ఊళ్ళో బర్రెలు కాశా.. హోటల్‌లో కప్పులు కడిగా.. నాని నేచర్ అలాంటిది.. జబర్దస్త్ కమెడియన్

జీవితంలో ఎవరి లైఫ్ ఎప్పుడు ఎలా టర్న్ తీసుకుంటుందనేది ఎవ్వరూ ఊహించలేరు. సమయమొస్తే ఆటోమేటిక్ గా లైఫ్ టర్న్ అయిపోతుంది. అయితే అలా ఎదగడానికి పడిన తపన, చేసిన కృషిని ఏ నాటికీ మరచిపోలేరు. తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో జబర్దస్త్ నటుడు కొమురం తన కెరీర్ కోసం పడిన కష్టాలను గుర్తుచేసుకున్నారు. హైదరాబాద్ వచ్చి ఓ హోటల్ లో కప్పులు కడిగిన నేను ఈ రోజు స్టార్ హీరో నానితో కలిసి నటించే స్థాయికి రావడం తన అదృష్టమని పేర్కొన్నాడు. వివరాల్లోకి వెళితే..

కేవలం పదో తరగతి చదివిన కొమురం జబర్దస్త్ కామెడీ షో ద్వారా బాగా పాప్యులర్ అయ్యారు. తనదైన కామెడీ టైమింగ్ తో పంచులేస్తూ బుల్లితెర ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టాడు. అలా వచ్చిన క్రేజ్ అతన్ని వెండితెర ప్రయాణానికి బాటలు వేసింది. ఇటీవలే నాని హీరోగా వచ్చిన జెర్సీ సినిమాలో నానితో కలిసి హీరో ఫ్రెండ్ పాత్రలో నటించారు కొమురం. ఈ పాత్ర ఆయనకు వెండితెరపై కూడా ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కొమురం.. నాని గురించి, తన జీవితంలో పడిన కష్టాల గురించి చెప్పుకొచ్చాడు.

Jabardasth Comedian on nanis nature

తాను పదో తరగతి వరకు మాత్రమే చదువుకొని ఊళ్ళో పొలం పనులకు వెళ్తుండేవాడినని, అయితే తాను సరదాగా చేస్తున్న మిమిక్రి చూసి ఊళ్ళో వాళ్లంతా సినిమాల్లో ట్రై చేయమని ప్రోత్సహించడంతో హైదరాబాద్ రావడం జరిగిందని కొమురం చెప్పాడు. అయితే హైదరాబాద్ వచ్చిన కొత్తలో చేతిలో డబ్బులు లేక హోటల్లో కప్పులు కడిగానని చెప్పుకొచ్చాడు. ఇలా ఊళ్ళో బర్రెలు కాసుకొని, హోటల్ కప్పులు కడిగిన నాకు నాని తో నటించే అవకాశం వస్తుందని ఉహించలేదంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ఇక నాని వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తి అని, తనను ఓ ఫ్రెండ్ లా ఆదరించాడని, నానితో కలిసి పని చేయడం తన అదృష్టమని పేర్కొన్నాడు కొమురం.

More from Filmibeat

Read more about: nani నాని
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X