అందుకే ట్రాన్స్ జెండర్‌గా మారాను..పడక సుఖం కోసం కాదు.. జబర్దస్త్ కమెడియన్
తెలుగు టెలివిజన్ చానల్స్ లలో టాప్ మోస్ట్ రేటింగ్ అందుకుంటున్న జబర్దస్త్ షోలో అమ్మాయిలుగా కనిపించే మగవాళ్ళు చాలా బిజీ అవుతున్నారు. అయితే క్రమంగా కొంత కాలం తరువాత కమెడియన్స్ ట్రాన్స్ జెండర్స్ గా మారడం అందరిని ఆశ్చర్యపరిచింది. అందులో సాయి తేజ అనే కమెడియన్ కూడా ట్రాన్స్ జెండర్ గా మారిన విషయం తెలిసిందే. అయితే అమ్మాయిలా మారిన తరువాత ఆమె ఎదుర్కొన్న పరిస్థితుల గురించి ఒక ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చింది.
Recommended Video

ట్రాన్స్ జెండర్.. అంత ఈజీ కాదు
సాయి తేజగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన తరువాత కొన్నాళ్లకు ఆపేరేషన్ చేసుకొని ట్రాన్స్ జెండర్ గా మారాడు సాయి తేజ. ఇప్పుడు తన పేరు ప్రియాంక (పింకీ). అయితే ట్రాన్స్ జెండర్ అవ్వడం అనేది అంత ఈజీ కాదని పింకీ చెబుతోంది. మనం ఒక నిర్ణయం తీసుకున్న తరువాత కొన్నిసార్లు తప్పు చేస్తున్నామనే ఒక భావన కూడా కలగవచ్చని చెప్పింది.

ముసుగులో గుద్దులాట అన్నట్టుగా
ప్రియాంక మాట్లాడుతూ.. ముసుగులో గుద్దులాట అన్నట్టుగా కాకుండా ట్రాన్స్ జెండర్ అవ్వాలని అనుకుంటే వెంటనే అయిపోవాలి. కానీ నొప్పులను తట్టుకువడం చాలా కష్టమైన పని. సర్జరీ చేసిన తరువాత కొన్ని రోజుల వరకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. బెడ్ మీద నుంచి బాత్ రూమ్ కి వెళ్ళడానికి నాకు 20 నిమిషాల సమయం పట్టేది.

సెక్స్ అండ్ ఒక వేశ్యగానే చూస్తారు
సమాజంలో చాలా వరకు ట్రాన్స్ జెండర్ అనగానే సెక్స్ అండ్ ఒక వేశ్యగానే చూస్తారు. ఆ విషయంలో ఎవరు ఏమనుకున్నా కూడా మనం ప్రవర్తించే విధానాన్ని బట్టి ఉంటుంది. సమాజంలో గౌరవంగా బ్రతకాలి అంటే మంచి జాబ్ చేసుకోవాలని ఉంటుంది. ఇక ట్రాన్స్ జెండర్ గా తాను ఏ పని పడితే ఆ పనులు చేయవద్దని అనుకున్నా. కేవలం నాకు నచ్చిన పని మాత్రమే చేస్తాను. ఒక చోట కాకపోతే మరొక చోట అవకాశం దొరుకుతుంది అనే ఆలోచన నాది.

ఆ సుఖం కోసం కాదు
నేను ట్రాన్స్ జెండర్ గా మారింది సెక్స్ కోసమో..పడక సుఖం కోసమే..కాదు. నాకు చిన్నప్పటి నుంచి అమ్మాయిగా మారాలని కోరిక ఉంది. ఇక 20 ఏళ్ల వయసులోకి వచ్చిన తరువాత నా శరీరంలో మార్పులను గమనించి అమ్మాయిగా మరాను. ఆపరేషన్ చేసుకున్న సమయంలో ఎంతో నొప్పిని భరించాను.
సర్జరీ అనంతరం ఒక్కసారిగా దాదాపు 85కేజీల వరకు పెరిగిపోయింది.

వాళ్ళతో కాస్త సాన్నిహిత్యంగా ఉంటే..
సినిమాల్లో ఒక మంచి నటిగా గుర్తింపు తెచ్చుకోవాలనే ఆలోచన తప్ప మరోక విషయం గురించి నేను ఆలోచించను. జబర్దస్త్ టీమ్ సభ్యులు నేను అబ్బయిగా ఉన్నప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలానే ఉన్నారు. కానీ వాళ్ళతో కాస్త సాన్నిహిత్యంగా ఉంటే ఏమైనా అనుకుంటారేమో అని భయం నాలో ఉంది. చాలా వరకు నా హద్దుల్లో నేను ఉంటాను. నా పని పూర్తి చేసుకొని వచ్చేస్తాను.. అంటూ ప్రియాంక తన జీవిన శైలి గురించి వివరణ ఇచ్చింది.


Click it and Unblock the Notifications











