Jabardasth ఆమె అంటే రైజింగ్ రాజుకు అంత పిచ్చా?.. లవ్ లైఫ్ కోసం 10 ఏళ్లు ఇండస్ట్రీకి దూరంగా!
ఏళ్లుగా తెలుగు ప్రజలను కడుపుబ్బా నవ్విస్తూ, వినోదాన్ని అందిస్తున్న జబర్దస్త్ వేదిక ఎంతోమంది కమెడియన్స్‌ని ప్రజలకు దగ్గర చేసింది. ఇక్కడ తమ టాలెంట్ నిరూపించుకుని సినిమాల్లో అవకాశాలు దక్కించుకున్నవారు ఎందరో వున్నారు. ధనరాజ్, చలాకీ చంటి, షకలక శంకర్, సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, హైపర్ ఆది వంటి వారు చిత్రపరిశ్రమలో దూసుకెళ్తున్నారు. అయితే తెరపై కామెడీ చేసేవాళ్లంతా నిజజీవితంలో అంతే ఆనందరంగా వుండరు. వారు మామూలు మనుషులే.. వాళ్ల జీవితాల్లోనూ కన్నీళ్లు, కష్టాలు చాలానే వుంటాయి.
ఎక్స్‌ట్రా జబర్దస్త్‌లో హైపర్ ఆది టీంలో గోదావరి జిల్లా యాసతో మంచి పాపులారిటీ సంపాదించిన నటుడు రైజింగ్ రాజు. లేటు వయసులో ఆర్టిస్ట్ అయినప్పటికీ తన కామెడీ, టైమింగ్‌తో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ స్థాయికి రావడం వెనుక రాజు కన్నీటిగాథ వుంది. ఎన్నో కష్టాలను దిగమింగుకుని మనల్ని మాత్రం కడుపుబ్బా నవ్విస్తున్నాడు. ఎన్నో ఇంటర్వ్యూలలో ఈ విషయాలను పంచుకుని రైజింగ్ రాజు కంటతడి పెట్టుకునేవాడు.


ఇదిలావుండగా .. తన టీమ్ లీడర్ హైపర్ ఆదిపై ఎన్నోసార్లు , ఎన్నో వేదికల మీద ప్రశంసల వర్షం కురిపించారు రాజు. భారతదేశంలో కరోనా ఉద్ధృతంగా వున్న వేళ కొన్ని స్కిట్లలో రాజు కనిపించలేదు. దీంతో ఆయనకు ఏమైనా అయ్యిందా.. లేక జబర్దస్త్‌ను వదిలేశాడేమోనని ప్రేక్షకులు భయపడ్డారు. కానీ రాజు స్కిట్లలో లేకున్నా అతడే పేరును మాత్రం కొనసాగించాడు ఆది. అంతేకాదు.. స్కిట్లలో పాల్గొనకపోయినా రాజుకు పారితోషికం పంపేవాడట ఆది.
ఆ సమయంలో రైజింగ్ రాజుకు మనుమరాలు పుట్టి, ఆయన ఇంట్లోనే వుందట. షూటింగ్ కోసం బయటకు వెళ్తే వైరస్ అంటుకునే ప్రమాదం వుంటుందనే ఉద్దేశంతో రాజు ఇంట్లోనే వుండేవారట. ఆయన పరిస్ధితిని అర్ధం చేసుకున్న హైపర్ ఆది.. స్కిట్లలో లేకపోయినా పారితోషికం పంపించారట. చిన్నవాడు కాబట్టి ఆగిపోతున్నా కానీ లేదంటే ఆదికి పాదాభివందనం చేసేవాడినని రాజు తన టీమ్ లీడర్ గొప్పతనాన్ని వివరించేవారు.


Click it and Unblock the Notifications











