జబర్ధస్త్ కమెడియన్ ఆరోగ్యం విషమం: షాకింగ్ న్యూస్ చెప్పిన డాక్టర్.. ప్రాణాన్ని పణంగా పెట్టి మరీ!

బుల్లితెర చరిత్రలో కేవలం కొన్ని షోలు మాత్రమే ప్రేక్షకాదరణతో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతుంటాయి. అలాంటి వాటిలో ప్రముఖ కామెడీ షో జబర్ధస్త్ ఒకటి. దాదాపు ఎనిమిదేళ్లుగా ఈ షో నెంబర్ వన్ స్థానంలోనే కొనసాగుతూ దూసుకుపోతోంది. దీంతో ఈ షో పేరిట టెలివిజన్‌లో ఎన్నో రికార్డులు నమోదవుతున్నాయి. ఇక, ఈ షో ద్వారానే ఎంతో మంది కమెడియన్లు వెలుగులోకి వచ్చారు. అలాంటి వారిలో పంచ్ ప్రసాద్ ఒకడు. చాలా కాలం పాటు ఓ వెలుగు వెలిగిన అతడు.. కిడ్నీ సమస్యతో షోకు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో ఈ కమెడియన్ గురించి షాకింగ్ న్యూస్ తెలిసింది. ఆ వివరాలు మీకోసం!

ఆర్టిస్టులతో పాటు వాళ్లందరికి ప్లస్ అయింది

ఆర్టిస్టులతో పాటు వాళ్లందరికి ప్లస్ అయింది

జబర్ధస్త్ షో ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపింది అని చెప్పొచ్చు. టాలెంట్ ఉండి అవకాశాలు దొరకని చాలా మంది ఈ షో ద్వారా సెలెబ్రిటీలుగా మారిపోయారు. తద్వారా వరుస ఆఫర్లు అందుకుంటూ దూసుకుపోతున్నారు. అదే సమయంలో దీనికి జడ్జ్‌లుగా చేస్తున్న రోజా, యాంకర్లు అనసూయ భరద్వాజ్, రష్మీ గౌతమ్‌తో పాటు ఎంతో మంది కెరీర్లకు ప్లస్ అయిందని చెప్పొచ్చు.

కమెడియన్ల నవ్వుల వెనుక కన్నీటి కష్టాలు

కమెడియన్ల నవ్వుల వెనుక కన్నీటి కష్టాలు

ఈ కామెడీ షో ద్వారా ఎంతో మంది కమెడియన్లు ప్రేక్షకులను నవ్వులను పంచుతున్నారు. ఈ షో ప్రసారం అవుతున్నంత సేపూ హాయిగా ఎంజాయ్ చేసేలా చేస్తున్నారు. అయితే, ఈ నవ్వులు పంచే ఆర్టిస్టుల వెనుక ఎన్నో కన్నీటి కథలు ఉన్నాయి. తినడానికి తిండి లేని వాళ్లు, ఉండడానికి ఇల్లు లేని వాళ్లు, చాలా కష్టాలు పడి నగరానికి వచ్చిన వాళ్లు ఇలా చాలా మందే ఉన్నారు.

ఆర్టిస్టు నుంచి టీమ్ లీడర్... నరేష్‌తో కలిసి

ఆర్టిస్టు నుంచి టీమ్ లీడర్... నరేష్‌తో కలిసి

ఏమాత్రం బ్యాగ్రౌండ్ లేకపోయిన జబర్ధస్త్‌లోకి ఎంట్రీ ఇచ్చిన వారిలో పంచ్ ప్రసాద్ ఒకడు. కెరీర్ ఆరంభంలో వెంకీ మంకీస్ టీమ్‌లో సభ్యుడిగా పని చేసిన అతడు.. ఎన్నో స్కిట్లను ఒంటి చేత్తో లేపాడు. దీంతో అతడి టాలెంట్ గుర్తించిన నిర్వహకులు.. పొట్టి నరేష్‌తో కలిపి టీమ్ లీడర్‌ను చేశారు. ఈ క్రమంలోనే పంచ్ ప్రసాద్.. నాటీ నరేష్ అనే పేరుతో చాలా కాలం టీమ్ లీడర్‌గా చేశాడు.

ప్రాణాంతక వ్యాధితో బాధ పడుతోన్న ప్రసాద్

ప్రాణాంతక వ్యాధితో బాధ పడుతోన్న ప్రసాద్

ఈ షో ద్వారా గుర్తింపు తెచ్చుకున్న వారిలో ఒకడైన పంచ్ ప్రసాద్ ప్రాణాంతకమైన కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాడు. అందుకే చాలా కాలం షోకు దూరంగా ఉన్నాడు. ఈ విషయాన్ని అతడే పలుమార్లు వెల్లడించాడు. రీఎంట్రీలో తన ఆరోగ్యంపై తానే పంచులు వేసుకుంటూ నవ్విస్తున్నాడు. అతడి సమస్యను కొద్ది రోజుల క్రితం నాగబాబు కూడా వెల్లడించిన సంగతి విధితమే.

ఆస్పత్రి నుంచే షూటింగ్‌కు.. వాళ్ల సహాయం

ఆస్పత్రి నుంచే షూటింగ్‌కు.. వాళ్ల సహాయం

చాలా రోజుల పాటు జబర్ధస్త్‌కు దూరం అయ్యాడు పంచ్ ప్రసాద్. అతడి వ్యాధి గురించి తెలిసిన రోజా, నాగబాబు సహా ఇతర ఆర్టిస్టులు కొంత ఆర్థిక సహాయం కూడా చేశారు. కానీ, అవి సర్జరీ మాత్రం చేయించుకునేందుకు సరిపోలేదు. దీంతో తరచూ డయాలసిస్ చేయించుకుంటూ కాలం వెల్లదీస్తున్నాడు. కొన్ని సార్లు డయాలసిస్ సెంటర్ నుంచి నేరుగా షూట్‌కు కూడా వచ్చేవాడని తెలిసింది.

విషమంగానే జబర్ధస్త్ కమెడియన్ ఆరోగ్యం

విషమంగానే జబర్ధస్త్ కమెడియన్ ఆరోగ్యం

పంచ్ ప్రసాద్ తన భార్యతో కలిసి 'శ్రీదేవి డ్రామా కంపెనీ' షోకు వచ్చాడు. ఈ సందర్భంగా అతడి ఆరోగ్య పరిస్థితి గురించి షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి. ఈ కమెడియన్ ఇంకా కిడ్నీ సమస్యతోనే బాధ పడుతున్నాడట. అవయవాన్ని మార్చితే తప్ప కోలుకోలేని పరిస్థితి ఉందని అతడే స్వయంగా వెల్లడించాడు. అంతేకాదు, త్వరలోనే అతి జరుగుతుందని కూడా చెప్పాడు.

అలా చెప్పిన డాక్టర్.. ప్రాణాన్ని పణంగా పెట్టి

అలా చెప్పిన డాక్టర్.. ప్రాణాన్ని పణంగా పెట్టి

ఈ షోలో తన భార్య గురించి ప్రసాద్ చెబుతూ.. 'మేమిద్దరం లవ్ చేసుకుని ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాం. అప్పుడే నాకు కిడ్నీ సమస్య వచ్చింది. నన్ను చేసుకోవద్దని డాక్టర్ తనకు చెప్పారు. ఎన్ని రోజులు బతికినా కలిసే బతుకుతాం అంటూ పెళ్లి చేసుకుంది' అని తెలిపాడు. ఇక, ప్రసాద్ కోసం అతడి భార్యే ప్రాణాన్ని పణంగా పెట్టి మరీ కిడ్నీ దానం చేయబోతుందని రాంప్రసాద్ చెప్పడంతో ఆమెను అందరూ ప్రశంసించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X