగా జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. అందులో నూకరాజు స్కిట్ హైలెట్ గా కనిపిస్తోంది. చెప్పులు కుట్టే వాడి పాత్రలో కనిపించిన నూకరాజు ముందుగా జడ్జ్ గా ఉన్న మరో సీనియర్ కమెడియన్ కృష్ణ భగవాన్ పై పంచులు వేశారు. ఆయనకు షూటింగ్ కు వెళ్ళడానికి టైమ్ అవుతోంది. త్వరగా చెప్పులను ఇంటికి పంపించాలి అంటూ ఆత్రంగా కవర్ ఓపెన్ చేయగా, అందులో ఒకటి లేడీ, మరొకటి బాయ్ చెప్పులు కనిపించాయి. నైట్ కన్ఫ్యూజన్లో పంపించినట్టు ఉన్నారు అంటూ కృష్ణ భగవాన్ పై జోకు వేశాడు.

ఆ తర్వాత ఈ చెప్పులు ఎవరివి ఇంతగా అరిగిపోయాయి అని మరో కమెడియన్ ప్రశ్నించగా, అవి యాంకర్ సిరివి అని చెప్పాడు. ఎందుకు ఇంత అరిగిపోయాయి? అనే ప్రశ్నకు అవకాశాల కోసం తిరిగి తిరిగి చెప్పులు అరిగిపోయాయి అని సమాధానం చెప్పాడు నూక రాజు.

మరి ఆమెకు అవకాశాలు దొరికాయా అని అడగ్గా, లేదు మోకాళ్ళు అరిగిపోయాయి అంటూ పంచ్ వేశాడు. అతని పంచ్ కు సిరి ముసి ముసిగా నవ్వుతూ, కొంచెం సీరియస్ లుక్ ఇస్తూ కనిపించింది. అలాగే మిగతా వాళ్ళ స్కిట్స్ కూడా ఇంట్రెస్టింగ్ గా సాగినట్టు ప్రోమోలో చూపించారు. ఈ ఎపిసోడ్ మే 9న గురువారం రోజు ప్రసారం కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X