For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఏడిపించిన జబర్ధస్త్ కమెడియన్: 12 గంటలు అందులోనే ఉండాలి.. పరిస్థితి దారుణం అంటూ ఎమోషనల్

  |

  తెలుగు బుల్లితెరపై చాలా కాలం సందడి చేస్తూ.. ప్రేక్షకులకు మజాను పంచుతోన్న షో జబర్ధస్త్. కామెడీ ప్రధానంగా ప్రారంభం అయిన ఈ కార్యక్రమం దాదాపు ఎనిమిదేళ్లుగా విజయవంతంగా ప్రసారం అవుతోంది. అదే సమయంలో ఎంతో మంది కమెడియన్లను బిగ్ సెలెబ్రిటీలుగా మార్చేసింది. అలాంటి వారిలో నూకరాజు ఒకడు. చిన్న వయసులోనే కమెడియన్‌గా ఎంట్రీ ఇచ్చిన అతడు.. ఇప్పుడు వరుస షోలతో దూసుకుపోతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ కోసం నూకరాజు సరికొత్త అవతారం ఎత్తి అందరినీ ఏడిపించాడు. ఆ వివరాలు మీకోసం!

  పటాస్‌ షోతో పరిచయం అయ్యాడు

  పటాస్‌ షోతో పరిచయం అయ్యాడు


  తెలుగు బుల్లితెరపై ప్రసారం అయిన సక్సెస్‌ఫుల్ షోలలో ‘పటాస్' ఒకటి. స్టాండప్ కామెడీ షోగా వచ్చిన దీని ద్వారానే నూకరాజు బుల్లితెరకు పరిచయం అయ్యాడు. చాలా చిన్న వయసులోనే అద్భుతమైన టాలెంట్‌తో అలరించిన ఈ కుర్రాడు.. అందులో బెస్ట్ కమెడియన్‌గా పేరు సంపాదించుకున్నాడు. ఫలితంగా ఎనలేని గుర్తింపును అందుకుని సత్తా చాటాడీ యంగ్ కమెడియన్.

  అది ఆగిపోవడంతో ఈ షోలోకి ఎంట్రీ

  అది ఆగిపోవడంతో ఈ షోలోకి ఎంట్రీ


  ‘పటాస్' షో చాలా కాలం పాటు విజయవంతంగా ప్రదర్శితం అయింది. అయితే, గత లాక్‌డౌన్ నుంచి ఈ కార్యక్రమాన్ని నిలిపివేశారు. దీంతో నూకరాజు జబర్ధస్త్‌ షోలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక్కడ హేమాహేమీ కమెడియన్లతో పాటు పని చేసిన అతడు.. తనదైన శైలి కామెడీతో అలరించాడు. తద్వారా ఇందులో పర్మినెంట్ ఆర్టిస్టుగా మారిపోయి.. అప్పటి నుంచి కంటిన్యూ అవుతున్నాడు.

  తక్కువ సమయంలోనే ఫుల్ ఫేమస్

  తక్కువ సమయంలోనే ఫుల్ ఫేమస్

  ‘పటాస్'లో కంటే జబర్ధస్త్‌ షోలో చేయడం వల్ల నూకరాజు బాగా ఫేమస్ అయిపోయాడు. సాదాసీదా ఆర్టిస్టుగా ఇందులోకి వచ్చిన ఈ కుర్రాడు.. చాలా తక్కువ సమయంలోనే సెకెండ్ లీడ్‌గా ఎదిగిపోయాడు. గెటప్ శ్రీను తర్వాత పలు విధాలుగా గెటప్‌లు వేస్తూ.. అన్ని రకాల హవాభావాలు పండిస్తూ ప్రేక్షకుల హృదయాలు గెలుచుకున్నాడు. తద్వారా ఫాలోయింగ్‌ను పెంచుకున్నాడు.

  ఆ షోలోనూ భాగమైన కమెడియన్

  ఆ షోలోనూ భాగమైన కమెడియన్


  ప్రముఖ ఛానెల్‌లో ‘శ్రీదేవి డ్రామా కంపెనీ' అనే షో ప్రసారం అవుతోన్న విషయం తెలిసిందే. ప్రతి వారం ఆ కంపెనీ వాళ్లు ఈవెంట్‌ను ప్లాన్ చేసినట్లు దీన్ని ప్రసారం చేస్తుంటారు. దీనికి సుడిగాలి సుధీర్ హోస్టుగా చేస్తుండగా.. జబర్ధస్త్ కమెడియన్లు అంతా ఇందులో పని చేస్తున్నారు. ఇక, ఈ కార్యక్రమంలోనే నూకరాజును బాగా హైలైట్ చేస్తున్నారు. దీంతో అతడు ఉత్సాహంగా చేస్తున్నాడు.

  కామెడీనే కాదు.. అలా కూడా పాడి

  కామెడీనే కాదు.. అలా కూడా పాడి

  నూకరాజు కేవలం కమెడియన్ మాత్రమే కాదు.. అతడితో ఎన్నో రకాల హవభావాలను పలికించగల నైపుణ్యం కూడా ఉంది. అందుకే ఎన్నో స్పెషల్ ఈవెంట్లలో అతడు తన అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు. అదే సమయంలో జడ్జ్‌లు, సెలెబ్రిటీల ప్రశంసలు అందుకున్నాడు. అంతేకాదు, ఆ మధ్య ‘శ్రీదేవి డ్రామా కంపెనీ' షోలో అమ్మ గురించి పాటను పాడి మెప్పించాడీ కుర్రాడు.

  అలా ఏడిపించిన జబర్ధస్త్ నూకరాజు


  వచ్చే వారం ప్రసారం కానున్న ‘శ్రీదేవి డ్రామా కంపెనీ' షోకు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. ఇందులో జంబలకడి పంబ కాన్సెప్టుతో కమెడియన్లు అందరూ అలరించారు. మగ ఆర్టిస్టులంతా ఆడవాళ్లులా.. వాళ్లు వీళ్లలా మారిపోయి స్కిట్లు చేశారు. అలాగే, జబర్ధస్త్ లేడీ గెటప్‌ వేసే వాళ్లంతా డ్యాన్స్ చేశారు. ఇక, చివర్లో నూకరాజు ఎమోషనల్ యాక్టుతో ఏడిపించేశాడు.

  పరిస్థితి దారుణం అంటూ ఎమోషనల్

  పరిస్థితి దారుణం అంటూ ఎమోషనల్


  కరోనా సమయంలోనే కాదు.. మామూలు పరిస్థితుల్లోనూ పారిశుధ్య కార్మికులు ఎలాంటి పనులు చేస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడిదే పాత్రను పోషించి ఎమోషనల్‌గా నటించాడు నూకరాజు. 12 గంటలు మురికిలోనే ఉండాలి అని చెబుతూ ఏడిపించేశాడు. అంతేకాదు, ముక్కు మూసుకుని అన్నం తింటూ వాళ్ల కష్టాన్ని కళ్లకు కట్టినట్లు చూపించాడు. దీంతో ఇది వైరల్ అవుతోంది.

  English summary
  Jabardasth Comedian Nookaraju now Doing Sridevi Drama Company Also. He Done a Frontline Worker Skit in This Show. This Promo Gone Viral On Youtube.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X