Jabardasth అతడితో స్వలింగ సంపర్కం.. జబర్దస్త్ కమెడియన్‌తో గే రిలేషన్ పై పంచ్ ప్రసాద్ క్లారిటీ

జబర్దస్త్ కామెడీ షోలో కనిపించే పలువురు కమెడియన్ల పైన ఎప్పటికప్పుడు సంచలన రూమర్లు వైరల్ అవుతూ ఉంటాయి. ఇక వాళ్లు కూడా ఎప్పటికప్పుడు పలు ఇంటర్వ్యూల ద్వారా తమపై వచ్చే రూమర్లకు క్లారిటీ ఇస్తారు. తాజాగా పంచ్ ప్రసాద్ తనకు బాగా దగ్గరైన ఓ జబర్దస్త్ కమెడియన్ తో ఉన్న రిలేషన్ షిప్ గురించి వెల్లడించారు. తామిద్దరం గే కాదంటూ క్లారిటీ ఇచ్చారు. మరి ఎవరితో రిలేషన్షిప్ గురించి పంచ్ ప్రసాద్ ఇలాంటి వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది అనే ఇంట్రెస్టింగ్ టాపిక్ పై ఓ లుక్కేద్దాం.

జబర్దస్త్ ద్వారా ఆటో రాంప్రసాద్, సుడిగాలి సుధీర్, చమ్మక్ చంద్ర, వేణు యల్దండి, గెటప్ శ్రీను, అభినయ్ కృష్ణ లాంటి వాళ్ళు ఎంతో మంది పాపులర్ అయ్యారు. పంచ్ ప్రసాద్ కూడా వాళ్లలో ఒకరే. జబర్దస్త్ కామెడీ షోలో టీం లీడర్ గా చేసి ఎంతో మంది ముఖాల్లో చిరునవ్వును తీసుకొచ్చాడు పంచ్ ప్రసాద్. ఇక ఆ తర్వాత పలు కారణాల వల్ల జబర్దస్త్ షోకు దూరమైనప్పటికీ అడపా దడపా ఇంటర్వ్యూల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.

Jabardasth Comedian Punch Prasad revelation on Gay Relationship with Nooka Raju

తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో జబర్దస్త్ కమెడియన్ నూకరాజుతో తన రిలేషన్షిప్ గురించి మాట్లాడారు పంచ్ ప్రసాద్. ఓ ఇంటర్వ్యూలో పంచ్ ప్రసాద్ తో పాటు నూకరాజు కూడా సందడి చేశారు. అయితే ఒకవేళ మీరిద్దరూ బిగ్ బాస్ హౌస్ లోకి అవకాశం వస్తే వెళ్తారా? అనే ప్రశ్నకు ఇంట్రెస్టింగ్ గా స్పందించారు పంచ్ ప్రసాద్.

నూకరాజు అయితే కచ్చితంగా వెళ్తాడని, ఎందుకంటే అతను ఓపెన్ బుక్ లాంటి వాడని పంచ్ ప్రసాద్ చెప్పారు. ప్రస్తుతం ఇతని గురించి తనకు మాత్రమీ తెలుసని, బిగ్ బాస్ హౌస్ కి వెళ్తే అందరికీ తెలుస్తుందని అన్నారు. నూకరాజు అక్కడ అందరితోనూ ఏదో ఒకరకంగా వరుస కలిపేసుకుంటాడని, ముఖ్యంగా ఎక్కువగా గర్ల్ ఫ్రెండ్స్ ను సెట్ చేసుకుంటాడని పంచ్ చేశాడు.

Jabardasth Comedian Punch Prasad revelation on Gay Relationship with Nooka Raju

ఇక తాను కూడా అవకాశం వస్తే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లడానికి రెడీగా ఉన్నానని, అక్కడ నూకరాజు ఉంటే చాలు ఇంకెవ్వరూ అక్కర్లేదని, తమ రిలేషన్ అలాంటిది అని పంచ్ ప్రసాద్ వెల్లడించారు. వెంటనే తను అన్న కామెంట్ అపార్థానికి దారి తీసే అవకాశం ఉందన్నట్టుగా ఎక్స్ ప్రెషన్ పెట్టి, అలాగని తామిద్దరం గేలు కాదని క్లారిటీ ఇచ్చాడు. మొత్తానికి వీరిద్దరి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ ఎప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నారు వాళ్ళ అభిమానులు.

ఇక నూకరాజు తరచుగా ఆసియాతో ప్రేమాయణానికి సంబంధించిన విషయాలతో వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. అలాగే జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి బుల్లితెర షోలతో ఆడియన్స్ ను అలరిస్తున్నాడు. మరోవైపు పంచ్ ప్రసాద్ కొంతకాలంగా అనారోగ్యం కారణంగా బుల్లితెరకు దూరమయ్యాడు. ఇప్పుడు అవకాశాల కోసం వెతుక్కుంటున్నాడు. మరి వీరిద్దరిలో ఒక్కరికైనా బిగ్ బాస్ హౌజ్ లోకి అడుగు పెట్టే అవకాశం దక్కుతుందా అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X