Jabardasth Prasad: ప్రాణాపాయ స్థితిలో జబర్దస్త్ కమెడియన్ ప్రసాద్.. షాకింగ్ పోస్ట్ వైరల్

జబర్దస్త్ నుంచి ఎంతోమంది కమెడియన్స్ మంచి జీవితాన్ని అందుకున్నారు. ఎక్కడి నుంచో వచ్చి తమ టాలెంట్ తో ఇక్కడే సెటిల్ అయిపోయారు. ఒక్కొక్కరు వివిధ రకాలుగా తమైదన శైలీలో నవ్విస్తూ సత్తా చాటుతున్నారు. అందులో పంచ్ లకు పెట్టింది పేరుగా ప్రసాద్ గుర్తింపు తెచ్చుకున్నాడు. జబర్దస్త్ తోపాటు వివిధ టీవీ షోలలో, ప్రోగ్రామ్స్ లలో తన పంచులతో అలరిస్తుంటాడు.

అలాంటి పంచ్ ప్రసాద్ ఆరోగ్య పరిస్థితి సీరియస్ గా ఉందని తెలుస్తోంది. అలాగే ప్రసాద్ ఆరోగ్యానికి అయ్యే ఖర్చుకు దాతలు కావాల్సిందిగా సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టాడు మరో కమెడియన్ ఇమ్మాన్యుయేల్.

Jabardasth Comedian Punch Prasad In Critical Condition And Immanuel Post Viral

చాలా మంది కమెడియన్లకు ప్రాణంగా నిలిచింది జబర్దస్త్ కామెడీ షో. అయితే నవ్వు వెనుక ఏడుపు కూడా ఉంటుందన్నట్లుగా ఒక్కో కమెడియన్ జీవితంలో ఒక్కో విషాదం కూడా ఉంది. అలాంటి విషాదమే జబర్దస్త్ పంచ్ ప్రసాద్ జీవితంలో కూడా ఉంది.

జబర్దస్త్ షో చూసేవారికి పంచ్ ప్రసాద్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. వెంకీ మంకీస్ టీమ్ లో తనదైన శైలీలో పంచ్ డైలాగ్ లు వేసి నవ్విస్తుంటాడు పంచ్ ప్రసాద్. అప్పట్లో వరుసగా కనిపించిన ప్రసాద్ తర్వాత కొన్ని రోజులపాటు స్క్రీన్ పై కనిపించలేదు.

పంచ్ ప్రసాద్ రెండు కిడ్నీలు దాదాపుగా 80 శాతం పాడైపోయాయి. అతను డయాలిసిస్ చేయించుకుంటున్నాడు. తన సమస్యలపై షోలలో జోకులు వేస్తూ ప్రేక్షకులను నవ్వించే పంచ్ ప్రసాద్ ను తాజాగా మరో సమస్య వేధిస్తోంది. ప్రస్తుతం పంచ్ ప్రసాద్ అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి ఏర్పడింది.

ఈ విషయాన్ని అప్పట్లో నూకరాజు ఓ వీడియోను యూట్యూబ్ లో అప్ లోడ్ చేయడంతో తెలిసింది. తర్వాత కోలుకుని టీవీ షోలో పాల్గొన్న అతనికి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు. త్వరలో ఆపరేషన్ చేయాలని, దానికి చాలా ఖర్చు అవుతుందని సమాచారం.

ప్రసాద్ హెల్త్ కండీషన్ సీరియస్ గా ఉందని తోటి కమెడియన్ జబర్దస్త్ ఇమ్మాన్యూయెల్ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. "అన్నకు సీరియస్ గా ఉంది. డాక్టర్లు ఆపరేషన్ చేయాలని చెప్పారు. దానికి చాలా ఖర్చు అవుతుంది. మేం అంతా చాలా ట్రై చేస్తున్నాం. మీరు కూడా హెల్ప్ చేస్తారని కోరుకుంటున్నాను" అని ఆ పోస్టులో శ్రీపెల్లి సునీత పేరుతో బ్యాంక్ నేమ్, అకౌంట్, ఐఎఫ్ఎస్సీ కోడ్ వివరాలు ఉంచారు. అలాగే కుర్చీలో ఆక్సీజన్ మాస్క్ పెట్టుకుని ఉన్న పంచ్ ప్రసాద్ ఫొటో హృదయవిదారకరంగా ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X