Punch Prasad: "నా ఫ్యాన్ అంటే పెళ్లి చేసుకున్నా.. ఇప్పుడు నా భార్యే నన్ను ఛీ కొడుతోంది"
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు ఎంటర్ టైన్ చేస్తూ.. కడుపుబ్బా నవ్వించడంలో అందరికంటే ముందుండే షో జబర్దస్త్ గురించి అందరికీ తెలిసిందే. అద్భుతమైన కామెడీ స్కిట్లు చేస్తూ.. రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులను అలరిస్తుంటారు. ముఖ్యంగా ఈ షోలో పాల్గొన్న ప్రతీ కమెడియన్ కు మంచి పేరే వచ్చింది. అలా విపరీతమైన గుర్తింపు తెచ్చుకున్న వాళ్లలో ఒకడే పంచ్ ప్రసాద్. అయితే మొన్నటి వరకు తీవ్ర అనారోగ్యం పాలైన ఇతడు.. ఇప్పుడిప్పుడే దాని నుంచి కోలుకుంటున్నారు.
అనారోగ్య సమయంలో ఈయన భార్య ఇతడి వెంటనే ఉంటూ విపరీతమైన సేవలు చేసింది. పంచ్ ప్రసాద్ కు అండగా నిలిచి ఆయనను బాగు చేయించుకుంది. కానీ తొలిసారి పంచ్ ప్రసాద్ తన భార్య గురించి షాకింగ్ కామెంట్లు చేశారు. తన అభిమాని అని చెబితే ఆమెను పెళ్లి చేసుకున్నట్లు వివరించారు. అలాంటి తన భార్యే ఇప్పుడు తనను ఛీ కొడుతుందని వివరించారు. అయితే ఇంతకాలం కంటికి రెప్పలా కాపాడుకున్న ఈమె ఈయనను ఎందుకు ఛీ కొడుతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

జబర్దస్త్ షోలో ఎంతో మంది కమెడియన్లు ఉన్నప్పటికీ.. పంచ్ ప్రసాద్ కు మంచి గుర్తింపు వచ్చింది. ఆయన వేసే పంచులే ఆయనకు విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టాయి. తనదైన కామెడీ టైమింగ్ తో.. సీరియస్ గా ఉన్న సమయంలోనూ పంచులు వేసి అందరినీ నవ్విస్తుంటారు. ఆయన ఎక్కుడున్నా సరే.. ఆయన సీరియస్ గా చెబుతున్నారా, జోక్ చెబుతున్నారా అనేది చాలా సేపటి వరకు అర్థం కాదు. కానీ ఆయనున్న చోట నిలబడ్డ వాళ్లంతా కడుపుబ్బా నవ్వాల్సిందే.
ఇలా అందరినీ నవ్వించే ఈయన జీవితంలో అనేక కష్టాలు ఉన్నాయి. ముఖ్యంగా అనేక అనారోగ్య సమస్యలతో తీవ్రంగా బాధ పడిన ఈయన చావు అంచుల వరకూ వెళ్లి వచ్చారు. అదృష్టవశాత్తు ప్రాణాలతో బయట పడిన ఈయన ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నట్లు తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ఈక్రమంలోనే తన జీవితంలో జరిగిన అనేక విషయాల గురించి చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా తన భార్య సునీతపై సెన్సేషనల్ కామెంట్లు చేశాడు.
ముఖ్యంగా తన అభిమాని అంటూ చెప్పి తనపై ప్రేమ కురిపించగా.. తాను సునీతను పెళ్లి చేసుకున్నానని చెప్పుకొచ్చాడు పంచ్ ప్రసాద్. ఒకప్పుడు తాను వేసే పంచులు అన్నా, చేసే కామెడీ అన్నా ఆమె చాలా ఇష్టపడేది అని కానీ ఇప్పుడు మాత్రం పంచులు వేస్తే ఛీ కొడుతుందని వివరించాడు. ఆయన ఆరోగ్యం పూర్తిగా కోలుకోగా.. తన భార్య పలు అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నట్లు వివరించాడు. తనకు ఎవరైనా అవకాశం ఇస్తే.. తాను ఇప్పుడే చేసేందుకు రెడీగా ఉన్నట్లు చెప్పుకొచ్చాడు. ఆరోగ్యం బాగాలేని సమయంలోనే అనేక షోలు చేసిన తాను ఇప్పుడు అంతకు మించి చేయాలనుకుంటున్నట్లు స్పష్టం చేశాడు.


Click it and Unblock the Notifications











