Accident ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన జబర్దస్త్ కమెడియన్.. కారు నుజ్జునుజ్జుగా!
సినీ ఇండస్ట్రీలో ఈ మధ్య వరుస ప్రమాదాలు ప్రేక్షకులను భయపెడుతున్నాయి. ఈ మధ్యనే బుల్లితెర నటి పవిత్ర జయరాం కారు ప్రమాదంలో మరణించిన విషయం తెల్సిందే. ఇంకా ఆ ఘటనను మరువకముందే మరో నటి కారు ప్రమాదానికి గురి అవ్వడం కలవరానికి గురిచేస్తోంది. అయితే ఆమె ఆ ప్రమాదం నుంచి బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆమె ఎవరో కాదు జబర్దస్త్ నటి పవిత్ర.
జబర్దస్త్ ద్వారా పేరు తెచ్చుకున్న లేడీ కమెడియన్స్ లో పవిత్ర ఒకరు. ఆనతి కాలంలోనే పవిత్ర తనదైన కామెడీతో స్టార్ కమెడియన్ గా మారింది. కేవలం జబర్దస్త్ మాత్రమే కాకుండా ఈ మధ్య సినిమాల్లో కూడా మంచి సినిమాలు చేస్తూ బిజీగా మారింది.

తాజాగా జబర్దస్త్ కమెడియన్ పవిత్ర కారుకు ప్రమాదం జరిగింది. ఈ విషయాన్ని ఆమె ఒక వీడియో ద్వారా అభిమానులతో పంచుకుంది. ఆమె ప్రయాణిస్తున్న కారు.. అదుపుతప్పి బోల్తా పడినట్లు పవిత్ర తెలిపింది. అయితే ఈ ప్రమాదంలో తాము ప్రాణాలతో బయటపడినట్లు తెలిపింది.

చిన్న చిన్న గాయాలతో అందరం బతికాం అంటూ ఒక వీడియో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో ప్రమాదానికి గురైన కారును చూపించింది. కారు మొట్ట నుజ్జు నుజ్జు అయ్యినట్లు కనిపిస్తుంది. ఇక తాను ఇలా ప్రాణాలతో బయటపడడం అంతా అభిమానుల ప్రేమ వలనే అంటూ రాసుకొచ్చింది. అంతేకాకుండా కారులో ప్రయాణించేటప్పుడు జాగ్రత్త అని తెలిపింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక పవిత్ర ప్రాణాలతో బయటపడేసరికి ఆమె అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.


Click it and Unblock the Notifications











