Jabardasth: అనారోగ్యంతో మరింత ఇబ్బంధుల్లో కమెడియన్.. చివరికి నడవలేని స్థితిలో..

జబర్దస్త్ ద్వారా చాలా మంది కమెడియన్స్ కు మంచి క్రేజ్ దక్కింది. అంతే కాకుండా ఆర్ధికంగా కూడా కొందరు సొంత ఇంటి కలను నెరవేర్చుకున్నారు. ఇక ఆ షో ద్వారా మరికొందరు సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకునే ప్రయత్నం చేశారు. ఇప్పుడు కొందరు హీరోలుగా కూడా అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఒక జబర్దస్త్ కమెడియన్ మాత్రం పలు అనారోగ్య సమస్యలతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. అతను నడవలేని పరిస్థితుల్లో కూడా ఉన్నట్లు ఇటీవల ఒక వీడియోను విడుదల చేశారు. ఆ వివరాల్లోకి వెళితే..

మొదట సైడ్ కమెడియన్ గా

మొదట సైడ్ కమెడియన్ గా

జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపు అందుకున్న కమెడియన్స్ లలో పంచ ప్రసాద్ కూడా ఒకరు. అతను మొదట ఇతరుల టీమ్ లో ఒక సైడ్ కమెడియన్ గా కొనసాగుతూ వచ్చి ఆ తర్వాత టీం లీడర్ గా మారిన విషయం తెలిసిందే. అతనితోపాటు మరి కొంతమంది కమెడియన్స్ కూడా అతనికి తోడుగా ఉండి జబర్దస్త్ లో సక్సెస్ అయ్యే విధంగా సహాయ పడ్డారు.

జబర్దస్త్ వేదికగా

జబర్దస్త్ వేదికగా

అయితే పంచ్ ప్రసాద్ మొదట్లో తన అనారోగ్య విషయం గురించి కూడా ఎవరితోనూ చెప్పుకోలేదు. అతని కామెడీకి మంచి క్రేజ్ వచ్చిన తర్వాత యూట్యూబ్ లో అతని కామెడీ వీడియోలకు మంచి వ్యూవ్స్ పెరిగాయి. దీంతో ఫాలోవర్స్ కూడా కొంతవరకు పెరుగుతూ వచ్చారు. ఇక ఒక రోజు జబర్దస్త్ వేదికగానే అతను తన అనారోగ్య పరిస్థితి గురించి చెప్పాడు.

ఆ సమస్యలతో బాధపడుతూ..

ఆ సమస్యలతో బాధపడుతూ..

పంచ ప్రసాద్ కిడ్నీ సంబంధిత వ్యాధులతో ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. ఇదివరకే అతనికి కిడ్నీ మార్పిడి జరిగింది. అతని భార్య కూడా ఎంతగానో సపోర్ట్ చేసి క్లిష్టమైన పరిస్థితిలో కూడా వీడలేదు. ఇక అతనికి ఆమధ్య జబర్దస్త్ కమెడియన్స్ తో పాటు నాగబాబు కూడా సహాయంగా ఉన్నారు. ప్రతివారం డయాలసిస్ చేసుకుంటూ జబర్దస్త్ లో అతను అందరిని నవ్విస్తూ ఉండేవాడు.

పంచ్ ప్రసాద్ వద్దని చెప్పినా..

పంచ్ ప్రసాద్ వద్దని చెప్పినా..

ఇటీవల కాలంలో పంచ్ ప్రసాద్ ఆరోగ్య పరిస్థితి మరికొంత క్షీణించినట్లుగా తెలుస్తోంది. రీసెంట్ గా అతని యూట్యూబ్ ఛానల్ నుంచే మరొక వీడియోను విడుదల చేయడం జరిగింది. కమెడియన్ జోడి నూకరాజు ఆసియా ప్రత్యేకంగా పంచ్ ప్రసాద్ కు సంబంధించిన వీడియోను పోస్ట్ చేశారు. ఇక ఆయన పరిస్థితిని అర్థం చేసుకొని సపోర్ట్ చేయాలని కూడా కోరారు. అయితే పంచ ప్రసాద్ ఆ వీడియోలు వ్లాగ్ తీయవద్దు అని చెప్పినప్పటికీ కూడా నూకరాజు బ్రతిమాలి అతని పరిస్థితి గురించి చెప్పమని అన్నాడు.

నడవలేని పరిస్థితిలో

పంచ ప్రసాద్ భార్య తన భర్త ఆరోగ్యం గురించి ఎమోషనల్ అవుతూ వివరణ ఇచ్చింది. ప్రస్తుతం అతను కాళ్లు వాచిపోయాయి అని నడవలేని పరిస్థితిలో ఉన్నాడు అని ఆమె తెలిపింది. ప్రస్తుతం అతను నడుము నొప్పితో కూడా బాధపడుతున్నట్లుగా వివరణ ఇచ్చారు. మొదట డాక్టర్లకు కూడా ఆ విషయం గురించి అర్థం కాలేదట. టెస్టులు చేసిన తర్వాత నడుము వెనుక వైపు వరకు కొంచెం ఇన్ఫెక్షన్ వచ్చినట్లుగా చీము పట్టేసినట్లుగా వైద్యులు చెప్పినట్లు ఆమె తెలియజేసింది. ఇక ప్రసాద్ వద్దని చెప్పినప్పటికీ కూడా నూకరాజు ఆ వీడియో షూట్ చేసి యూట్యూబ్ ఛానల్ కు కూడా సపోర్ట్ చేయాలని వారు కోరారు. ఇక ప్రస్తుతం అభిమానులను ఈ వీడియో కంటతడి పెట్టిస్తోంది

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X