ఆందోళనకరంగా జబర్ధస్త్ కమెడియన్ ఆరోగ్యం.. ప్రాణాంతక వ్యాధితో బాధపడుతూ..

By Manoj

బుల్లితెర చరిత్రలో ఎన్నో కార్యక్రమాలు వస్తుంటాయి.. పోతుంటాయి. అయితే, వాటిలో కొన్ని మాత్రమే ప్రజాధరణను పొందుతాయి. అలాంటి వాటిలో ప్రముఖ కామెడీ షో జబర్ధస్త్ ఒకటి. 2013లో ప్రారంభమైన ఈ షో నేటికీ అంతే స్పందనను దక్కించుకుంటూ నెంబర్ వన్ కామెడీ షోగా నిలుస్తోంది. టీఆర్పీ రేటింగ్‌లో కూడా ఏమాత్రం తగ్గకుండా దూసుకుపోతోంది. ఇంత సక్సెస్‌ఫుల్ షోలో తనదైన శైలితో కామెడీని పండిస్తున్న ఓ ప్రముఖ ఆర్టిస్టు ప్రాణాంతకమైన వ్యాధితో బాధపడుతున్నాడు. వైద్యం చేయించుకుని మరీ షూటింగ్‌కు వస్తున్నాడు. ఇంతకీ ఎవరతను.? వివరాల్లోకి వెళ్తే..

 వందల మంది బయటకు వచ్చారు

వందల మంది బయటకు వచ్చారు

దాదాపు ఏడేళ్లుగా జబర్ధస్త్ తన హవాను చూపిస్తోంది. ప్రారంభంలో వారంలో ఒకరోజు మాత్రమే ప్రసారం అయిన ఈ షో.. ఆ తర్వాత రెండు రోజులకు చేరింది. ఈ క్రమంలోనే జబర్ధస్త్ వల్ల ఎంతో మంది టాలెంటెడ్ ఆర్టిస్టులు వెలుగులోకి వచ్చారు. ప్రస్తుతం వాళ్లంతా సెలెబ్రిటీలుగా వెలుగొందుతున్నారు. అదే సమయంలో సినిమాల్లోనూ నటిస్తూ మెప్పిస్తున్నారు.

వాళ్లిద్దరికీ కూడా చాలా ప్లస్ అయింది

వాళ్లిద్దరికీ కూడా చాలా ప్లస్ అయింది

జబర్ధస్త్ వల్ల ఆర్టిస్టులు, టెక్నీషియన్లు మాత్రమే లాభ పడలేదు. ఈ షోకు మొదటి నుంచి జడ్జ్‌లుగా వ్యవహరించిన రోజా, నాగబాబు కూడా మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. సక్సెస్‌ఫుల్ షోతో నాగబాబు నవ్వుల రారాజు అయితే... రోజా మాత్రం ప్రజల అభిమానం చూరగొని ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈ విషయాన్ని ఆమె చాలా సార్లు వెల్లడించిన విషయం తెలిసిందే.

జబర్ధస్త్‌లో కుదుపులు.. వాళ్లంతా ఔట్

జబర్ధస్త్‌లో కుదుపులు.. వాళ్లంతా ఔట్

చాలా కాలంగా సక్సెస్‌ఫుల్‌గా ప్రసారం అవుతోన్న జబర్ధస్త్ షోలో ఇటీవల కొన్ని కుదుపులు ఏర్పడ్డ విషయం తెలిసిందే. మొదటి నుంచీ ఈ షోకు జడ్జ్‌గా వ్యవహరించిన నాగబాబు.. బయటకు వెళ్లిపోవడంతో పాటు వేరే చానెల్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. జబర్ధస్త్‌కు పోటీగా ‘అదిరింది' అనే షో ప్రారంభించి... చాలా మంది టీమ్ లీడర్లు, ఆర్టిస్టులను తీసుకు వెళ్లిపోయారు.

నవ్వించే ఆర్టిస్టుల వెనుక కన్నీళ్లు కూడా..

నవ్వించే ఆర్టిస్టుల వెనుక కన్నీళ్లు కూడా..

జబర్ధస్త్‌లో ఎంతో మంది కమెడియన్లు ప్రేక్షకులను ఆనందాన్ని పంచుతున్నారు. ఈ షో ప్రసారం అవుతున్నంత సేపూ హాయిగా నవ్వుకునేలా చేస్తున్నారు. అయితే, ఈ నవ్వులు పంచే ఆర్టిస్టుల వెనుక ఎన్నో కన్నీటి కథలు ఉన్నాయి. తినడానికి తిండి లేని వాళ్లు, చాలా కష్టాలు పడి నగరానికి వచ్చిన వాళ్లు, గూడు లేని వాళ్లు ఇలా చాలా మంది ఇప్పుడు సక్సెస్ అయ్యారు.

 ప్రాణాంతక వ్యాధితో జబర్ధస్త్ కమెడియన్

ప్రాణాంతక వ్యాధితో జబర్ధస్త్ కమెడియన్

ఈ షో ద్వారా గుర్తింపు తెచ్చుకున్న వారిలో ఒకడైన పంచ్ ప్రసాద్ ప్రాణాంతకమైన కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాడు. అందుకే చాలా కాలం షోకు దూరంగా ఉన్నాడు. ఈ విషయాన్ని అతడే పలుమార్లు వెల్లడించాడు. రీఎంట్రీలో తన ఆరోగ్యంపై తానే పంచులు వేసుకుంటూ నవ్విస్తున్నాడు. అతడి సమస్యను కొద్ది రోజుల క్రితం నాగబాబు కూడా వెల్లడించిన సంగతి విధితమే.

Recommended Video

Jabardasth Comedy Show Management New Rules To Comedians
 ఆస్పత్రి నుంచే షూటింగ్‌కు వస్తున్నాడు.!

ఆస్పత్రి నుంచే షూటింగ్‌కు వస్తున్నాడు.!

చాలా రోజుల పాటు జబర్ధస్త్‌కు దూరం అయ్యాడు పంచ్ ప్రసాద్. అతడి వ్యాధి గురించి తెలిసిన రోజా, నాగబాబు సహా ఇతర ఆర్టిస్టులు కొంత ఆర్థిక సహాయం కూడా చేశారు. కానీ, అవి సర్జరీ మాత్రం చేయించుకునేందుకు సరిపోలేదు. దీంతో తరచూ డయాలసిస్ చేయించుకుంటూ కాలం వెల్లదీస్తున్నాడు. కొన్ని సార్లు డయాలసిస్ సెంటర్ నుంచి నేరుగా షూట్‌కు కూడా వచ్చేవాడని తెలిసింది.

ఎవరీ పంచ్ ప్రసాద్.. అతడి నేపథ్యం ఇదే

ఎవరీ పంచ్ ప్రసాద్.. అతడి నేపథ్యం ఇదే

పంచ్ ప్రసాద్ జబర్ధస్త్‌లోకి ఎంటర్ అయిన తొలినాళ్లలో పలువురి స్కిట్లలో చేసేవాడు. ఆ తర్వాత వెంకీ మంకీస్ టీమ్‌లో సభ్యుడిగా పని చేసిన అతడు.. ఎన్నో స్కిట్లను ఒంటి చేత్తో లేపాడు. దీంతో అతడి టాలెంట్ గుర్తించిన నిర్వహకులు.. పొట్టి నరేష్‌తో కలిపి టీమ్ లీడర్‌ను చేశారు. ఈ క్రమంలోనే పంచ్ ప్రసాద్.. నాటీ నరేష్ అనే పేరుతో చాలా కాలం టీమ్ లీడర్‌గా చేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X